S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/11/2016 - 05:45

వాషింగ్టన్, డిసెంబర్ 10: జీవనోపాధి కోసం పొట్ట చేతబట్టుకుని అమెరికాలో అడుగిడుతున్న విదేశీయులపై పదేపదే అక్కసు వెళ్లగక్కుతున్న ఆ దేశ తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన నైజాన్ని చాటుకున్నాడు. అమెరికాలోని సంస్థల్లో స్థానికులకు బదులుగా విదేశీయులను ఉద్యోగాల్లో చేర్చుకోవడాన్ని అనుమతించే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పాడు.

12/11/2016 - 05:42

న్యూఢిల్లీ,డిసెంబర్ 10: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ఫైబర్ గ్రిడ్‌ను ప్రారంభించడం ద్వారా ప్రజలకు అతి చౌకగా ఇంటర్నెట్, టీవీ, టెలిఫోన్ కనెక్షన్లను అందిస్తుందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి చెప్పారు. కేవలం 149 రూపాయలకే ఈ సదుపాయాలను అందజేయనున్నట్లు ఆయన చెప్పారు.

12/11/2016 - 05:18

విశాఖపట్నం(క్రైం), డిసెంబర్ 10: నకిలీ అభరణాలపై బంగారు పూత పూసి వాటిని బంగారు ఆభరణాలుగా బ్యాంక్ సిబ్బందిని నమ్మించి తనఖా పెట్టి రూ. ఆరు కోట్ల మేర నగదు కాజేసిన ఓ మోసగాడిని, అతనికి సహకరించిన మరో పదకొండు మందిని నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

12/11/2016 - 05:18

విశాఖపట్నం, డిసెంబర్ 10: ఉత్తరాంధ్రలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఈ నెల 19న దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత ద్రోణంరాజు సత్యనారాయణ జయంతి సందర్భంగా విశాఖలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలని పిసిసి ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ ఇన్‌ఛార్జి గుంటూరు భారతి ఆధ్వర్యంలో శనివారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

12/11/2016 - 05:17

విశాఖపట్నం, డిసెంబర్ 10: స్వచ్ఛ భారత్‌లో భాగంగా నగర పరిధిలో తడి, పొడి చెత్త సేకరణ, విభజన ఉత్పత్తి కేంద్రంలోనే జరగాలని జివిఎంసి కమిషనర్ హరినారాయణన్ అన్నారు. జివిఎంసి సమావేశ మందిరంలో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు, బల్క్ వేస్ట్ ప్రొడ్యూసర్స్‌తో శనివారం నాడిక్కడ అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తడి చెత్తను కంపోస్ట్‌గా మార్చుకుంటే చెత్త సమస్య సగం తీరినట్టేనన్నారు.

12/11/2016 - 05:16

విశాఖపట్నం, డిసెంబర్ 10: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వార్తా తుపాను శనివారం సాయంత్రానికి పెను తుపానుగా మారడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తుపాను ప్రభావం ఉత్తరాంధ్రపై పెద్దగా ఉండనప్పటికీ అధికారులు ముందు జాగ్రత్త చర్యలుగా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.

12/11/2016 - 05:16

నర్సీపట్నం, డిసెంబర్ 10: సీలేరు నుండి నర్సీపట్నం మీదుగా సబ్బవరం వరకు వంద అడుగుల జాతీయ రహదారి తో పాటు సీలేరు నుండి నర్సీపట్నం మీదుగా తుని వరకూ మరో జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈ జాతీయ రహదారులు నర్సీపట్నం మెయిన్ రోడ్డు మీదుగా వంద అడుగుల వెడల్పుతో విస్తరణ చేపడతారన్నారు.

12/11/2016 - 05:15

నర్సీపట్నం, డిసెంబర్ 10: గ్రూప్-2,3 నోటిఫికేషన్లు విడుదలైన నేపథ్యంలో పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఉచిత శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు విశాఖ జిల్లాలో విశాఖపట్నం, అనకాపల్లి, నర్సీపట్నం ప్రాంతాల్లో ఈ ఉచిత కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

12/11/2016 - 05:14

మాకవరపాలెం, డిసెంబర్ 10: గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థులు క్రీడల్లో ఆసక్తి కనబరిచి రాణించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆన్నారు. శనివారం మండల కేంద్రమైన మాకవరపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో నియోజకవర్గ స్థాయి ఖేలో ఇండియా ఆటల పోటీలను మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా జ్యోతిప్రజ్వలన చేసి ఆటల పోటీలను ప్రారంభించారు.

12/11/2016 - 05:14

అరకులోయ, డిసెంబర్ 10: ముఖ్యమంత్రి చంద్రబాబు దత్తత తీసుకున్న అరకులోయ మండలంలోని పెదలబుడు మేజర్ పంచాయతీలో కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ శనివారం విస్తృతంగా పర్యటించారు. పంచాయతీలోని పలు గ్రామాల్లో పర్యటించి అభివృద్ధి పథకాలను పర్యవేక్షించారు. నిర్మాణ దశలో ఉన్న తాగునీటి పథకాలను పరిశీలించి పలు సూచనలు చేసారు. తాంగులగుడ గ్రామంలో నిర్మిస్తున్న సి.సి.రోడ్డు పనులను ఆయన పరిశీలించారు.

Pages