S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/16/2016 - 06:57

న్యూఢిల్లీ, మే 15: విదేశీ మదుపరులు మళ్లీ పెట్టుబడుల ఉపసంహరణ దిశగా నడుస్తున్నారు. గత రెండు వారాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి 178 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులను లాగేసుకున్నారు. నిజానికి ఈ ఏడాది తొలి రెండు నెలల్లోనూ పెట్టుబడుల ఉపసంహరణల ధ్యాసతోనే నడిచిన విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ).. మలి రెండు నెలల్లో మాత్రం పెట్టుబడుల ప్రవాహాన్ని సృష్టించారు.

05/16/2016 - 06:49

చండీగఢ్, మే 15: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపిఎల్ ప్లే ఆఫ్‌లో స్థానాన్ని దాదాపు ఖాయం చేసుకుంది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ అర్ధ శతకం, చివరిలో యువరాజ్ సింగ్ అద్భుత బ్యాటింగ్ నైపుణ్యం సన్‌రైజర్స్‌ను పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని సంపాదించిపెట్టాయి. ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరఫున షహీం ఆమ్లా చేసిన పోరాటం వృథాకాగా, ఆ జట్టు ఐపిఎల్ నుంచి నిష్క్రమించింది.

05/16/2016 - 06:47

కోల్‌కతా, మే 15: వర్షం కురిసి ఆటకు అంతరాయం ఏర్పడినప్పుడు విజేతను నిర్ణయించడానికి లేదా లక్ష్యాన్ని నిర్ధారించడానికి అనుసరిస్తున్న డక్‌వర్త్ లూయిస్ విధానంపై రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ కోచ్, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టెఫెన్ ఫ్లెమింగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీనిని మించిన పరమ చెత్త విధానం మరొకటి లేదని వ్యాఖ్యానించాడు.

05/16/2016 - 06:46

బార్సిలోనా, మే 15: స్పానిష్ సాకర్ చాంపియన్‌షిప్ ‘లా లిగా’ టైటిల్‌ను బార్సిలోనా కైవసం చేసుకుంది. గ్రనడాతో జరిగిన మ్యాచ్‌ని 3-0 తేడాతో గెల్చుకొని, మొత్తం 91 పాయింట్లతో టాపర్‌గా నిలిచింది. లూయిస్ సౌరెజ్ హ్యాట్రిక్‌తో రాణించి బార్సిలోనాకు టైటిల్‌ను సాధించిపెట్టాడు. ఈ టోర్నీలో బార్సిలోనా విజేతగా నిలవడం ఇది 24వ సారి.

05/16/2016 - 06:45

విశాఖపట్నం (స్పోర్ట్స్), మే 15: డిఫెండింగ్ చాంపియన్ గా ఐపిఎల్‌లో బరిలోకి దిగిన ముంబయ ఇండియన్స్ ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా నిలిచాయ. ఆదివారం ఢిల్లీ డేర్‌డెవి ల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ జట్టు 80 పరుగుల భారీ తే డాతో విజయభేరి మోగించింది.

05/16/2016 - 06:45

కున్షాన్ (చైనా), మే 15: థామస్ కప్ కోసం పురుషుల విభాగంలో జరిగే పోటీల్లో మొదటి రోజు భారత్‌కు చుక్కెదురైంది. థాయిలాండ్‌తో తలపడిన భారత్ 2-3 తేడాతో ఓడింది. సింగిల్స్ విభాగంలో సాయి ప్రణీత్, సౌరభ్ వర్మ విజయాలను నమోదు చేయగా, అజయ్ జయరాం చివరి వరకూ పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది. మొదటి మ్యాచ్‌లో బరిలోకి దిగిన అజయ్ జయరామ్ 16-21, 21-12, 14-21 తేడాతో తనోన్‌సాక్ సయెసమ్‌బూన్సుక్ చేతిలో పరాజయాన్ని చవిచూశాడు.

05/16/2016 - 06:44

న్యూఢిల్లీ, మే 15: అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా) పాలక కమిటీ డిప్యూటీ చైర్మన్‌గా భారత విశ్రాంతి న్యాయమూర్తి ముకుల్ ముద్గల్ ఎంపికైనట్టు సమాచారం. అయితే, ఈ విషయంపై తనకు ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారం లభించలేదని ముద్గల్ తెలిపారు.

05/16/2016 - 06:33

తమని, తమ మతాన్ని అవమానించేవారిని ముస్లింలు, క్రైస్తవులు ఎంతమాత్రం సహించరు. హిందువులే నోరుమెదపరు కనుక అందరికీ లోకువైపోయారు. ఈమధ్యే వారిలో కొద్దిపాటి మార్పు కనిపిస్తోంది. సకల సదుపాయాలూ, వైభోగాలు అనుభవిస్తూ కూడా షారూక్‌ఖాన్, అమీర్‌ఖాన్‌లు దేశంలో అసంతృప్తి పెరిగిపోతున్నది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోపగించిన కొన్ని హిందూ సంఘాలు వారి సినిమాలను బహిష్కరించగా అమీర్ కళ్లు తెరచుకున్నాయి.

05/16/2016 - 06:35

ఏమైతేనేల? ధర్మ సందేహాల పుట్ట దాని మీద కొట్టకుండా, పుట్ట చుట్టూ నాగస్వరం పెట్టిన సుప్రీంకోర్టు తన సర్వోన్నత ఆధిపత్యాన్ని నిరూపించుకొని- ఉత్తరాఖండ్‌లో యేర్పడిన సంక్షోభాన్ని గట్టెక్కించింది. అక్కడ ప్రజలు అమ్మయ్య ఓ గవర్నమెంటు ఏర్పడింది అనుకొనేలాగా చేసింది.

05/16/2016 - 06:29

అందరం ఈ మట్టిలో కలసిపోవలసిందే, ముందు వెనుక అంతే, అనే మాటలు తరచు పెద్దల నోట వినిపిస్తుంటాయి. ఈ మాటలను పలు రకాలుగా వాడుతుంటారు. అవి ఎలా వున్నా నిజానికిది ప్రకృతి సహజ నియమం. జీవులన్నీ మట్టి నుండే పుడతాయి. చివరకు ఆ మట్టిలోనే కలసిపోతాయి. లక్షలాది సంవత్సరాలుగా ప్రకృతి చక్రం ఇలా తిరుగుతూ సహజ సమతుల్యతను కాపాడుకొంటుంది. నేలలో విత్తుకు నీరు, వాతావరణాలు సమపాళ్ళలో అందితే మొక్కగా మొలుస్తుంది.

Pages