S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10/24/2016 - 00:55

విజయవాడ (స్పోర్ట్స్), అక్టోబర్ 23: ఆంధ్ర హస్పిటల్ ఆధ్వర్యంలో స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం నుండి వరల్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ డేను పురస్కరించుకుని ఆదివారం రెండు కిలోమీటర్ల పాటు పింక్ రిబ్బన్ వాక్ జరిగింది. ఈవాక్‌లో నగరంలోని వివిధ కళాశాలల, పాఠశాలల విద్యార్ధులు, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులతో పాటు సినీనటుడు సుమంత్ పాల్గొన్నారు.

10/24/2016 - 00:54

విజయవాడ, అక్టోబర్ 23: ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా చంద్రబాబు ప్రజల్ని మోసం చేస్తన్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చిగురుపాటి బాబూరావు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా చైతన్య పాదయాత్రలు సెంట్రల్ నియోజకవర్గం ప్రారంభ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

10/24/2016 - 00:52

కాకినాడ, అక్టోబర్ 23: కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలకు రంగం సిద్ధం కావడంతో అధికార తెలుగుదేశం పార్టీ నేతల్లో మేయర్ సీటు కోసం పోటీ పతాక స్థాయికి చేరింది. టిక్కెట్ విషయంలో పార్టీ నిర్ణయమే శిరోధార్యమంటూ ఇటీవల జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చేసిన సూచనలను ఖాతరు చేసే స్థితిలో నగర నేతలున్నట్టు కనిపించడం లేదు.

10/24/2016 - 00:51

రాజమహేంద్రవరం, అక్టోబర్ 23: జల వనరుల శాఖలో ఇకపై కాగిత రహిత కార్యాలయాలుగా రూపాంతరం చెందనున్నాయి. డిజిటల్ సైన్, పాస్‌వర్డు విధానం, ఫైళ్ళు స్కానింగ్ విధానం అమల్లోకి రానుంది. గోదావరి బేసిన్ పరిధిలోని అన్ని ప్రాజెక్టుల వివరాలు, కార్యాలయాలను కంప్యూటరీకరణతో ఇ-ఆఫీసు విధానాన్ని అమలు చేయనున్నారు. ఇప్పటికే సిఎం డాష్ బోర్డుకు సమగ్ర వివరాలను ఆన్‌లైన్ విధానంలో అప్‌గ్రేడ్ చేస్తున్నారు.

10/24/2016 - 00:51

మారేడుమిల్లి, అక్టోబర్ 23: మారేడుమిల్లి పోలీసులు నాలుగు లక్షల రూపాయల విలువైన 330 బస్తాల్లో ఉన్న 16,800 కేజీల నల్లబెల్లాన్ని ఆదివారం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో నెల్లిపాకగ్రామానికి ఈ పాత బెల్లం రవాణా చేస్తుండగా మారేడుమిల్లిలో పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా లారీలో నల్లబెల్లం ఉండటాన్ని గమనించారు.

10/24/2016 - 00:50

రాజమహేంద్రవరం, అక్టోబర్ 23: హ్యాపీ సండే పేరిట నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలు ఆదివారం ఉదయం స్థానిక పుష్కరాలరేవులో ఆనందోత్సాహాల మధ్య జరిగాయి. ఎంపి ఎం మురళీమోహన్, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, కమిషనర్ వి విజయరామరాజు తదితరులు ఈకార్యక్రమాల్లో పాల్గొన్నారు.

10/24/2016 - 00:49

బిక్కవోలు, అక్టోబర్ 23: మండల కేంద్రమైన బిక్కవోలుకు చెందిన స్వర్ణకారుడు అంబరపు శ్రీనివాస్ బంగారంతో రూపొందించిన హెలికాప్టర్ చూపరులకు ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలుగజేస్తోంది. 2 గ్రాముల, 700 మిల్లీ గ్రాముల బంగారంతో వారం రోజుల పాటు శ్రమించి తయారుచేసిన అతిచిన్న ఈ నమూనా విహంగం అంగుళం లోపు ఎత్తు, అంగుళం పొడవు పరిమాణంలో బొటన వేలి గోరు సైజులో రూపొందించారు.

10/24/2016 - 00:49

అమలాపురం, అక్టోబర్ 22: కోనసీమ వాసులకే కాదు, జిల్లా వాసులకు సుపరిచయం, కొండ గుర్తుగా వెలుగొందిన గడియార స్తంభం చరిత్రలో కలిసిపోయింది. దాని స్థానంలో నూతన హంగులతో కూడిన మరో స్మారక చిహ్నం రూపుదిద్దుకోనుంది. అయితే గడియార స్తంభం సెంటర్‌తో సుమారు 60 ఏళ్ల అనుబంధాన్ని ఒక్కసారిగా వదులుకోవాలంటే ఈ ప్రాంతవాసులకు ఒకింత బాధగానే ఉంది.

10/24/2016 - 00:48

అమలాపురం, అక్టోబర్ 23: పిసిసి కార్యదర్శిగా అమలాపురంనకు చెందిన ప్రముఖ న్యాయవాది దేవరపల్లి రాజేంద్రబాబును నియమిస్తూ పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులను డిసిసి అధ్యక్షుడు కందుల దుర్గేష్ ఆదివారం దేవరపల్లికి అందజేశారు. విద్యార్ధి దశ నుండి కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తూ వివిధ పదవులు నిర్వహించిన దేవరపల్లి కుటుంబ సభ్యులు కూడా కాంగ్రెస్ వాదులుగా పనిచేశారు.

10/24/2016 - 00:47

అమలాపురం, అక్టోబర్ 23: బిసి ఫెడరేషన్ ఏర్పాటుచేసి బిసిల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు అన్నారు. ఆదివారం విశే్వశ్వరాయపురంలో జరిగిన మలికిపురం మండల బిసి సెల్ కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆది నుండి తెలుగుదేశం పార్టీకి బిసి సోదరులు అండదండలు అందజేస్తున్నారన్నారు.

Pages