S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/03/2016 - 04:29

నార్సింగి, డిసెంబర్ 2: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దుతోప్రజలకు ఇబ్బందులు కలుగకుండా తెలంగాణ రాష్ట్రంలో నగదురహిత, కార్డు రహిత సేవలను ప్రారంభించినట్టు రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం మెహిదీపట్నం రైతుబజార్‌లో నగదురహిత, కార్డురహిత సేవలు ప్రారంభించారు.

12/03/2016 - 04:28

హైదరాబాద్, డిసెంబర్ 2: రాష్ట్ర ప్రభుత్వం రానున్న ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌లో జిహెచ్‌ఎంసికి కనీసం రూ. 2వేల కోట్ల నుంచి రూ. 3వేల కోట్ల మేరకు నిధులు కేటాయించాలని జిహెచ్‌ఎంసి పాలక మండలి, అధికార యంత్రాంగం ప్రభుత్వాన్ని కోరింది. ఇప్పటికే ఏటా ఆర్టీసికి చెల్లిస్తున్న రూ. 281 కోట్ల ఆర్థిక భారం నుంచి కూడా తమకు విముక్తి కలిగించాలని కోరినట్లు మేయర్ బొంతు రామ్మోహన్ వెల్లడించారు.

12/03/2016 - 04:28

రాజేంద్రనగర్, డిసెంబర్ 2: పాతనోట్లను తీసుకొని కమీషన్‌పై కొత్తనోట్లు ఇస్తామని మోసగించి రూ.7 లక్షలను ఎత్తుకెళ్లిన ఇద్దరు ఘరానా మోసగాళ్లను పోలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు.

12/03/2016 - 04:27

హైదరాబాద్, డిసెంబర్ 2: మహానగరంలో కోటి మంది జనాభాకు పౌరసేవలు, అత్యవసర సర్వీసులను అందించే జిహెచ్‌ఎంసి రానున్న ఆర్థిక సంవత్సరం(2017-18)కి రూపొందించిన బడ్జెట్‌కు స్థారుూ సంఘం ఆమోదం తెలిపింది. మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన శుక్రవారం ప్రధాన కార్యాలయంలో జరిగిన స్థారుూ సంఘం సమావేశంలో రూ. 5643 కోట్లతో అధికారులు రూపొందించిన బడ్జెట్ ముసాయిదాపై సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు.

12/03/2016 - 04:26

హైదరాబాద్, డిసెంబర్ 2: ప్రత్యామ్నాయ చర్యలు, ముందు చూపు లేకుండా ఉన్నఫలంగా రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయటం వల్లనే ప్రజలు కరెన్సీ కష్టాలు ఎదుర్కొంటున్నారని ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ ఆసోసియేషన్ ఆరోపించింది. 86 శాతం చెలామణిలో ఉన్న పెద్దనోట్నను రద్దు చేసే ముందు ప్రత్యామ్నాయ కరెన్సీ ముద్రించకపోవటం ఆర్‌బిఐ, కేంద్ర ప్రభుత్వాల తప్పిదమే కారణమని పేర్కొంది.

12/03/2016 - 04:24

ఘట్‌కేసర్, డిసెంబర్ 2: క్రీడలలో అత్యుత్తమ ప్రతిభను కనపరిచి ప్రతి క్రీడాకారుడు అంతర్జాతీయ గుర్తింపును సాదించాలని మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి అన్నారు. మండల పరిధి ప్రతాపసింగారం గ్రామంలోని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి నివాసంలో రాష్ట్ర స్థాయి జూనియర్ కబడ్డీ జట్టుకు ఎంపికైన క్రీడాకారులను శుక్రవారం ఎమ్మెల్యే అభినందించారు.

12/03/2016 - 04:23

మేడ్చల్, డిసెంబర్ 2: మేడ్చల్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి పని తీరుపై శుక్రవారం ఠాణా ఆవరణలో కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు తెలిపిన వివరాల ప్రకారం మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సంజీవరెడ్డికి చెందిన పట్టణంలోని ఓ భవనంలో హోటల్ వ్యాపారి లీజుకు తీసుకోవడంలో తలెత్తిన వివాదంలో పోలీసులు సంజీవరెడ్డి అతని కుమారుడు శ్రీకాంత్‌రెడ్డితో పాటు మరో ఇద్దరు కుమారులపై కేసు నమోదు చేశారు.

12/03/2016 - 04:22

హైదరాబాద్, డిసెంబర్ 2: మహానగర పాలక సంస్థ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం శనివారం ఉదయం పది గంటలకు మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన ప్రారంభం కానుంది. జిహెచ్‌ఎంసి పరిపాలన, నగరంలో చేపట్టే అభివృద్ధిలోనూ ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు వార్డు కమిటీల నియామకంపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలున్నాయి.

12/03/2016 - 04:16

హైదరాబాద్, డిసెంబర్ 2: పంట రుణాల మాఫీ వాయిదాను బ్యాంకులకు విడుదల చేసినా రైతుల ఖాతాల్లో ఎందుకు జమ చేయలేదని బ్యాంకర్లపై రవాణాశాఖ మంత్రి పి మహేందర్‌రెడ్డి మండిపడ్డారు. మహిళలు, రైతులకు 7 శాతం వడ్డీతో రుణాలు ఇవ్వాలని నిబంధనలున్నా 11 శాతం ఎలా వసూలు చేశారని బ్యాంకర్లను మంత్రి నిలదీశారు. ప్రభుత్వ ఆదేశాలను, నిబంధనలను అమలు చేయని బ్యాంకర్లకు తాఖీదులు జారీ చేయాల్సిందిగా కలెక్టర్లను మంత్రి ఆదేశించారు.

12/03/2016 - 04:13

నార్కట్‌పల్లి, డిసెంబర్ 2: జెనెటిక్ మాలిక్యులర్ డయాగ్నసిస్ ఇన్ మోడ్రన్ మెడిసిన్ పేరుతో అంతర్జాతీయ వైద్యుల సమ్మేళనం తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండల కేంద్రంలో ఈనెల 16 నుంచి నిర్వహించనున్నట్లు కామినేని వైద్యుల బృందం పేర్కొంది.

Pages