S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/23/2016 - 04:45

అనకాపల్లి, నవంబర్ 22: పెద్దనోట్లు రద్దయి పక్షం రోజులు గడుస్తున్నా కరెన్సీ కష్టాలు తీరకపోగా నానాటికీ మరింత తీవ్రతరమవుతున్నాయి. అరకొరగా పట్టణంలోని పలు బ్యాంక్‌లకు కొత్త కరెన్సీ అందుతుండగా మరికొన్ని బ్యాంక్‌లు అసలు తమవద్ద కొత్త కరెన్సీ లేదని చేతులెత్తేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్ణణాల్లో సైతం పలు ఏటిఎంల్లో నగదు లేక అలంకార ప్రాయంగా మిగిలాయి.

11/23/2016 - 04:44

సబ్బవరం, నవంబర్ 22: పెద్దనోట్లతోనే నల్లధనం ఉంటే 2000 రూపాయల నోట్లను ఎందుకు అమలులోకి తెచ్చారంటూ సిపిఎం పార్టీ చోడవరం డివిజిన్ పరిధిలోని సబ్బవరం మండలంలోని అన్ని బ్యాంకుల వద్ద మంగళవారం పార్టీనేతలు ఆందోళన చేపట్టారు. అందులోభాగంగా స్థానిక వాణిజ్యబ్యాంకుల ముందుకు వెళ్ళి అక్కడ వినియోగదారులతో మాట్లాడారు.

11/23/2016 - 04:43

అనకాపల్లి(నెహ్రూచౌక్), నవంబర్ 22: స్థానిక సత్యనారాయణపురం కళ్యాణగిరిపై వేంచేసియున్న కనకదుర్గమ్మ ఆలయంలో మంగళవారం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆధ్వర్యంలో శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులచే అన్నమయ్య కీర్తనలు, శ్రీ వేంకటేశ్వర స్వామి వైభవం సమర సతా సేవా ఫౌండేషన్ మండల ధర్మప్రచారంలో భాగంగా నిర్వహించారు.

11/23/2016 - 04:41

మునగపాక, నవంబర్ 22: హిందూ మత ప్రచార పరిషత్‌ను పటిష్టం చేయాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని నాగులాపల్లి సర్పంచ్ యల్లపు వెంకట భాస్కరరావు అన్నారు. మండలంలో గల నాగులాపల్లిలో హిందూ పరిషత్ ఏర్పాటు చేసారు.

11/23/2016 - 04:36

హైదరాబాద్, నవంబర్ 22: మల్కాజిగిరిలో తాగునీటి సరఫరా మెరుగుకోసం జలమండలి ఆధ్వర్యంలో రూ.330 కోట్లతో చేపడుతున్న తాగునీటి సరఫరా ప్రాచెక్టు పనుల్లో దాదాపు 75 శాతం పనులు పూర్తయ్యాయి. ప్రపంచ బ్యాంకు నిధులతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో రిజర్వాయర్ల నిర్మాణంతో పాటు నీటి పైప్‌లైన్ నిర్మాణ పనులు చేపడుతున్నారు.

11/23/2016 - 04:36

హైదరాబాద్, నవంబర్ 22: ప్రపంచమంతా గర్వించదగిన సంగీత కళానిధి, సంగీత బ్రహ్మ. ‘సళలిత రాగసుధా...’ అంటూ కొత్తకొత్త రాగాలను సృష్టించిన స్వర మాంత్రికుడు, పద్మవిభూషణ్ మంగళంపల్లి బాలమురళీకృష్ణకు భాగ్యనగరంతోవీడని బంధముంది. ఆయన మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు అని పలువురు జంట నగరాల కళాకారులు, కళాకోవిధులు, వివిధ సాంస్కృతిక సంస్థల నిర్వాహకులు వ్యాఖ్యానించారు.

11/23/2016 - 04:35

హైదరాబాద్, నవంబర్ 22: బ్యాంకు ఖతాల్లో మూలుగుతున్న సొంత డబ్బు... అవసరానికి తగినంత డ్రా చేసుకునే అవకాశం లేదు. ఏటిఎం ద్వారా రోజుకి కేవలం రూ. 2వేలు మాత్రమే డ్రా చేసుకునే అవకాశముండటంతో ఖాతాదారులు వంద నోటు కోసం కోటి కష్టాలు పడుతున్నారు.

11/23/2016 - 04:34

నల్లకుంట, నవంబర్ 22: డా.బాబా సాహేబ్ అంబేద్కర్ పోరాడి సాధించిన రిజర్వేషన్లు వారివారి జనాభా దామాషా ప్రకారం అందాలని ఆనాడే అంబేద్కర్ తెలిపారని, రిజర్వేషన్‌ల ఫలాలు అందరికీ సమానంగా అందడం కోసమే ఎమ్మార్పీఎస్ ఉద్యమం చేపట్టిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు.

11/23/2016 - 04:33

హైదరాబాద్, నవంబర్ 22: నగరాన్ని మరింత ‘స్వచ్ఛ‘గా తీర్చిదిద్దటంతో పాటు దేశంలోనే నెంబర్ వన్ సిటీగా తీర్చిదిద్దేందుకు జిహెచ్‌ఎంసి కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే! అయితే స్వచ్ఛ భారత్‌లో భాగంగా చేపడుతున్న కార్యక్రమాల పర్యవేక్షణకు ప్రత్యేక సిటీ టాస్క్ఫోర్సును ఏర్పాటు చేయాలని జిహెచ్‌ఎంసి నిర్ణయించింది.

11/23/2016 - 04:33

హైదరాబాద్, నవంబర్ 22: మెరుగైన సేవల పేరిట జిహెచ్‌ఎంసిలో ఏకంగా 13రోజుల పాటు జరిగే వరుస సమీక్షలు మొదలయ్యాయి. జిహెచ్‌ఎంసి కమిషనర్‌గా డా.బి.జనార్దన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయింది. గడిచిన ఏడాది కాలంలో కమిషనర్ వివిధ విభాగాల పనితీరును క్షుణ్ణంగా గమనించి, సిబ్బంది పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోవటం వల్లే మెరుగుపరిచేందుకు ఈ మేదోమథనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు.

Pages