S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/22/2016 - 07:37

విజయనగరం, జూలై 21: జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటుకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అధికారులు సహకరించి అనుమతులు త్వరగా మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎంఎం నాయక్ అధికారులకు సూచించారు.

07/22/2016 - 07:36

విజయనగరం(టౌన్), జూలై 21: మున్సిపాలిటీలో ఈ రెండేళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి పనులపై శే్వతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆశపువేణు డిమాండ్ చేశారు. గడపగడపకూ వైకాపా కార్యక్రమంలో భాగంగా గురువారం 19వ వార్డు స్టేడియంపేటలో పాదయాత్ర నిర్వహించి ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ రూపొందించిన ప్రజా బ్యాలెట్‌ను ఇంటింటికి పంపిణీ చేశారు.

07/22/2016 - 07:36

విజయనగరం, జూలై 21: జిల్లాలోని చిన్న, సన్నకారు రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధించేలా అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఎం ఎం నాయక్ సూచించారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులపై సీజన్‌కు ముందుగా నివేదిక రూపొందించి ప్రభుత్వానికి తెలియజేస్తే రైతులకు వీటిని సకాలంలో అందజేసేందుకు వీలు ఉంటుందన్నారు.

07/22/2016 - 07:35

మక్కువ, జూలై 21: మావోయిస్టుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని ఒఎస్‌డి వెంకటప్పలనాయుడు తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్‌ను గురువారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్ పరిసరాలను పరిశీలించి సిఆర్‌పిఎఫ్ వసతి గదులు, భోజనం వాటిని పరిశీలించి ఏజెన్సీలో మావోయిస్టుల కదలికలపై సిఆర్‌పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ జగన్మోహనరావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టేషన్‌లో రికార్డులు పరిశీలించారు.

07/22/2016 - 07:34

బొబ్బిలి (రూరల్), జూలై 21: రెండు రోజులుగా వర్షాలు కురవడంతో కాలువల్లో చెత్తాచెదారాలు ఉండకుండా తక్షణమే పరిశుభ్రం చేయాలని అధికారులను మున్సిపల్ చైర్‌పర్సన్ టి.అచ్యుతవల్లి ఆదేశించారు. ఈ మేరకు తారకరామా కాలనీలో కాలువలను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తారకరామా కాలనీలో ఉన్న కాలువల్లో చెత్త నిల్వ ఉండిపోవడంతో వర్షపునీరు వెళ్లేందుకు అవకాశం లేదన్నారు.

07/22/2016 - 07:34

గజపతినగరం, జూలై 21: ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రభు త్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే బొ త్స అప్పలనర్సయ్య, నియోజకవర్గ ఇన్‌చార్జి కడుబండి శ్రీనివాసరావు అ న్నారు. గురువారం మండలంలోని ములకల గుమడాం గ్రామంలో గడపగడపకూ వైకాపా కార్యక్రమాన్ని నిర్వహి ంచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సాధ్యంకాని హామీలను గుప్పించి అమలు చే యలేదన్నారు.

07/22/2016 - 07:34

విజయనగరం (్ఫర్టు), జూలై 21: పట్టణంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై మున్సిపల్ కౌన్సిల్ హాలులో గురువారం నిర్వహించిన అవగాహన సదస్సు మొక్కుబడిగా జరిగింది. ఈ సదస్సుకు కొద్దిమంది కౌన్సిల్ సభ్యులు హాజరుకాగా, మరికొన్ని వార్డుల మహిళా కౌన్సిలర్ల తరపున వారి భర్తలు, వారి తండ్రులు హాజరయ్యారు. దీంతో ఈ సదస్సు మొక్కుబడిగా సాగింది.

07/22/2016 - 07:33

నెల్లిమర్ల, జూలై 21: నెల్లిమర్ల నగర పంచాయతీలోని ప్రైవేటు స్థలాలను గుర్తించి అభివృద్ధి చేస్తామని కమిషనర్ వి.అచ్చింనాయుడు తెలిపారు. నగర పంచాయతీలో లే అవుట్లు, ప్రైవేటు స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరిగిపోయి దోమలు వ్యాప్తి చెందుతున్నాయని చెప్పారు. ఇటువంటి స్థలాలను నగర పంచాయతీ స్వాధీనం చేసుకొని అభివృద్ధి చేసి మొక్కలు నాటనున్నట్లు వెల్లడించారు.

07/22/2016 - 07:33

విజయనగరం(టౌన్), జూలై 21: అక్రమంగా గోవులను వధించే చర్యలకు అడ్డుకట్ట వేసే విధంగా ప్రజలు అవగాహన పెంచుకోవాలని ఆంధ్రప్రదేశ్ గో సంరక్షణ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు లోగిశ రామకృష్ణ కోరారు. గురువారం పట్టణంలోని పూల్‌బాగ్, జగదంబనగర్, కొత్తపేట, కుమ్మరివీధి, దాసన్నపేట, రింగ్‌రోడ్డు, అశోక్‌నగర్ కాలనీలలో ప్రజలకు గోవధ నిషేధంపై రూపొందించిన కరపత్రాలు పంపిణీ చేశారు.

Pages