S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10/24/2016 - 00:38

సంజామల, అక్టోబర్ 23:సంజామల సహకార బ్యాంకులో సబ్సిడీ విత్తన శెనగ ప్యాకెట్లు మాయమైన సంఘటన శనివారం రాత్రి వెలుగులోకి వచ్చింది. ఈ నెల ప్రారంభం నుంచి అధికారులు మండల పరిధిలోని రైతులకు గ్రామాల వారీగా విత్తనాల పంపిణీ చేశారు. అప్పడి నుంచి విత్తన పంపిణీ విషయంలో రైతులు, అధికారులకు మధ్య గొడవలు జరుగుతూ వచ్చాయి. 25న నొస్సం, అక్కంపల్లె గ్రామాలకు వెళ్లి అక్కడే రైతులకు విత్తన శెనగ పంపిణీ చేశారు.

10/24/2016 - 00:38

హొళగుంద, అక్టోబర్ 23:తుంగభద్ర దిగువ కాలువ నుంచి అక్రమంగా నీటి మళ్లింపును అడ్డుకునేందుకు ఆదివారం వివిధ శాఖల అధికారులు, పోలీసులు ముమ్మరంగా గస్తీ నిర్వహించారు. జలచౌర్యాన్ని అరికట్టేందుకు ఇరిగేషన్, విద్యుత్, రెవెన్యూ, పోలీసు అధికారులు 135 కిలోమీటర్ నుంచి 250 కిలోమీటర్ వరకూ కాలువపై బోర్డు పరిధిలో గస్తీ నిర్వహించినట్లు బోర్డు ఇఇ విశ్వనాథ్‌రెడ్డి, డిఇఇ పంపన్నగౌడ్ తెలపారు.

10/24/2016 - 00:37

ఆదోని, అక్టోబర్ 23:విజయవాడ- రాయచూర్, రాయచూర్-విజయవాడ, రాయచూర్-మచిలీపట్నం, మచిలీపట్నం-రాయచూర్ ప్రత్యేక రైళ్లను రెగ్యులర్ చేయాలని ఆదోని ప్రాంత వాసులు కోరుతున్నారు.

10/24/2016 - 00:37

కర్నూలు ఓల్డ్‌సిటీ, అక్టోబర్ 23:మహిళలకు కుట్టుపనిలో నైపుణ్యం గల శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలని కలెక్టర్ విజయమోహన్ కుట్టుశిక్షణ కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. స్థానిక రోజావీధిలోని మున్సిపల్ సిఆర్‌పి భవనంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రారంభించనున్న మహిళా కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఆదివారం కలెక్టర్ పరిశీలించారు.

10/24/2016 - 00:36

ఆళ్లగడ్డ, అకోట్బర్ 23:మండల పరిధిలోని మర్రిపల్లె గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి(26) ఆదివారం తలకు ఉపయోగించే వాస్మోల్ తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు రూరల్ ఎస్‌ఐ రామయ్య తెలపారు. వివరాలు.. భాగ్యలక్ష్మికి అదే గ్రామానికి చెందిన పాములేటితో ఐదేళ్ల క్రితం వివాహమైంది. ఆదివారం భాగ్యలక్ష్మి వాస్మోల్ తాగడంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

10/24/2016 - 00:36

వెల్దుర్తి, అక్టోబర్ 23:మండల పరిధిలోని మల్లేపల్లె గ్రామ సమీపంలో ఉన్న హంద్రీనీవా కాలువలో ఆదివారం రెండు గుర్తుతెలియని వ్యక్తుల మృతదేహాలు లభ్యమయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లి కాలువలో నుంచి మృతదేహాలను వెలికితీశారు. అందులో 35 ఏళ్ల మహిళ, ఐదేళ్ల వయస్సున్న బాలిక శవాలు బయటపడ్డాయి.

10/24/2016 - 00:34

గుంటూరు, అక్టోబర్ 23: రాజధాని నేపథ్యంలో నిర్మాణరంగం ఊపందుకుంది. దీంతో పాటు అందుకయ్యే ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని బిల్డర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తుంటే మరోవైపు సిమెంట్, ఇనుము ధరలు చుక్కలనంటుతున్నాయి. దీంతో భవన నిర్మాణాలకయ్యే ఖర్చులు విపరీతంగా పెరిగాయి.

10/24/2016 - 00:33

గుంటూరు, అక్టోబర్ 23: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నవంబర్, డిసెంబర్ నెలల్లో రాష్టవ్య్రాప్తంగా ప్రజా ఉద్యమాలను చేపట్టనున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు పేర్కొన్నారు. ఆదివారం గుంటూరు సిపిఎం జిల్లా కార్యాలయంలో విస్తృతస్థాయి సమావేశం జరిగింది.

10/24/2016 - 00:32

తెనాలి, అక్టోబర్ 23: భారతదేశంలో కార్పొరేట్ శక్తులకు ఎన్‌డిఏ భాగస్వామ్య పార్టీలు కొమ్ముకాస్తున్నాయని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పొలిట్‌బ్యూరో సభ్యుడు స్వదేశ్ భట్టాచార్య ఆరోపించారు. స్థానిక పుట్టి నాగేశ్వరరావు కళ్యాణ మండపంలో జరుగుతున్న సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జాతీయ మహాసభకు ఆదివారం కొనసాగాయి.

10/24/2016 - 00:31

మంగళగిరి, అక్టోబర్ 23: సీనియర్ ప్రధానోపాధ్యాయులను మాత్రమే ఉప విద్యాశాఖాధికారులుగా నియమించాలని ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు జివి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఆత్మకూరులో గల హ్యాపీ రిసార్ట్స్‌లో ఆదివారం ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరిగింది. జివి నారాయణరెడ్డి సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడారు.

Pages