S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/17/2018 - 13:04

విజయవాడ: పెథాయ్ తుపాను కారణంగా కాకినాడలో విద్యుత్ సరఫరా పూర్తి గా నిలిచిపోయింది. భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు ఎవ్వరూ కూడా బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. కాకినాడకు200 కిలోమీటర్ల దూరంలో ఈ తుపాను కేంద్రీకృతమైంది.

12/17/2018 - 13:33

బ్యాంకాక్: 2018 విశ్వసుందరి పోటీల్లో ఫిలిప్పెన్స్ భామ క్యాట్రియోనా ఎలిసా గ్రే ఎన్నికయ్యారు. ఈ పోటీల్లో ఫస్ట్న్న్రరప్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన తమారిన్ గ్రీన్, రెండో రన్నరప్‌గా వెనుజువెలాకు చెందిన స్టీఫెనీ గ్యుటెరాజ్ ఎంపికయ్యారు.

12/17/2018 - 13:17

జైపూర్: రాజస్థాన్ సీఎంగా అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎంగా సచిన్ పైలట్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.

12/17/2018 - 12:57

హైదరాబాద్: టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెశిడెంట్‌గా కల్వకుంట్ల చంద్రశేఖరరావు బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ భవన్‌లో వేడుకగా జరిగిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ఘనంగా జరిగింది. బసవతారకం ఆసుపత్రి నుంచి ఆటపాటలు, నృత్యాల మధ్య కేటీఆర్ తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. అనంతరం తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు.

12/17/2018 - 04:51

రాయ్‌బరేలి (యూపీ): తమ ప్రభుత్వం పారదర్శకంగా చేపట్టే రక్షణ ఒప్పందాలపై కాంగ్రెస్ లేనిపోని ఆరోపణలతో నోరుపారేసుకుంటందని, తమ పార్టీలో ఖత్రోచి అంకుల్స్, క్రిస్టియన్ మిచెల్స్ మామలు లేకపోయినా అర్థం లేని నిరసనలు చేపడుతూ అసత్యాలు ప్రచారం చేస్తోందని యూపీఏ అధ్యక్షురాలు సోనియాపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. పైగా ఆ పార్టీ న్యాయవ్యవస్థపై లేనిపోని అనుమానాలు సృష్టిస్తోందన్నారు.

12/17/2018 - 04:48

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణ విధానాలు అనుకున్న ఫలితాలు ఇస్తున్నాయని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ముఖ్యంగా వస్తు సేవలణ పన్ను (జీఎస్టీ), నల్లధన నిరోధంపై చట్టం, దివాలాకోడ్ వంటివి ఉద్దేశిత ఫలితాలను అందిస్తున్నాయని, వీటన్నింటి ఉమ్మడి ఫలితంగా భారత్ ఉజ్వల భవితం సంతరించుకోబోతున్నదని వెంకయ్యనాయుడు తెలిపారు.

12/17/2018 - 04:45

విజయవాడ, డిసెంబర్ 16: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనమండలి అభ్యర్థిగా ఆపస్ (ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం) తరపున జనె్నల బాలకృష్ణను అధికారికంగా ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ శ్రావణ్‌కుమార్, పీ రవిప్రసాద్ తెలిపారు.

12/17/2018 - 04:44

విజయవాడ (ఎడ్యుకేషన్), డిసెంబర్ 16: పిన్నమనేని, శ్రీమతి సీతాదేవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 28వ వార్షిక పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం ఆదివారం నగరంలోని పీబీ సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో జరిగింది. ఈ ఏడాది విశిష్ట పురస్కారాన్ని ప్రసిద్ధ ఫోరెన్సిక్ శాస్తవ్రేత్త డాక్టర్ గాంధీ పూర్ణచంద్ర కాజాకు ప్రదానం చేశారు. రూ. 5లక్షల నగదు బహుమతి అందజేశారు.

12/17/2018 - 04:41

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ప్రతిపక్షాల కూటమి ప్రధాన మంత్రి అభ్యర్థిగా రాహుల్‌గాంధీ పేరును డీఎంకే నేత స్టాలిన్ ఆదివారం చెన్నైలో ప్రతిపాదించిన నేపథ్యంలో అనేక పార్టీల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి విపక్షాల కూటమి తరఫున ఎవరినీ ప్రధానమంత్రి అభ్యర్థిగా తెరపైకి తేకూడదన్నది ఈ పార్టీల అభిప్రాయంగా కన్పిస్తోంది.

12/17/2018 - 04:41

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: హిందీబెల్ట్‌లోని మూడు రాష్ట్రాలు రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకారానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరవుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. జైపూర్‌లో జరిగే ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా రాజస్థాన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న అశోక్ గెహ్లాట్ ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించారు.

Pages