S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/28/2016 - 02:02

ఖమ్మం(జమ్మిబండ), సెప్టెంబర్ 27: ఖమ్మం కార్పొరేషన్‌లో పనిచేస్తున్న పలువురు కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ కార్మికులు, కార్మిక నాయకుడు మందా వెంకటేశ్వర్లు ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి పోటు ప్రసాద్ సమక్షంలో మంగళవారం ఎఐటియుసి అనుబంధ మున్సిపల్ వర్కర్స్ యూనియన్‌లో చేరారు. ఈ సందర్భంగా పోటు ప్రసాద్ మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం చేస్తూ అనేక సమస్యలు పరిష్కరించామన్నారు.

09/28/2016 - 02:01

మణుగూరు, సెప్టెంబర్ 27: రాత్రి 11 గంటల నుంచి ఒంటి గంట వరకు కటిక చీకటిలో మండల పరిధిలోని కోడిపుంజుల వాగులో కొట్టుకుపోయిన వ్యక్తి కోసం గాలింపుకు రెండు గంటల తర్వాత తెరపడింది. ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. వివరాల్లోకి వెళితే సోమవారం సాయంత్రం మండలంలో కురిసిన భారీ వర్షానికి కోడిపుంజుల వాగు వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో సమితిసింగారం పంచాయితీ పరిధిలోని అశోక్‌నగర్, వెంకటపతినగర్ కాలనీలు జలమయమయ్యాయి.

09/28/2016 - 02:01

దుమ్ముగూడెం, సెప్టెంబర్ 27: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పర్ణశాల వద్ద గోదావరి పొంగి ప్రవహించడంతో ఆ నీరు సీతమ్మవాగు ద్వారా సీత నారచీరెల ప్రదేశాన్ని ముంచింది. గోదావరి పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు దుమ్ముగూడెం వద్ద గోదావరి నది నీటిమట్టం 16.2కు చేరింది. పర్ణశాలలోని సీతవాగు ద్వారా గోదావరి నీ ఎగపోటు వచ్చి సీత నారచీరెల ప్రదేశం మునిగింది.

09/28/2016 - 01:59

తెనాలి, సెప్టెంబర్ 27: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం 2.25 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపిందని, హోదాకు మించిన ఆదాయం రాష్ట్రానికి చేకూరిందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. జిల్లా పర్యటలో భాగంగా మంగళవారం తెనాలి పట్టణంలో భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

09/28/2016 - 01:59

సత్తెనపల్లి, సెప్టెంబర్ 27: వరదల్లో జరిగిన పంట నష్టాలపై సమగ్ర నివేదికలు అందిన వెంటనే రైతులను ప్రభుత్వం అన్నివిధాల ఆదుకొనేందుకు సిద్ధంగా ఉందని స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. మంగళవారం ఆయన ముంపునకు గురైన గ్రామాలను, పంటలను పరిశీలించారు. ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభుత్వం సహాయం చేసేందుకు సిద్ధంగా ఉందని బాధితులకు భరోసానిచ్చారు.

09/28/2016 - 01:59

బెల్లంకొండ, సెప్టెంబర్ 27: ఇటీవల కురిసిన భారీవర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి రైతులకు భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో వైఎస్‌ఆర్ సిపి అధినేత జగన్మోహనరెడ్డి ప్రారంభించిన రైతు పరామర్శ యాత్ర మంగళవారం బెల్లంకొండ అడ్డరోడ్డుకు చేరింది. కొండమో డు నుండి రెడ్డిగూడెం వరకు వరద ముంపునకు గురైన పొ లాలను పరిశీలించారు.

09/28/2016 - 01:58

అమరావతి, సెప్టెంబర్ 27: భారీవర్షాలకు వాగులు పొంగిపొరలి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, వరద ముంపునకు గురైన పొలాల రైతులకు తక్షణమే ప్రభుత్వ పరంగా ఆర్థికసాయం అందజేయాలని పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం మండల పరిధిలోని జూపూడి, మునగోడు తదితర గ్రామాల్లో వరద ముంపునకు గురైన పంట పొలాలను కాంగ్రెస్‌పార్టీ నాయకులతో కలిసి పరిశీలించిన రఘువీరా రైతుల గోడును ఆలకించారు.

09/28/2016 - 01:58

రేపల్లె, సెప్టెంబర్ 27: వేలాది మంది విద్యార్థులు రేపల్లె ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యను అభిసించి అగ్రగాములుగా ఉన్న నేటి పరిస్థితులు అందుకు భిన్నంగా కళాశాలలో నెలకొన్నాయి. 1932లో నిర్మించిన ఈకళాశాల నేటి వరకు విద్యార్థులతో కళకళలాడుతోంది. అయితే కళాశాలకు అనుబందంగా అదనపు తరగతి గదులు నిర్మించారు.

09/28/2016 - 01:57

గుంటూరు, సెప్టెంబర్ 27: అందరి కోసం పర్యాటకం.. అనే నినాదంతో ఈ ఏడాది ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని అన్ని దేశాలు జరుపుకుంటున్నాయని, పర్యాటకం ద్వారా ప్రపంచ ప్రజలందరిలో ఐక్యతాభావం పెంపొందుతుందని భారతీయ సంస్కృతి ఆయుర్వేద వికాస పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు బందినేని రామకృష్ణ పేర్కొన్నారు.

09/28/2016 - 01:57

గుంటూరు (కొత్తపేట), సెప్టెంబర్ 27: ప్రకృతి వైపరీత్యాలు సంభవించి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న సమయంలో రాజకీయాలను పక్కనబెట్టి ప్రజలను ఆదుకోవాల్సిన సమయంలో వరదపై జగన్ విమర్శలు చేయడం బాధాకరమని ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Pages