S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/27/2015 - 15:26

న్యూఢిల్లీ: డీఎంకే నేత, కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్‌కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆయన పెట్టుకున్న పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం వారం రోజుల్లోగా సీబీఐ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. కాగా, టెలికాం కుంభకోణం కేసులో మారన్ ఆరోపణలు ఎదుర్కొంటోన్నన విషయం తెలిసిందే.

11/27/2015 - 13:59

విజయవాడ: వివాదాలకు తావులేకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తామని, పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపడతామని ఏపీపీఎస్సీ చైర్మన్పిన్నమనేని ఉదయ్‌భాస్కర్ అన్నారు. శుక్రవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంతటి గురుతరమైన బాధ్యతను తనకు అప్పగించిన ఏపీ ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

11/27/2015 - 13:48

నెల్లూరు : ఆనం సోదరులు టిడిపిలో చేరేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో శుక్రవారంనాడు ఆనం సోదరులు మీడియా సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆనం వివేకానందరెడ్డి మాట్లాడుతూ సామాజిక బాధ్యతతోనే టిడిపిలో చేరాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆనం నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రజాసేవే తమ లక్ష్యమని వెల్లడించారు.

11/27/2015 - 13:48

చిత్తూరు : ఏడాదికి 400 కి.మీ చొప్పున ఐదేళ్లలో గ్రామీణ ప్రాంత రోడ్ల నిర్మాణం పూర్తిచేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయన నారావారిపల్లెలో జన్మభూమి కమిటీ సభ్యులు, అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం చేపడతామని వెల్లడించారు.

11/27/2015 - 13:47

హన్మకొండ : వరంగల్ జిల్లా హన్మకొండలో పోలీసులు విస్తత్ర తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో బస్డాండ్‌లో పేలుడు పదార్థాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తి సంచిలో పేలుడు పదార్థాలు ఉంచి పరారయ్యాడు. ఆ వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

11/27/2015 - 13:46

హైదరాబాద్ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తెలంగాణలో భూముల రీసర్వే నిర్వహిస్తామని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ రేమండ్ పీటర్ తెలిపారు. హైదరాబాద్‌లోని తాజ్ డెక్కన్ హోటల్‌లో సెంటర్ ఫర్ ల్యాండ్ యూజ్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో శుక్రవారంనాడు జాతీయ భూ సర్వే విధానం-ల్యాండ్ రికార్డ్ ఆధునిక పద్ధతులు అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ భూ సర్వేకు కేంద్రం నిధులు కూడా ఇచ్చిందని అన్నారు.

11/27/2015 - 12:54

హైదరాబాద్ : హైదరాబాద్ లో నలుగురు సభ్యుల డ్రగ్స్ ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. గోవా నుంచి డ్రగ్స్ తీసుకుని హైదరాబాద్ లో విద్యార్థులకు విక్రయిస్తుండగా వారిని పోలీసులు పట్టుకున్నారు. ముఠా నుంచి భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

11/27/2015 - 12:52

న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ అండ్ డైరెక్టరేట్ నుంచి తాఖీదులందాయి. మనీలాండరింగ్ కేసులో విచారణకు కావాలని నోటీసులో పేర్కొన్నారు. కాగా, మనీల్యాండరింగ్ కేసులో వీరభద్రసింగ్‌కు ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

11/27/2015 - 12:43

ఢిల్లీ: ప్రభుత్వం అన్ని అంశాలకు సమాధానం ఇస్తుందని, ప్రతి అంశాన్ని పార్టీలు రాజకీయం చేయడం సరికాదని కేంద్రమంత్రి వెంకయ్య పేర్కొన్నారు. రెండో రోజూ ఆరంభమైన సభలో దేశంలో జరుగుతున్న పరిణామాలపై ప్రధాని స్పంచడంలేదంటూ కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాధిత్యసింధియా సంధించిన ప్రశ్నకు కేంద్రమంత్రి వెంకయ్య సమాధానం చెప్పారు.

11/27/2015 - 11:59

దిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో కాంగ్రెస్ ఎం.పీలతో ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ శుక్రవారం ఉదయం చర్చలు జరిపారు. ఉభయ సభల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై వారు చర్చించినట్టు తెలిసింది.

Pages