S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/04/2016 - 04:25

శామీర్‌పేట, డిసెంబర్ 3: ప్రభుత్వ అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలు సకాలంలో పూర్తియేటట్లు చూడాలని మేడ్చల్ కలెక్టర్ ఎం.వి. రెడ్డి ఆదేశించారు. శనివారం తహశీల్దార్లు, ఎంపిడిఒలు, ఎగ్జిక్యూటివ్ అధికారులు, గ్రామీణ అధికారులు, పంచాయితీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, సర్పంచులతో తన చాంబర్‌లో కలెక్టర్ ఎం.వి.రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

12/04/2016 - 04:24

హైదరాబాద్, డిసెంబర్ 3: ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి పాల్పడే అధికారుల సమాచారాన్ని ఏసిబి అధికారులకు అందించి అవినీతిని అంతమొందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా పిలుపునిచ్చారు. అవినీతితో సమాజానికి ఎంతో నష్టం జరుగుతుందని, ప్రధానంగా పేద వర్గాల సంక్షేమానికై ప్రభుత్వం చేపట్టే పలు కార్యక్రమాలు అర్హులకు అందకుండా పోతున్నాయని ఆయన విచారం వ్యక్తం చేశారు.

12/04/2016 - 04:23

హైదరాబాద్, డిసెంబర్ 3: జిహెచ్‌ఎంసి కౌన్సిల్ శనివారం నిర్వహించిన వార్డు కమిటీల నియామకం ఏకపక్షంగా, ప్రతిపక్షాల గొంతు నొక్కే విధంగా జరిగిందని ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు మెట్టుశంకర్‌యాదవ్, సాయిజెన్ శాంతి ఆరోపించారు. నాచారం డివిజన్‌కు సంబంధించి కార్పొరేటర్ శాంతి మేయర్ బొంతు రామ్మోహన్ ఆదేశంతోనే అయిదుగురి పేర్లు పంపారని, తీరా ఎన్నిక సమయంలో వారి పేర్లు గల్లంతయ్యాయని ఆరోపించారు.

12/04/2016 - 04:21

హైదరాబాద్, డిసెంబర్ 3: మహానగర పాలక సంస్థ పౌరసేవల నిర్వహణ, నగరాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ఎట్టకేలకు వార్డు కమిటీలకు జిహెచ్‌ఎంసి పాలక వర్గం శనివారం ఎన్నిక నిర్వహించింది. ఉదయం పది గంటలకు ప్రత్యేకంగా సమావేశం కావల్సిన కౌన్సిల్ మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైనా, ఎట్టకేలకు వార్డు కమిటీ నియామకం కోసం వచ్చిన నామినేషన్లలో అర్హత కలిగిన వాటిని నామినేటెడ్ ప్రాతిపదికన ఆమోదించింది.

12/04/2016 - 04:20

హైదరాబాద్, డిసెంబర్ 3: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథ పథకంలో భాగంగా కోదండపూర్‌లోని వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లో చేపడుతున్న మరమ్మతుల పనుల కారణంగా ఈనెల 6వ తేదీ ఉదయం ఆరు నుంచి మరుసటి రోజు 7వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు 24 గంటల పాటు నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు జలమండలి ట్రాన్స్‌మీషన్ అధికారులు తెలిపారు.

12/04/2016 - 04:17

మోత్కూరు, డిసెంబర్ 3 : తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు కాసోజు శ్రీకాంత్‌చారి తెలంగాణ రాష్ట్ర సాధనకు చేసిన త్యాగం చిరస్మరణీయమని, చరిత్రలో నిలిచిపోతుందని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ, కార్మిక శాఖామంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లాలోని శ్రీకాంత్‌చారి స్వగ్రామం పొడిచేడు గ్రామంలో శ్రీకాంత్‌చారి 7వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.

12/04/2016 - 04:15

హైదరాబాద్/వనస్థలిపురం, డిసెంబర్ 3: ప్రపంచంలోనే అబద్ధాల పుస్తకమంటూ ఏదైనా ఉందంటే అది కేసిఆర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టిన ఎన్నికల మేనిఫెస్టో మాత్రమేనని రాష్ట్ర టిడిపి కార్యనిర్వహణ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.

12/04/2016 - 04:14

హైదరాబాద్, డిసెంబర్ 3: ‘ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి..తెలంగాణను సాధించాం..మన తెలంగాణను మనమే పాలిస్తాం..మనమే ప్రజాస్వామిక తెలంగాణను సాధిస్తాం’ అని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం స్పష్టం చేశారు. సెర్చ్ వారెంట్ లేకుండా ప్రజాగాయని విమలక్క అరుణోదయ సాంస్కృతిక మండలి కార్యాలయంలో సోదాలు నిర్వహించటమే కాకుండా సాధారణ పుస్తకాలను స్వాధీనం చేసుకుని సీజ్ జేయటం దుర్మార్గమన్నారు.

12/04/2016 - 04:14

మచిలీపట్నం, డిసెంబర్ 3: బందరు ఓడరేవు మనుగడ కోసమే పారిశ్రామికవాడ ఏర్పాటుకు భూ సమీకరణ చేపడుతున్నామని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఓడరేవుతోపాటు పారిశ్రామిక వాడ ఏర్పాటుకు 33వేల ఎకరాల భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరించడం జరుగుతుందన్నారు. ఇందులో 14వేల ఎకరాలు మాత్రమే పట్టా భూములు ఉన్నాయని, మిగిలినవన్నీ అసైన్డ్ భూములేనన్నారు.

12/04/2016 - 04:14

హైదరాబాద్, డిసెంబర్ 3: హైదరాబాద్ పోస్ట్ఫాసుల్లో నగదు మార్పిడి, అవకతవకలపై సిబిఐ దృష్టి సారించింది. నగరంలోని ఏడు పోస్ట్ఫాసుల్లో అక్రమంగా నగదు మార్పిడి జరిగినట్టు శనివారం సిబిఐ గుర్తించింది. గోల్కొండ, సనత్‌నగర్, ఆబిడ్స్ జనరల్ పోస్ట్ఫాస్, పంజగుట్ట, హిమాయత్‌నగర్, నారాయణగూడ పోస్ట్ఫాసుల్లో దాదాపు పది కోట్ల మేరకు నగదు మార్పిడి జరిగినట్టు సమాచారం.

Pages