S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

02/20/2020 - 23:06

కటక్‌లో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఎల్‌బీ అప్పీల్ చేస్తున్న ఒడిశా క్రికెటర్లు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగాల్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తన తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 308 పరుగులు చేసింది. కాగా, గోవాతో తలపడుతున్న గుజరాత్ తొలి రోజు ఆటలో, 90 ఓవర్లలో నాలుగు వికెట్లు చేజార్చుకొని 330 పరుగులు చేసింది.

02/20/2020 - 23:02

వెల్లింగ్టన్, ఫిబ్రవరి 20: సమవుజ్జీల సమరంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న మొదటి టెస్టును పేర్కోవచ్చు. రెండు టెస్టుల ఈ సిరీస్‌లో విజయం ఎవరిని వరిస్తుందనేది ఎవరూ ఊహించలేకపోతున్నది. కాగితంపై చూస్తే, టెస్టు ఫార్మాట్‌లో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా బలంగా కనిపిస్తున్నది.

02/20/2020 - 23:00

లక్నో, ఫిబ్రవరి 20: ఎగుమతులను పెంచుకోవడంతోపాటు, ఆర్థికంగా స్థిర పడేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (్ఫక్కీ) పిలుపునిచ్చింది. కరోనా వైరస్ కారణంగా చైనాలో ఉత్పత్తి దారుణంగా పడిపోయిందని, అదే విధంగా ఆ దేశం నుంచి దిగుమతులకు ప్రపంచ దేశాలు విముఖత వ్యక్తం చేస్తున్నాయని తెలిపింది.

02/20/2020 - 22:59

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: బకాయిలను చెల్లించాల్సిన మొత్తాలను పెండింగ్‌లో పెట్టిన కారణంగా కొంతకాలంగా ‘వాచ్ నెగెటివ్’ జాబితాలో చేరిన ప్రముఖ టెలికం సంస్థ భారతి ఎయిర్‌టెల్‌కు ఊర ట లభించింది. ఫిచ్ రేటింగ్స్ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. బెటర్ బిజినెస్ బ్యూరో (బీబీబీ)లో భారతీ ఎయిర్‌టెల్‌కు ప్రతికూల ముద్ర పడిన విష యం తెలిసిందే.

02/20/2020 - 22:43

‘‘నోర్ముయ్!’’ అన్నాడొక సభ్యుడు. ‘‘ఏంటనీని దేశద్రోహి అన్నందుకు ది సర్వాధికార వర్గ సభ కానట్లయితే, నీ నాలుక కోసి పారేసేవాణ్ని. ఆహా! ఏం దేశభక్తుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడండీ! సీజర్‌ను హత్య చేసిన వాళ్లమీద పగ తీర్చుకున్న పితృభక్తి పరాయణుడు! ఏంటనీయే లేనట్లయితే, ఈపాటికి నీవు నీ పెంపుడు తండ్రిని కలుసుకుని ఉండేవాడివి!’’

02/20/2020 - 22:40

‘‘ఒక వ్యక్తితో ఒక భాషలో మాట్లాడితే అది అతని మస్తిష్కాన్ని మాత్రమే చేరుతుంది. అదే అతని ‘మాతృభాష’లో మాట్లాడితే అది అతని హృదయాన్ని తడుతుంది. మాతృభాష గొప్పదనం గురించి నల్లజాతి సూరీడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా పేర్కొన్న మాటలివి.

02/20/2020 - 22:39

తే.గీ. బుద్ధి వక్రీకరించిన నిద్ధరిత్రిఁ
బుట్టియుంజచ్చినట్లౌగ పుడమి జనులు
ఛీత్కరింతురు బ్రతుకంగ సిగ్గుచేటు
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ

02/20/2020 - 22:36

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
9573672695
*
323. న ప్రమాదాదనర్థో‚ న్యో జ్ఞానినః స్వస్వరూపతః
తతోమోహ స్తతో‚ హంధీ స్తతోబన్ధ స్తతోవ్యథా॥

02/20/2020 - 22:35

అవతార రహస్యం
కృష్ణుడు తన లీలల ద్వారా (తానవతార పురుషుడనే) సత్యాన్ని వెల్లడించాడు. మట్టి తింటున్నాడని విని తన తల్లి నోరు తెరచి చూపించమంటే, అందులో అండ పిండ బ్రహ్మాండాలను ఆమెకు చూపించాడు. ఆయనను కట్టివేసేందుకు ఆమె ఎంత పొడుగు తాడు తెచ్చినా, అది పొట్టే అయిపోయింది. అది ఆయన లీలే! పదునాలుగు భువనాలను తన కుక్షిలో నింపుకొన్న భగవానుడని అంతా చెప్పుకున్నారు.

02/20/2020 - 22:34

‘‘మీరు నమ్మారా ? ...’’
‘‘నమ్మకేం జేస్తాం తల్లీ ! ... ఒకటి తరువాత మరొహటి అద్భుతాల్ని చేసేస్తోంటే ! ... పూతననీ, శకటాసురున్నీ, తృణావర్తున్నీ ... యిలా ఎంద రెందరో రాచ్చసుల్ని సునాయాసంగా సంపుతూ వచ్చాడాయె ! ... సూడ్డానికి యేలెడంత ! అద్భుతాలేమో కొండంత !’’
‘‘ఐతే ఏమయింది ?’’

Pages