S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/27/2016 - 03:07

విశాఖపట్నం, సెప్టెంబరు 26: విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ వ్యాపించిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో సోమవారం భారీ వర్షాలు కురిశాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. సోమవారం విశాఖ రూరల్ మండలాల్లో 11 నుంచి 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గడచిన వారం రోజుల్లో విశాఖ జిల్లాలో పదిమంది మరణించారు. ఒకరు గల్లంతైనట్టు జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలియచేశారు.

09/27/2016 - 03:05

హైదరాబాద్, సెప్టెంబర్ 26: అమరావతి నిర్మాణానికి సంబంధించి టెండర్లను ఆహ్వానించడంపై హైకోర్టు న్యాయమూర్తి ఇచ్చిన స్టే ఉత్తర్వులను తొలగించాలని ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ కోరారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాధ్, జస్టిస్ యు దుర్గాప్రసాదరావులతో కూడిన బెంచ్ ముందు ఈ అంశంపై విచారణ జరిగినపుడు అడ్వకేట్ జనరల్ ఈ విజ్ఞప్తి చేశారు.

09/27/2016 - 03:04

హైదరాబాద్, సెప్టెంబర్ 26: ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది నుండి 9, 10 తరగతులు చదివే దివ్యాంగ పిల్లలకు రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ ప్రాజెక్టు కింద ఎస్కార్ట్, ట్రావెల్ అలవెన్స్‌లను చెల్లించనున్నారు. 1 నుండి 8వ తరగతి చదివే ప్రాథమిక పాఠశాలల్లోని పిల్లలకు సర్వ శిక్షా అభియాన్ ఏటా ఎస్కార్ట్, ట్రావెల్ అలవెన్స్‌లను చెల్లిస్తోంది. 9, 10 తరగతులు చదివే పిల్లలకు మాత్రం ఇంతవరకూ ఎలాంటి అలవెన్స్‌లు లేవు.

09/27/2016 - 05:11

భద్రాచలం, సెప్టెంబర్ 26: ఖమ్మం జిల్లా భద్రాద్రిలోని శ్రీ సీతారామచంద్రస్వామి నిత్యకల్యాణమూర్తుల ఆభరణాల మాయం, తిరిగి దొరకడం వంటి సంఘటనల నేపథ్యంలో దేవస్థానం ఈఓ తాళ్లూరి రమేశ్‌బాబు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు.

09/27/2016 - 03:02

విశాఖపట్నం, సెప్టెంబర్ 26: జపాన్‌లో మురుగునీటి పారుదల పైప్‌లైన్ల మ్యాన్‌హోల్ కవర్లు కూడా కళాఖండాలుగా తీర్చిదిద్దుతున్నారు. సృజనాత్మకతను జోడించి సాధారణ రోడ్లలోని మ్యాన్‌హాల్ కవర్లను ఆకర్షణీయంగా రూపొందిస్తున్నారు. జపాన్‌లో మ్యాన్‌హోల్ కవర్ల డిజైన్ కోసం పోటీల నిర్వహణతో ప్రత్యేకంగా ఒక సొసైటీ ఉండటం గమనార్హం.

,
09/27/2016 - 02:56

హైదరాబాద్, సెప్టెంబర్ 26: గోదావరి, కృష్ణా బేసిన్‌లో వరద ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఈ రెండు బేసిన్‌లలో ఉన్న అన్ని ప్రాజెక్టుల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులన్నీ నీటితో నిండుకుండల్లా మారటంతో గేట్లు తెరిచి నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో వీటిని చూసేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు ప్రాజెక్టులను వస్తున్నారు. చాలాకాలం తరువాత నిండిన నిజాంసాగర్ ప్రాజెక్టుకు సందర్శకుల తాకిడి పెరిగింది.

09/27/2016 - 02:52

కర్నూలు, సెప్టెంబర్ 26: శ్రీశైలం జలాశయానికి భారీ వరద కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోను దృష్టిలో పెట్టుకుని శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అంశంపై మంగళవారం ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశముంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా సోమవారం సాయంత్రానికి 880.95 అడుగులకు నీరు చేరింది.

09/27/2016 - 02:51

సూళ్లూరుపేట, సెప్టెంబర్ 26: నూతన సాంకేతిక ఒరవడికి ఇస్రో శ్రీకారం చుట్టిందని ఆ సంస్థ చైర్మన్ ఎఎస్ కిరణ్‌కుమార్ అన్నారు. సోమవారం పి ఎస్ ఎల్‌వి-సి 35 ప్రయోగ విజయం అనంరతం నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌లో మీడియా సెంటర్‌లో శాస్తవ్రేత్తలతో కలసి ఆయన విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన సాంకేతిక విధాన ప్రయోగాల్లో తొలిసారే ఇస్రో ఎంతో ఘనత సాధించదన్నారు.

09/27/2016 - 02:49

హైదరాబాద్, సెప్టెంబర్ 26: ‘సమస్యలు ఏవైనా వస్తే వాటిని పెద్దవిగా చేసుకోకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోండి..’ అని కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. విడిపోగానే సమస్యలు పరిష్కారం కావని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలోని అన్ని హామీలనూ నెరవేరుస్తాం అని ఆయన పునరుద్ఘాటించారు.

09/27/2016 - 02:45

హైదరాబాద్, సెప్టెంబర్ 26: ఆంధ్రా, తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తూ, మరికొన్ని రైళ్ల రాకపోకలను మళ్లిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా తెలిపారు. సికిందరాబాద్-సత్తెనపల్లి-గుంటూరు-పిడుగురాళ్ల మధ్య నడిచే రైళ్లను రద్దు చేసినట్టు రైల్వే జిఎం తెలిపారు.

Pages