S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/28/2016 - 00:35

భీమ్‌గల్, సెప్టెంబర్ 27: ట్రాన్స్‌ఫార్మర్ కోసం రైతు నుండి లంచం తీసుకుంటూ భీమ్‌గల్‌కు చెందిన ట్రాన్స్‌కో ఎడిఇ గంగాధర్ ఎసిబి అధికారుల వలలో చిక్కాడు. ఎసిబి డిఎస్పీ నరేందర్‌రెడ్డి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. భీమ్‌గల్ మండలం గొనుగొప్పులకు చెందిన వంజరి హన్మాండ్లు గత మార్చిలో 25కెవి ట్రాన్స్‌ఫార్మర్ కోసం ప్రభుత్వానికి డిడి కట్టాడు.

09/28/2016 - 00:35

మాక్లూర్, సెప్టెంబర్ 27: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 40వేల ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా జరిపిన అంచనాల ద్వారా తెలిసిందని, మరో రెండు రోజుల పాటు జరిగిన పంట నష్టంపై పూర్తి నివేదికలు ఇచ్చిన తర్వాత పంట నష్టపోయిన రైతులందరికి సకాలంలో నష్టపరిహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎంపి కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.

09/28/2016 - 00:34

నిజామాబాద్, సెప్టెంబర్ 27: అవినీతి ఆరోపణల్లో ముందు వరుసలో నిలిచే రవాణా శాఖలో పరిస్థితిని చక్కదిద్దుతూ పారదర్శకతకు పెద్దపీట వేయాలనే ఉద్దేశ్యంతో గత రెండు మాసాల క్రితం ప్రభుత్వం ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చినప్పటికీ, అక్రమార్కుల అవినీతి ముందు ఆన్‌లైన్ విధానం కూడా బలాదూర్‌గానే మారింది.

09/28/2016 - 00:32

కరీంనగర్, సెప్టెంబర్ 27: వెనుకబడిన తరగతుల ప్రజల అభివృద్ధికి ప్ర భుత్వం కృషిచేస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి ఈటల రాజేందర్ అన్నా రు. మంగళవారం నగరంలోని బైపాస్ రోడ్‌లో నిర్వహించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 101వ జయంతి ఉ త్సవాలకు మంత్రి ముఖ్యఅతిథిగా హా జరయ్యారు.

09/28/2016 - 00:31

బోయినిపల్లి, సెప్టెంబర్ 27: సమస్యలపై అవగాహన లేని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు రాష్ట్రాన్ని పాలించడానికి అర్హత లేదని తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. మిడ్‌మానేరు కట్ట తెగడానికి కారకుడైన భారీ నీటి పారుదల శాఖమంత్రి హరీష్‌రావును వెంటనే బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

09/28/2016 - 00:31

సుల్తానాబాద్, సెప్టెంబర్ 27: సుల్తానాబాద్ ఆర్టీసి బస్టాండ్ వద్ద మంగళవారం ఘోరప్రమాదం తప్పింది. కరీంనగర్ నుండి పెద్దపల్లి వైపుకు లారీ వెళ్తుంది. పెద్దపల్లి నుండి సుల్తానాబాద్‌కు బస్సు వస్తుంది. బస్సు బస్టాండ్‌లోకి వెళ్లేందుకు వస్తుండగా భారీ వాహనంగల లారీ అతను గమనించి ఒక్కసారిగా బస్టాండ్‌లోకి లారీని పో నిచ్చాడు. దీంతో ఆర్టీసి బస్సు పక్కనే ఉన్న సాయిశ్రీ హోటల్‌పైకి దూసుకెళ్లింది.

09/28/2016 - 00:30

కరీంనగర్, సెప్టెంబర్ 27: మంచి జ రిగితే ప్రభుత్వ గొప్పతనం, నష్టం జరిగితే గత పాలకుల అసర్ధత వల్లే అనడం టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి అలవాటై పోయిందని మాజీ ఎంపి, టిపిసిసి ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ అన్నారు.

09/28/2016 - 00:30

కరీంనగర్ టౌన్, సెప్టెంబర్ 27: జి ల్లాలో పర్యాటకరంగం అభివృద్ధికి వి స్తృతమైన అవకాశాలున్నాయని జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ తెలిపారు. మంగళవారం సాయంత్రం కళాభారతిలో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జిల్లాకు ఆధ్యాత్మిక, చారిత్రి క ప్రాధాన్యత ఉన్నదన్నారు. జిల్లాలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని తెలిపారు.

09/28/2016 - 00:28

ఆదిలాబాద్, సెప్టెంబర్ 27: బడుగు వర్గాల అభ్యున్నతి కోసం, తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం రాజీలేకుండా పోరాడిన మహానీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్ పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ 101వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రభుత్వ పండగగా మంగళవారం కలెక్టర్ సమావేశ మందిరంలో జయంతి వేడుకలను నిర్వహించారు.

09/28/2016 - 00:28

దివ్యనగర్, సెప్టెంబర్ 27: సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టును రాష్ట్ర దేవాదాయ, న్యాయ, గృహనిర్మాణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మంగళవారం జిల్లా ప్రత్యేక అధికారి వికాస్‌రాజ్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులో నీటి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Pages