S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/11/2016 - 04:58

విజయనగరం, డిసెంబర్ 10: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలోని నానక్‌రాంగుడాలో ఏడంతస్తుల భవనం కూలిన సంఘటనలో జిల్లాకు చెందిన 9 మంది మృత్యువాతపడిన విషయం విధితమే. శనివారం ఉదయం రెండు అంబులెన్స్‌లు, సాయంత్రం ఒక అంబులెన్స్‌లో మృతదేహాలను ఆయా స్వస్థలాలకు తరలించారు.

12/11/2016 - 04:57

భగవద్గీతను అవగాహన చేసుకొంటే సులభంగా ఈ భవసాగరాన్ని ఈదవచ్చు. భగవద్గీతను పఠిస్తే చాలు సగుణాకార పూజనుంచి నిర్గుణపూజ విధానానికి మారుతారు. ప్రతి రోజు అతిశ్రద్ధతో పూలుపరిమళాలద్ది పూజించే పరమాత్మను నిస్సంగునిగా తెలుసుకొంటారు. వారు సంసారజీవితంలో ఉంటూనే నిస్సంగత్వాన్ని అలవర్చుకుంటారు.

12/11/2016 - 04:54

ఏలూరు, డిసెంబర్ 10 : పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకోసం కొత్తగా 18 ఇళ్లకాలనీలను ఆధునిక వసతిసౌకర్యాలతో ఏర్పాటు చేయడానికి ఒక ప్రణాళిక అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో శనివారం సేద్యపునీటి ప్రాజెక్టులు, జాతీయ రహదారుల నిర్మాణ పనుల ప్రగతి తీరుపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.

12/11/2016 - 04:52

అశ్వమేథ రాజసూయాధ్వరాలు చేసి సముపార్జించిన పుణ్యఫలాలు కాశీపురిలో మూడు రాత్రులు శయనించినంత మాత్రాన సమకూరుతాయి. తులా పురుషదానం (మానవుడు త్రాసులో తూగి ఆ ఎత్తు ధనం దానమివ్వడం) చేసిన ఫలం కాశీ క్షేత్రాన్ని దర్శించినంత మాత్రం చేతనే సిద్ధిస్తుంది.

12/11/2016 - 04:51

శ్రీకాకుళం: తమ సమస్యలపై తాడోపేడో తేల్చుకునేందుకు కాంట్రాక్టు లెక్చరర్లు సిద్ధమయ్యారు. కొద్దిరోజులుగా ధర్నాలు, ర్యాలీలు, బహిరంగ సభలు, నిరవధిక సమ్మెలు వంటి నిరసనలకు సైతం ప్రభుత్వం దిగిరాకపోవడంతో వారంతా ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఓట్లు కోసం ఇచ్చిన బూటకపు భరోసా అంటూ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తున్నారు.

12/11/2016 - 04:48

చివరకు అనుకున్న రోజు వచ్చేసరికి అతడి మానసిక ఆందోళన మరింత పెరిగింది. అందుకే.. ఆమెనక్కడ చూడడంతో అతడి ఆనందానికి హద్దు లేకుండా పోయింది.
అదే ఊపులో ఆమె ముందుకు వెళ్లి, ‘‘సాహిత్యా’’ అని పిలిచాడు. అతడి మనసులో ఉప్పొంగుతోన్న సంతోషం అతడి కంఠస్వరాన్ని అదుపు చేయలేకపోవడంతో అతడి పిలుపు కూడా అరుపులా వినిపించింది సాహిత్యకూ, ఆమె పక్కన కూర్చున్నవాళ్లకూ.

12/11/2016 - 04:47

ఒంగోలు,డిసెంబర్ 10:బ్యాంకులకు మూడురోజులు సెలవులు కావటంతో ఆయాశాఖల పరిధిలోని ఎటిఎంలన్నీ నోక్యాష్‌బోర్డులు పెట్టేశాయి. దీంతో జిల్లావ్యాప్తంగా ప్రజలు నగదుకోసం పడిగాపులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది.

12/11/2016 - 04:44

చెప్పకు చేసిన మేలు నొ
కప్పుడయినగాని దాని హర్షింపరు గా
గొప్పలు చెప్పిన నదియును
తప్పేయని చిత్తమందు దలపు కుమారీ!

12/11/2016 - 04:42

నెల్లూరు, డిసెంబర్ 10: రోజురోజుకి తీరాన్ని సమీపిస్తున్న వార్ధా తుఫాన్ భయంతో జిల్లావాసులకు కంటి మీద కునుకు లేని పరిస్థితి నెలకొంది. ఈనెల 8న అండమాన్ దీవుల సమీపంలో ఏర్పడిన అల్పపీడనం క్రమేణా బలపడి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం వార్ధాగా నామకరణం చేసుకున్న ఈ తుఫాన్ నెల్లూరుకు ఆగ్నేయంగా సుమారు 780 కిమీ దూరంలో కేంద్రీకృతమై, దక్షిణ దిశగా పయనిస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

12/11/2016 - 04:39

కర్నూలు, డిసెంబర్ 10 : జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా చలి విజృంభించింది. గత నాలుగు రోజులుగా చలి వాతావరణం ఎక్కువగా కనిపిస్తున్నా శనివారం తెల్లవారుజామున ఏకంగా 13 డిగ్రీల స్థాయికి పడిపోయింది. గత 10రోజులుగా 14, 15 డిగ్రీల స్థాయిలో నమోదవుతూ సాధారణ స్థితి ఉన్నప్పటికీ అది కాస్త మరింత పడిపోవడంతో ప్రజలు చలికి వణికిపోయారు. తెల్లవారుజాము నుంచి ఉదయం 7గంటల వరకూ మంచు కురిసింది.

Pages