S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/01/2016 - 08:50

న్యూఢిల్లీ, నవంబర్ 30: పెద్ద నోట్ల రద్దుతో ప్రజలెదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చర్చించేందుకు బుధవారం లోక్‌సభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య అవగాహన కుదిరినట్లే కుదిరి మళ్లీ మొదటికి వచ్చింది.

12/01/2016 - 08:48

న్యూఢిల్లీ, నవంబర్ 30: జమ్మూకాశ్మీర్‌లోని నగ్రోటా సైనిక శిబిరంపై ఉగ్రవాదులు చేసిన దాడిలో మరణించిన ఏడుగురు సైనికులకు నివాళులర్పించ లేదంటూ లోక్‌సభ నుంచి వాకౌట్ చేసిన కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు ఆ తరువాత స్పీకర్ సుమిత్రా మాహాజన్‌కు క్షమాపణలు చెప్పారు. ‘మిమ్మల్ని బాధ పెట్టాలని, విమర్శించాలని మా ఉద్దేశం కాదు. ప్రభుత్వం సరైన సమాచారాన్ని సకాలంలో ఇవ్వలేదు.

12/01/2016 - 08:40

హైదరాబాద్, నవంబర్ 30: వచ్చే విద్యాసంవత్సరం నుండి పాఠశాలల్లో సమస్త సౌకర్యాలను కల్పించడంతో పాటు, విద్యాత్మకంగా స్కూళ్లను ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దాలని డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి పేర్కొన్నారు. బుధవారం నాడు నిర్వహించిన డిఇఓల వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. విద్యార్థుల నమోదుతో పాటు వారి ఫలితాలు, ప్రతిభాపాటవాలు కూడా చాలా ముఖ్యమని అంతా గుర్తించాలని అన్నారు.

12/01/2016 - 08:39

హైదరాబాద్, నవంబర్ 30: ఎమ్సెట్ మెడికల్ స్ట్రీంలో కీలకమైన మెడికల్, డెంటల్ కాలేజీల్లో సీట్లు నీట్ పరిధిలోకి వెళ్లడంతో మిగిలిన బ్రాంచిల్లో అడ్మిషన్లను మార్కుల ప్రాతిపదికగా భర్తీ చేస్తే ఎమ్సెట్ ఒత్తిడిని విద్యార్థులపై తొలగించినట్టవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

12/01/2016 - 08:39

కొవ్వూరు, నవంబర్ 30: కాపు ఉద్యమ భవిష్యత్ కార్యాచరణపై చర్చించడానికి డిసెంబర్ 2న తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో 13 జిల్లాల కాపు నేతల సమావేశం నిర్వహిస్తున్నామని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో బుధవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాపు ఉద్యమాన్ని అణచేందుకు ప్రయత్నిన్నారని ఆరోపించారు.

12/01/2016 - 08:38

గూడెం కొత్తవీధి, నవంబర్ 30: విశాఖ మన్యంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ గణనీయంగా పడిపోతున్నాయి. ఆంధ్రా కాశ్మీర్‌గా పేరుగాంచిన లంబసింగిలో బుధవారం నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, చింతపల్లిలో ఏడు, గూడెంకొత్తవీధిలో ఐదు డిగ్రీల కనీస ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. చింతపల్లి, గూడెం కొత్తవీధి మండలాల్లో గత రెండు రోజులుగా చలి తీవ్రత పెరిగింది. ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు రావడంలేదు.

12/01/2016 - 08:24

రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఎంజి గోపాల్ విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అజయ్ మిశ్రా
గృహ నిర్మాణశాఖ ముఖ్య కార్యదర్శిగా చిత్రా రామచంద్రన్ మున్సిపల్ పరిపాలనా కార్యదర్శిగా నవీన్ మిట్టల్

12/01/2016 - 08:22

హైదరాబాద్, నవంబర్ 30: హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆగస్టు 2018 నాటికి పూర్తి చేయాలని నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టిని సిఎం కెసిఆర్ ఆదేశించారు. అలాగే వచ్చే ఏడాది నవంబర్‌కు మియాపూర్- ఎల్‌బి నగర్ మార్గం పూర్తి చేయాలని గడువు విధించారు. క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్‌లో బుధవారం మెట్రో రైలు ప్రాజెక్టు పనుల పురోగతిని సిఎం సమీక్షించారు.

12/01/2016 - 08:26

హైదరాబాద్, నవంబర్ 30: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన రాజీవ్ శర్మను ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమిస్తున్నట్టు సిఎం కెసిఆర్ ప్రకటించారు. సచివాలయంలో జరిగిన రాజీవ్ శర్మ వీడ్కోలు సమావేశ వేదికపైనే సిఎం ఈ విషయాన్ని వెల్లడించారు.

12/01/2016 - 08:18

హైదరాబాద్, నవంబర్ 30: ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫస్టియర్ ఫస్ట్ సెమిస్టర్ అపుడే పూర్తి కావస్తున్నా ర్యాగింగ్ కు ఫుల్‌స్టాప్ పడలేదు. మూడు నెలలుగా కొనసాగుతున్న ర్యాగింగ్ రోజురోజుకూ జడలువిప్పుకుంటోంది. యూనివర్శిటీ కాలేజీల్లో సైతం ర్యాగింగ్‌కు జూనియర్లు బెంబేలెత్తిపోతున్నారు. కూకట్‌పల్లి జెఎన్‌టియులో గత మూడు నెలలుగా గుట్టుచప్పుడుకాకుండా సాగుతున్న ర్యాగింగ్ భూతం మరోమారు పంజా విప్పింది.

Pages