S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/02/2016 - 04:34

రాజేంద్రనగర్, డిసెంబర్ 1: తెలంగాణలో తెదేపాకు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుండడంతో టిఆర్‌ఎస్‌కు వణుకు పుడుతుందని రాష్ట్ర తెదేపా బిసి సెల్ కార్యదర్శి మ్యాడం రామేశ్వర్‌రావు అన్నారు. గురువారం రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఫ్రెండ్స్‌కాలనీ, హైదర్‌గూడ, అత్తాపూర్ తదితర బస్తీలలో ఇంటింటికి తెదేపా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.

12/02/2016 - 04:33

హైదరాబాద్, డిసెంబర్ 1: నగరంలోని ఎస్‌ఆర్ నగర్‌లో నెలకొన్న డ్రైనేజీ, మంచినీటి వంటి సమస్యలు తలెత్తకుండా తగిన పనులను చేపట్టాలని జలమండలి అధికారులను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆదేశించారు. గురువారం మంత్రి జలమండలి ఎండి ఎం.దానకిషోర్, జిహెచ్‌ఎంసి అధికారులతో కలిసి ఉనత్‌నగర్ డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించి స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

12/02/2016 - 04:32

హైదరాబాద్, డిసెంబర్ 1: విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ ఈ నెల 6న తెలంగాణలోని అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయాలను ముట్టడించాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. గత రెండు నెలలుగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా విద్యార్థులకు రావలసిన రూ. 2090 కోట్లు విడుదల చేయడం లేదని ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు.

12/02/2016 - 04:32

కెపిహెచ్‌బికాలనీ, డిసెంబర్ 1: ఓఎల్‌ఎక్స్ యాప్‌లో వస్తున్న ప్రకటనలను ఆసరా చేసుకొని కార్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు ముఠా సభ్యులను కెపిహెచ్‌బి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ మేరకు కెపిహెచ్‌బి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఏసిపి భుజంగరావు, సిఐ కుషాల్కర్ నిందితుల వివరాలను వెల్లడించారు. సోమాజిగూడకు చెందిన శ్రీకాంత్ వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.

12/02/2016 - 04:27

కర్నూలు, డిసెంబర్ 1: ప్రజలు వినియోగిస్తున్న మోబైల్ ఫోనే ఇకపై మనీపర్స్ కానుంది. నగదు రహిత లావాదేవీలకు ప్రజలు ఖచ్చితంగా అలవాటు పడేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయానికి సిద్ధపడటంతో ప్రసుత్తం నగదు లభ్యత కష్టతరంగా మారింది.

12/02/2016 - 05:05

అమరావతి, డిసెంబర్ 1: రెండున్నరేళ్ల పాలనలో ఎదురైన నుభవాలు, లోటుపాట్లు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, నిఘా వర్గాలు, సొంత సమీక్షల్లో వచ్చిన అవగాహన దృష్ట్యా పాలన ప్రక్షాళన చేయకతప్పదన్న నిర్ణయానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వచ్చినట్లు కనిపిస్తోంది. త్వరలో పెద్దఎత్తున ఐఏఎస్ బదిలీలు చేపట్టాలని, తన కార్యాలయాన్ని కూడా ప్రక్షాళన చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

12/02/2016 - 04:23

విశాఖపట్నం, డిసెంబర్ 1: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన నాడా తుపాను నేపథ్యంలో తూర్పు నౌకాదళం సహాయ చర్యలకు సిద్ధంగా ఉందని ఇఎన్‌సి పేర్కొంది.

12/02/2016 - 04:19

తిరుపతి, డిసెంబర్ 1: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో బాగంగా ఆరో రోజైన గురువారం ఉదయం సర్వభూపాల వాహనం, రాత్రి గరుడ వాహనంపై అలమేలు మంగ విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని తన్మయులయ్యారు.

12/02/2016 - 04:14

హైదరాబాద్, డిసెంబర్ 1: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ప్రదీప్ చంద్ర, పదవీ విరమణ చేసిన రాజీవ్ శర్మ గురువారం గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మర్యాద పూర్వకంగా ప్రదీప్ చంద్ర గవర్నర్‌ను కలిసినట్టు అధికార వర్గాల సమాచారం.

12/02/2016 - 04:11

కరీంనగర్, డిసెంబర్ 1: ఆసరా పథకంలోని వృద్ధులు, వికలాంగులు, వితంతువులతోపాటు బీడీ, గీత కార్మికుల్లో పె(టె)న్షన్ మొదలైంది. ఇప్పటివరకు ప్రతీ నెల ఒకటో తేదీ నుంచి పదవ తేదీలోపల పింఛన్ డబ్బులు అందిస్తూ వచ్చిన ప్రభుత్వం ఇకమీదట ఆన్‌లైన్‌లో చెల్లింపులు ఉంటాయని ప్రకటించడంతో పింఛన్‌దారుల్లో ఆందోళన మొదలైంది.

Pages