S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/26/2016 - 06:56

కర్నూలు, ఏప్రిల్ 25 : కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగిన శిల్పా సోదరులు ప్రస్తుతం గడ్డుకాలం ఎదుర్కొంటున్నారు. నంద్యాల, శ్రీశైలం నియోకవర్గ ఇన్‌చార్జిలుగా ఉన్న వారికి వైకాపా ఎమ్మెల్యేల కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

04/26/2016 - 06:52

గుంటూరు (కార్పొరేషన్), ఏప్రిల్ 25: నగరంలో ఎండ తీవ్రత పెరిగిపోతున్నందున నగరంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాలు సరిపోవడం లేదని వాటిని సంఖ్యను పెంచాలని నగరపాలక సంస్థ కమిషనర్ నాగలక్ష్మి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం తన చాంబర్‌లో ఇంజనీరింగ్ అధికారులతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నగరంలో చలివేంద్రాల ఏర్పాటుపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.

04/26/2016 - 06:52

ఖమ్మం, ఏప్రిల్ 25: తెలంగాణ రాష్ట్ర సమితి 15వ ప్లీనరీకి ఖమ్మంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ నెల 27న జరగనున్న ప్లీనరీకి పార్టీ ప్రధాన నేతలంతా హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌తో పాటు పార్టీ ప్రధాన నేతలంతా 26న సాయంత్రానికే ఖమ్మం చేరుకోనున్నట్లు స్థానిక నాయకులు వెల్లడించారు.

04/26/2016 - 06:51

గుంటూరు (పట్నంబజారు), ఏప్రిల్ 25: ప్రజలకు సేవలు అందించాల్సిన కీలకశాఖలైన వైద్యారోగ్య, విధానపరిషత్, మెడికల్ కళాశాలలు, ప్రభుత్వాసుపత్రుల్లో సమాచార హక్కు చట్టం పూర్తిస్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఫోరం ఫర్ ఆర్‌టిఐ వ్యవస్థాపక, గౌరవాధ్యక్షులు ఈమని హనుమంతరావు, వాకా శ్రీనివాసరావులు కమిషనర్ విజయనిర్మలను కోరారు.

04/26/2016 - 06:50

గుంటూరు (కొత్తపేట), ఏప్రిల్ 25: విద్యార్హత ఉన్నా, నిరక్షరాస్యులుగా ఉన్నా ప్రభుత్వంపై ఆధారపడకుండా బతుకుబండిని ముందుకు సాగిస్తున్న ఆటోడ్రైవర్లపై ప్రభుత్వం, అధికారులు విధిస్తున్న సవాలక్ష ఆంక్షలతో వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారుతోందని సిఐటియు జిల్లా అధ్యక్షుడు కె నళినీకాంత్ ఆందోళన వ్యక్తంచేశారు.

04/26/2016 - 06:50

హైదరాబాద్, ఏప్రిల్ 25: బ్యాంకులకు అప్పులు ఉంటే ఉద్యోగం ఇవ్వబోమని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఉద్యోగ ప్రకటనలో పేర్కొనడం విడ్డూరమని యువజన, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

04/26/2016 - 06:49

గుంటూరు (కొత్తపేట), ఏప్రిల్ 25: నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం 23 గ్రామాల్లో 95 శాతం మంది రైతులు స్వచ్ఛంధంగా భూములిచ్చారని, భూ సమీకరణకు రాని రైతులకు భూ సేకరణ చేపడతామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. సోమవారం సచివాలయ ప్రారంభోత్సవం అనంతరం జరిగిన బహిరంగ సభలో సిఎం రైతులనుద్దేశించి మాట్లాడారు.

04/26/2016 - 06:49

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: వైకాపా అధ్యక్షుడు జగన్ నేతృత్వంలోని వైకాపా నాయకుల బృందం కేంద్ర పభుత్వ పెద్దలను, వివిధ పార్టీల నేతలను కలవనుంది. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, జేడియూ నేత శరద్ యాదవ్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లతో మంగళవారం భేటీ అవుతుంది.

04/26/2016 - 06:48

హైదరాబాద్, ఏప్రిల్ 25: వేసవి సెలవుల్లో ఉపాధ్యాయుల సేవలను వివిధ రూపాల్లో వినియోగించుకుంటున్నందున విద్యాశాఖను నాన్ వెకేషన్ డిపార్టుమెంట్‌గా ప్రకటించాలని ఎన్‌జిఓల మాదిరి ముప్పై రోజుల సంపాదిత సెలవులను మంజూరు చేయాని ఎస్‌టియు ఎపి అధ్యక్షుడు కత్తి నర్సింహారెడ్డి, ప్రధానకార్యదర్శి సిహెచ్ జోసఫ్ సుధీర్‌బాబు ప్రభుత్వాన్ని కోరారు.

04/26/2016 - 06:48

గుంటూరు, ఏప్రిల్ 25: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో తొలి అంకం పూర్తికావచ్చింది. తాత్కాలిక సచివాలయం ప్రారంభంతో ప్రజల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. జూన్ 15 నాటికి 4 వేల మంది ఉద్యోగులతో పాటు కీలకమైన ప్రభుత్వ శాఖలను అమరావతికి తరలించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇకపై పరిపాలన ఇక్కడి నుంచే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Pages