S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/24/2016 - 04:27

న్యూఢిల్లీ, నవంబర్ 23: పాకిస్తాన్ ముష్కర మూకలు జరిపిన పైశాచిక దాడికి ప్రతీకారంగా భారత సైన్యం బుధవారం తీవ్రస్థాయిలో దాడులు జరిపింది. దాడుల్లో ఓ అధికారి సహా ముగ్గురు పాక్ సైనికులు మరణించారు. మంగళవారం అధీన రేఖ ప్రాంతంలో గస్తీ తిరుగుతున్న భారత సైనికులపై పాక్ దళాలు దాడి జరిపి ముగ్గుర్ని హతమార్చాయి.

11/24/2016 - 04:26

న్యూఢిల్లీ, నవంబర్ 23: ప్రధాని నరేంద్ర మోదీకి దేశాన్ని పాలించే అర్హతే లేదని విపక్షాలు నిప్పులు చెరిగాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలో బుధవారం జంతర్‌మంతర్‌లో జరిగిన భారీ ర్యాలీలో నాలుగు పార్టీల నేతలు కేంద్ర ధోరణిని ఎండగట్టారు. పెద్ద నోట్ల రద్దు వల్ల దేశ వ్యాప్తంగా కోటానుకోట్ల మంది ప్రజలు పడుతున్న ఇబ్బందులు, అవస్థలు ప్రధాని మోదీకి పట్టడం లేదని..

11/24/2016 - 04:24

విజయవాడ, నవంబర్ 23: ‘ఒకటో తేదీ వస్తోంది.. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వాలి. పింఛన్లు చెల్లించాలి.. ఇందుకు అవసరమైన కరెన్సీని అందుబాటులోకి తీసుకువచ్చేలా తక్షణమే చర్యలు చేపట్టండి’ అంటూ బ్యాంకర్లను సిఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. డిసెంబర్ 1 నాటికి రాష్ట్రంలో 70 శాతం పైగా డిజిటల్ లావాదేవీలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులకు స్పష్టం చేశారు.

11/24/2016 - 04:22

చెన్నై, నవంబర్ 23:దశాబ్దాల పాటు భారతీయ సంగీతానికి ప్రతిరూపంగా, కొత్త సంగీత ప్రక్రియల ప్రయోక్తగా రాణించి కోటానుకోట్ల మందిని అలరించిన గాన గంధర్వుడు బాల మురళీ కృష్ణకు అనంతవాయువుల్లో కలిసిపోయారు. ఆయన భౌతిక కాయానికి వందలాది మంది అభిమానుల అశ్రునయనాల మధ్య బుధవారం ఇక్కడి బీసెంట్‌నగర్ ఎలక్ట్రిక్ శ్మశానవాటికలో అంత్య క్రియలు జరిగాయి.

11/24/2016 - 04:20

అమరావతి, నవంబర్ 23: రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా నేరుగా పంచాయతీలకే నిధులిస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం బిజెపియేతర ముఖ్యమంత్రుల్లో దడ పుట్టిస్తోంది. ఈ విధానంతో సర్పంచులు బిజెపి వైపు వెళతారన్న ఆందోళన బిజెపియేతర ముఖ్యమంత్రుల్లో వ్యక్తమవుతోంది. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నందున తక్షణం రద్దు చేయాలన్న డిమాండ్ మొదలైంది.

11/24/2016 - 04:17

న్యూఢిల్లీ, నవంబర్ 23:పెద్ద నోట్ల రద్దుతో జన్‌ధన్ ఖాతాల్లో నిధుల పంట పండింది. కేవలం 13రోజుల వ్యవధిలో ఈ ఖాతాల్లోకి అనూహ్య రీతిలో 21వేల కోట్ల రూపాయల మేర డిపాజిట్లు వచ్చాయని అధికార వర్గాలు బుధవారం తెలిపాయి. గత రెండు వారాలుగా ఈ ఖాతాల్లోకి డిపాజిట్లు పోటెత్తాయని..వీటిలో మమతా బెనర్జీ సారధ్యంలోని పశ్చిమ బెంగాల్ మొదటిస్థానంలో కాంగ్రెస్ సారథ్యంలోని కర్నాటక రెండోస్థానంలో ఉందని వెల్లడించాయి.

11/24/2016 - 04:16

న్యూఢిల్లీ, నవంబర్ 23: రాష్ట్రాల్లో శాసన సభా స్థానాలు ఇప్పట్లో పెంచలేమని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. 2026 జనాభా లెక్కలు ప్రకటించనంత వరకు స్థానాల పెంపు అసాధ్యమని పేర్కొంది. ఆర్టికల్ 170ని సవరించకుండా తెలంగాణలోని అసెంబ్లీ స్థానాలను 119 నుంచి 153కి పెంచటం సాధ్యంకాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం అహిర్ స్పష్టం చేశారు.

11/24/2016 - 00:02

నిజామాబాద్, నవంబర్ 23: పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన కరెన్సీ కష్టాలు ప్రజానీకాన్ని ఇంకనూ వెంటాడుతూనే ఉన్నాయి. పాత 500, 1000రూపాయల నోట్ల చెలామణిని రద్దుచేసి పక్షం రోజులు పూర్తయినప్పటికీ, పరిస్థితి కుదుటపడకపోవడంతో సామా న్య జనాలంతా బ్యాంకులు, ఎటిఎంల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు.

11/24/2016 - 00:00

నల్లగొండ, నవంబర్ 23: జిల్లాలో మిషన్ భగీరథ పథకం పనులు నిర్ధేశిత గడువులోగా పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకోవాలని నల్లగొండ కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆదేశించారు. బుధవారం ఆయన ఆలేరు ప్రాంతానికి మిషన్ భగీరథ పథకం కింద కృష్ణా మంచినీటిని అందించే పానగల్ ఉదయ సముద్రం చెరువులో నిర్మాణంలో ఉన్న పంపింగ్ స్టేషన్ పనులను పరిశీలించారు.

11/23/2016 - 23:58

మెదక్, నవంబర్ 23: మెదక్ మిని ఎస్టీ బాలికల వసతి గృహంలోని వంట గదులను, ప్రహరీ గోడ నిర్మాణ ప్రాంతాలను తెరాస రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మల్లిఖార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్ బుధవారం పరిశీలించారు. సన్నబియ్యంతో వండిన భోజనాన్ని వారు పరిశీలించారు. వంకాయ కూర, ఇతర కూరలను తిని వారు రుచి చూశారు. వండిన కోడిగుడ్లను కూడా పరిశీలించారు.

Pages