S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/26/2016 - 15:57

తిరుపతి: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో 18కోట్ల రూపాయలతో శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని, వచ్చే నెలలో శంకుస్థాపన చేయించాలని టిటిడి పాలకమండలి నిర్ణయించింది. ఇక్కడ మంగళవారం జరిగిన టిటిడి బోర్డు సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. తిరుమల ఆలయంలో నగలు, వివిధ వస్తువుల తయారీకి భారీగా నిధులు కేటాయించారు.

04/26/2016 - 15:57

హైదరాబాద్: తెలంగాణలో దుర్భిక్ష పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నప్పటికీ రైతులకు సాయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు పిఎల్ విశే్వశ్వరరావు జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో మంగళవారం ఫిర్యాదు దాఖలు చేశారు. ఉపాధి హామీ పథకానికి కేంద్రం నిధులిచ్చినా వాటిని ఖర్చు చేయడం లేదన్నారు.

04/26/2016 - 14:47

దిల్లీ: భారీగా డబ్బు లేదా మంత్రి పదవులను ఎరగా వేసి తమ పార్టీ ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్న ఎపి సిఎం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వైకాపా అధినేత జగన్ ఆరోపించారు. ‘సేవ్ డమొక్రసీ’ యాత్ర సందర్భంగా మంగళవారం ఆయన ఇక్కడ పలువురు రాజకీయ నేతలను కలిసి ఎపిలో ఫిరాయింపురాజకీయాలపై ఫిర్యాదు చేశారు.

04/26/2016 - 14:46

తిరుపతి: కోయంబత్తూర్‌కు చెందిన సత్యవాణి, సంపత్‌కుమార్ దంపతులు తిరుమలలోని రామ్‌బగీచ అతిథిగృహంలో ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం వెలుగుచూసింది. మూడు రోజులుగా గది తలుపులు తెరవక పోవడంతో అతిథిగృహం ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బలవంతంగా తలుపులు తెరిచిచూడగా దంపతులు ఉరి వేసుకుని మరణించినట్లు కనుగొన్నారు.

04/26/2016 - 14:46

దిల్లీ: రాష్టప్రతి కోటాలో నియమితులైన రాజ్యసభ సభ్యులు మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఉప రాష్టప్రతి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హమీద్ అన్సారీ కొత్తగా నామినేట్ అయిన మేరీ కోమ్, సుబ్రహ్మణ్య స్వామి, స్వపన్‌దాస్ గుప్తా, నరేంద్ర జాదవ్, సుఖ్‌దేవ్ సింగ్‌లచేత ప్రమాణం చేయించారు.

04/26/2016 - 14:46

హైదరాబాద్: తెరాసలో చేరే ముందు తమ పార్టీ ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామాలు చేయాలని అసెంబ్లీలో కాంగ్రెస్ నేత జానారెడ్డి డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని హేళన చేసేలా అధికార తెరాస ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాసకు ప్రజలు గుణపాఠం చెప్పేరోజు తొందరలోనే వస్తుందన్నారు.

04/26/2016 - 14:45

విశాఖ: ఇద్దరు పిల్లల మధ్య గొడవ ఫలితంగా రెండు ప్రాణాలు గాలిలో కలిసిపోయిన విషాద సంఘటన విశాఖ జిల్లా పెదబయలు మండలం చిముడుపల్లిలో మంగళవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు కొర్ర మత్స్యరాజు, కొర్ర కొట్టయ్యల కొడుకులిద్దరూ సోమవారం ఆడుకుంటూ ఒకరినొకరు కొట్టుకున్నారు. దీంతో తన కొడుకును ఎందుకు కొట్టావంతూ మత్య్యరాజు ఈరోజు తెల్లవారు జామున కొట్టయ్య కుమారుడు వినయ్‌పై కత్తితో దాడి చేశాడు.

04/26/2016 - 14:45

అనంతపురం: అనేక చోరీలతో సంబంధం ఉన్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి, వారి నుంచి 33 తులాల బంగారు నగలు, 5కిలోల వెండి, ఆరు పంచలోహ విగ్రహాలను మంగళవారం స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా పోలీసులు తెలిపారు.

04/26/2016 - 14:44

విజయవాడ: ప్రతి వాన చినుకునూ ఒడిసిపట్టుకునేలా ప్రజలంతా ఇంకుడుగుంతలు, పంటకుంటల నిర్మాణాన్ని ఉద్యమంలా చేపట్టాలని ఎపి సిఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా అధికారులు చొరవ చూపాలని ఆయన మంగళవారం టెలీకాన్ఫరెన్స్‌లో సూచించారు. ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును ఆయన సమీక్షించారు.

04/26/2016 - 14:44

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో సూపరింటెండెంట్లు మోహన్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, కల్యాణకట్ట ఉద్యోగి తంగవేలుకు చెందిన ఇళ్లపై మంగళవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు ప్రారంభించారు. అక్రమాస్తులకు సంబంధించి వీరిపై ఆరోపణలు రావడంతో ఈ దాడులు ప్రారంభించారని తెలిసింది.

Pages