S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/08/2016 - 00:46

ఖానాపురం హవేలి, జూలై 7: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో విఆర్వోలు కీలకపాత్ర పోషించాలని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికే ఉపేందర్‌రావు పిలుపునిచ్చారు.

07/08/2016 - 00:44

గుంటూరు, జూలై 7: అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలను నియంత్రించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ జెవి రాముడు తెలిపారు. కృష్ణాపుష్కరాల ఏర్పాట్లలో భాగంగా గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయంలో డీజీపి కంట్రోల్ రూమును ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపి మాట్లాడుతూ పుష్కరాల బందోబస్తుకు 12వేల మంది సిబ్బందిని నియమించనున్నట్లు చెప్పారు.

07/08/2016 - 00:44

మంగళగిరి, జూలై 7: రాష్ట్ర గవర్నర్ నరసింహన్ గురువారం ఉదయం మంగళగిరి విచ్చేసి కొండపై స్వయంభువైన పానకాల లక్ష్మీనరసింహ స్వా మిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. స్వామివారికి పానకం మొక్కుబడి తీర్చుకున్నారు. అనంతరం దిగువ సన్నిధిలోని లక్ష్మీ నరసింహ స్వామి, రాజ్యలక్ష్మీ అమ్మవారిని నరసింహన్ దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. సంప్రదాయ బద్ధంగా ఆలయంలో ప్రదక్షిణలు చేసి ధ్వజ స్తంభానికి మొక్కారు.

07/08/2016 - 00:43

గుంటూరు(కల్చరల్), జూలై 7: సీనియర్ ఐఎఎస్ అధికారిగానే గాకుండా ఓ తెలుగువాడిగా సాహిత్య, సారస్వత, సాంస్కృతిక రంగాలకు నిరుపమానమైన సేవలందించిన డాక్టర్ కెవి రమణాచారి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరి సాంస్కృతిక శిఖరమని ప్రెస్ అకాడమీ పూర్వ అధ్యక్షుడు డాక్టర్ పొత్తూరి వెంకటేశ్వరరావుప్రశంసించారు.

07/08/2016 - 00:43

గుంటూరు (కల్చరల్), జూలై 7: అనివార్య పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోయినప్పటికీ, భౌగోళిక బంధం తెలుగువారందరి అనుబంధానికి ఎప్పుడూ అడ్డురాదని సాంస్కృతిక, సారస్వత సంబంధాలే మిన్న అని తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారుడు, విశ్రాంత రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డాక్టర్ కెవి రమణాచారి అన్నారు.

07/08/2016 - 00:42

మంగళగిరి, జూలై 7: మండల పరిధిలోని పెదవడ్లపూడిలో గురువారం పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జ్ గంజి చిరంజీవి, మార్కెట్‌యార్డు చైర్మన్ ఆరుద్ర భూలక్ష్మి, వైస్‌చైర్మన్ మనె్నం రమేష్ పొలం దున్ని పసుపు విత్తనాలను విత్తారు.

07/08/2016 - 00:41

గుంటూరు (కల్చరల్), జూలై 7: మల్లెపూవు లాంటి తెల్లని వస్త్రాలను ధరించి నగరంలోని వేలాదిమంది ముస్లింలు గురువారం పవిత్ర రంజాన్ పండుగను జరుపుకోవడమే గాక అల్లా అనుగ్రహం అందిరిపై వర్షించాలని కోరుతూ ప్రధాన ఈద్గాలు, మసీదులకు తరలివెళ్లి ప్రార్థనలు చేశారు. గత నెలరోజులుగా ఉపవాస దీక్షలను నియమనిష్టలతో ఆచరిస్తూ వస్తున్న ముస్లింలు వారి కుటుంబాలు గురువారం రంజాన్ నమాజ్ అనంతరం విందును స్వీకరించారు.

07/08/2016 - 00:41

నరసరావుపేట, జూలై 7: కోటప్పకొండ ప్రాంతంలో సుమారు పదివేల మొక్కలను నాటి హరిత కోటప్పకొండగా తీర్చిదిద్దాలని స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. గురువారం కోటప్పకొండలోని మొక్కలు నాటిన అనంతరం మాట్లాడారు. ఈ కార్యక్రమానికి డీఎఫ్‌వో మోహన్‌రావు అధ్యక్షత వహించారు. కోటప్పకొండలోని ఘాట్‌రోడ్డు, పర్యాటక కేంద్రం, కొండ ఎగువ, దిగువ ప్రాంతాల్లో అందమైన మొక్కలను నాటాలని సూచించారు.

07/08/2016 - 00:41

ఫిరంగిపురం, జూలై 7: బ్యాంకింగ్ సౌకర్యాన్ని గ్రామీణ ప్రాంతవాసులకు అతి చేరువలోకి తీసుకురావటమే చైతన్య గ్రామీణ గోదావరి బ్యాంకు లక్ష్యమని జిఎం ఆర్వీ ఫణికుమార్ పేర్కొన్నారు. గురువారం వేములూరిపాడు గ్రామంలో గ్రామీణ చైతన్య గోదావరి బ్యాంకు శాఖను లాంఛనంగా ఆయన ప్రారంభించారు.

07/08/2016 - 00:40

అచ్చెంపేట, జూలై 7: మండలంలోని కొత్తపల్లి-అచ్చెంపేట గ్రామాల నడుమ గురువారం ఆటోబోల్తా పడిన సంఘటనలో పెను ప్రమాదం తప్పి, ప్రయాణీకులు కొద్దిపాటి గాయాలతో బయటపడ్డారు. కొండూరు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ పి ప్రసాద్ పుట్లగూడెంలో ఉన్న తన భార్యను తీసుకుని రావడానికి వెళ్ళి వస్తూ చింతపల్లి వద్ద ప్రయాణికులు ఉండడంతో వారిని ఆటోలో ఎక్కించుకున్నాడు.

Pages