S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/28/2016 - 08:40

మచిలీపట్నం, నవంబర్ 27: కార్తీక మాసం చివరి ఆదివారాన్ని పురస్కరించుకుని మంగినపూడి బీచ్‌కు యాత్రీకులు పోటెత్తారు. రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన వేలాది మంది యాత్రీకులతో సముద్ర తీరం జన సంద్రంగా మారింది. ఉదయం నుండి సాయంత్రం వరకు యాత్రికుల రాకపోకలు సాగించారు.

11/28/2016 - 08:40

మచిలీపట్నం, నవంబర్ 27: గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన బందరు నియోజకవర్గాన్ని అన్నింటా ముందుంచేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నట్లు రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గడిచిన రెండున్నరేళ్లలో నియోజకవర్గంలో సుమారు వెయ్యి కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. మారుమూల గ్రామాల్లో సైతం పెద్దఎత్తున సిసిరోడ్లు నిర్మించినట్లు తెలిపారు.

11/28/2016 - 08:40

మచిలీపట్నం (కల్చరల్), నవంబర్ 27: కృష్ణా తరంగ్-2016 యువజనోత్సవాల్లో భాగంగా రెండో రోజైన ఆదివారం నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు. ఉదయం పాశ్చాత్య సంగీతం, శాస్ర్తియ సంగీతం, తంత్రీ వాద్య సంగీతం, జానపద నృత్యాలు, ఏకాంకిక ప్రదర్శనలు నిర్వహించారు. విజయవాడ పిబి సిద్ధార్థ కళాశాల విద్యార్థుల ‘కాంట్రవర్సీ’ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

11/28/2016 - 08:32

హైదరాబాద్, నవంబర్ 27: పోలీస్ శాఖ పటిష్ఠతకు, నూతన టెక్నాలజీ అప్‌గ్రేడ్‌కు ఇతోధికంగా నిధులు కేటాయిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఆదివారం ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో జరిగిన డిఐజి, ఐజిల జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్‌లో డిజిపి, ఐజిపిల జాతీయ సదస్సు నిర్వహించుకోవడం ముదావహమన్నారు.

11/28/2016 - 08:26

బెంగళూరు, నవంబర్ 27: పెద్ద నోట్ల రద్దు కారణంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలకు నిద్రపట్టడం లేదని, వారి ముఖంలో కళ తగ్గిందని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. 500, 1000 నోట్ల రద్దువల్ల ఆందోళన చెందుతున్న వారంతా నల్లధనం ఉన్నవారేనని, దాన్ని ఎప్పుడు కోల్పోతామోనన్న భయమే వారిలో నిరంతరం భయాన్ని కలిగిస్తోందని, నిద్ర పట్టనివ్వడం లేదని అమిత్ షా అన్నారు.

11/28/2016 - 08:24

కుషినగర్ (ఉత్తరప్రదేశ్), నవంబర్ 27: ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా పెద్దనోట్లను రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ‘్భరత్ బంద్’కు పిలుపునిచ్చిన ప్రతిపక్షాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. అవినీతిని, నల్లధనాన్ని నిర్మూలించడానికి తాను ప్రయత్నిస్తుంటే వారు బంద్‌లు చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆయన పరోక్షంగా ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. భారత్ బంద్ కావాలా, అవినీతి నిర్మూలన కావాలా?

11/28/2016 - 08:23

వాషింగ్టన్, నవంబర్ 27: అమెరికా అధ్యక్ష పదవికి ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలను ఎవరూ శంకించడం గానీ, అగౌరవపర్చడం గానీ చేయరాదని, ఆ ఫలితాలను ప్రతి ఒక్కరూ గౌరవించి తీరాలని ఆ ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ అన్నారు. స్వింగ్ స్టేట్‌గా పరిగణించే విస్కాన్సిన్ రాష్ట్రంలో ఓట్లను మళ్లీ లెక్కించాలన్న నిర్ణయాన్ని ‘కుంభకోణం’గా ఆయన అభివర్ణించారు.

11/28/2016 - 08:23

న్యూఢిల్లీ, నవంబర్ 27: దశాబ్దాలుగా పిల్లలనూ, పెద్దలనూ తన కథల ద్వారా ఆకట్టుకుంటూ భిన్న అంశాలను తెరపైకి తెస్తూ అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన ప్రఖ్యాత రచయిత రస్కిన్ బాండ్ తన కథలన్నీ నిజమైన అబద్ధాలేనంటూ ఓ ఆసక్తికర సందేశాన్ని ఇచ్చారు. కథను చెప్పడమన్నది కల్పనకు వాస్తవికతను జోడించడమేనన్నది ఆయన పేర్కొన్నారు.

11/28/2016 - 08:17

కొత్తగా విడుదల చేసిన 2వేల రూపాయల నోటు నీట్లో తడిసి రంగుమారి వెలిసిపోతే అది అసలైన నోటు అని, రంగుమారకుంటే నకిలీ నోటు అని ఆర్‌బిఐ అధికారులు చెబుతున్నట్లు వార్తలు వచ్చాయి. వర్షం పడినపుడు ఎంత జాగ్రత్తగా జేబులో దాచినా నోట్లు ఎంతోకొంత తడవకుండా ఉంటాయా? పొరపాటున నీళ్లలో పడినా వెలిసిపోతాయా? పాత 500, 1000 నోట్లు ఎంత తడిసినా రంగుమారేవి కావు. ఇపుడు 2వేల నోటుతో ఎన్ని అవస్థలో..?

11/28/2016 - 08:16

ఆర్‌జెడి పార్టీ అధినేత, బిహార్ మాజీ సిఎం లల్లూప్రసాద్ యాదవ్ జైల్లో లేకపోయినా శ్రీకృష్ణుడంతటి వాడే! కాకపోతే ఇప్పుడు మురళి చేతిలో లేని కృష్ణుడిలా కనిపిస్తున్నాడు. జైలు నుంచి వచ్చినా- బెయిలు అతణ్ణి స్వేచ్ఛగా బతకనిస్తోందే గానీ.. అదేం స్వేచ్ఛ? కాళ్లూ చేతులూ కట్టేసి, మైదానంలో వదిలేసి ‘ఇదంతా నీదే.. ఆడుకో’మని అన్నట్లుగా వుంది.

Pages