S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/11/2016 - 01:24

గతవారం మెరుపులో ప్రచురించిన నల్లధనంపై కవితలు చాలా బాగున్నాయి. అర్ధరాత్రి నిర్ణయం శీర్షికతో చాకలికొండ శారదగారు రాసిన కవిత సామాన్యుల కష్టాలను వర్ణించింది. అలాగే యుద్ధం పేరుతో కుర్రాప్రసాద్ గారు రాసిన కవిత ఇంకా బాగుంది. నల్లధనాన్ని స్వాగతిస్తూ చిన్న చిన్న ఇబ్బందులు సహజమే.. భరిద్దాం అంటూ ఉత్తేజభరితంగా రాసిన ప్రసాద్‌గారికి ధన్యవాదములు. కొడవలూరు ప్రసాదరావు గారి కవిత నల్లధనమా పారిపో కూడా బాగుంది.

12/11/2016 - 01:13

విమర్శ లేకుండా జీవితం గడవదు. మనకు ఇష్టం వున్నా లేకున్నా ఎప్పుడూ విమర్శ కొనసాగుతూనే ఉంటుంది. విమర్శల్లో సద్విమర్శ కూడా ఉంటుంది. విమర్శలోని మంచిని మనం గ్రహించగలగాలి. అప్పుడు కొంత వృద్ధి చేసుకోగలుగుతాం.

12/11/2016 - 01:11

చిన్నప్పుడు ప్రపంచమంతా మన ముందు వున్నట్టుగా అన్పించేది. ప్రతిదీ తాజాగా కొత్తగా అన్పించేది. తెలియకుండానే మనలో ఏవో కోరికలు కలిగేవి. పైకి చెప్పడానికి బిడియంగా అన్పించేది. కానీ ఎన్నో కోరికలు కలిగేవి.

12/11/2016 - 01:07

తిరిగి హరిదాసు చెప్పే రామకథని ఆశే్లష వినసాగాడు.
దితి దుఃఖిస్తూ దేవేంద్రుడితో చెప్పింది.

12/11/2016 - 01:04

ఒక ఫంక్షన్‌లో 72 మంది పాల్గొన్నారు. అందులో పురుషులకన్నా స్ర్తిలు రెండు రెట్లు, స్ర్తిలకు ఒకటిన్నర రెట్లు పిల్లలు పాల్గొన్నారు. అయితే వారి సంఖ్య విడివిడిగా ఎంత?

జ: 12 పురుషులు, 24 మహిళలు, 36 మంది పిల్లలు

12/11/2016 - 00:55

ధరణీపుత్ర మహారాజుకు లేకలేక కలిగిన ఏకైక సంతానం భోగేశ్వర్. ఆ బిడ్డను ఎంతో గారాబంగా అల్లారుముద్దుగా పెంచసాగారు. గురుకులానికి పంపి విద్యాబుద్ధులు నేర్పవలసిన వయస్సు వచ్చినా ఆ విషయంపై మహారాజు అంత ఆసక్తి చూపలేదు. తన కుమారుడ్ని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేనని మహాపండితుల్ని, గురువుల్ని రాజమందిరానికే పిలిపించి చదువు చెప్పమని ఆదేశించారు.

12/11/2016 - 00:52

బంతిలా గుండ్రంగా కన్పిస్తున్న ఈ చేపలను ‘పఫర్’ ఫిష్ అంటారు. మామూలుగా ఉన్నప్పుడు సాధారణ చేపల్లానే కన్పిస్తాయి. కానీ ప్రమాదం పొంచి ఉందని భావించినప్పుడు పొట్టలోకి గాలి లేదా నీటిని పీల్చి ఉబ్బిపోయి ఇలా గుండ్రంగా తయారవుతాయి. గ్లోబ్ ఫిష్, టోడ్ ఫిష్, బ్లోఫిష్, స్వెల్‌ఫిష్ ఇలా ఎన్నో పేర్లతో వీటిని పిలుస్తారు. ఇవి విషపూరితమైనవి. వీటిలో టెట్రోడొటొ అనే విషం ఉంటుంది. ఇది సైనైడ్ కన్నా ప్రమాదకరమైనది.

12/11/2016 - 00:49

సాధారణంగా పుష్పాలు తెలుపు సహా విభిన్నమైన, ఆకర్షణీయమైన రంగుల్లో కనిపిస్తాయి కదా!. కానీ ఇక్కడ కనిపిస్తున్న పూలు నల్లగా ఉన్నాయి కదూ!. 12 అంగుళాల వ్యాసార్థంతో ఉండే ఈ పూలకు 24 అంగుళాల పొడవుంటే మీసాల్లాండి కేసరాలు ప్రత్యేక ఆకర్షణ. వెడల్పుగా ఉంటే దళాలతో కన్పించే ఈ నల్లని పూలు గబ్బిలాల మాదిరిగా ఉండటం చేత వీటిని ‘బ్లాక్ బాట్ ఫ్లవర్’ అని పిలుస్తారు. వీటిలో తెల్లని రకమూ ఉన్నాయి.

12/11/2016 - 00:47

వీసిల్స్ కుటుంబానికి చెందిన ‘బడ్జర్’లకు శుభ్రత ఎక్కువ. యుకె, ఉత్తర అమెరికా, కొన్ని ఆసియా దేశాల్లో మాత్రమే కనిపించే ఇవి నివసించే బొరియల్లో మలమూత్ర విసర్జన చేయవుగాక చేయవు. ఆహారాన్ని కూడా గుహలో తినవు. ఎప్పటికప్పుడు అవి నివాసాన్ని శుభ్రం చేసుకుంటూంటాయి. మలమూత్రాలు గుహ బయటే చేస్తాయి.

12/11/2016 - 00:42

బలాఢ్యుడవై, ధైర్యశాలివై నిలబడు.. బాధ్యతనంతా నీ మీదే పెట్టుకో
నీ విధికి నీవే విధాతవని తెలుసుకో - స్వామి వివేకానంద

Pages