S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/26/2016 - 06:15

మిర్యాలగూడ టౌన్, సెప్టెంబర్ 25: నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ ఆదేశం ప్రకారం మెడికల్ ఎమర్జన్సీని విధించామని అమలులో ఉందని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ ఎ.్భనుప్రసాద్‌నాయక్ అన్నారు.

09/26/2016 - 06:14

కనగల్, సెప్టెంబర్ 25: 2019లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని సిఎల్పీ ఉపనేత, నల్లగొండ శాసన సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం తాజా వర్షాలు, వరదలతో పాటు ఎఎమ్మార్పీ నీటి రాకతో పూర్తిగా నిండిన కనగల్ మైలసముద్రం చెరువును ఆయన పరిశీలించి గంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు రైతులకు రుణమాఫీని ఒకేసారి అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

09/26/2016 - 06:13

మెదక్, సెప్టెంబర్ 25: మెదక్ పట్టణం జల దిగ్భందానికి గురైంది. మెదక్ నర్సాపూర్, మెదక్ వయా చేగుంట, మెదక్ ఎల్లారెడ్డి, సిద్దిపేట రోడ్లన్ని వాగులు, చెరువులు, ప్రాజెక్టులు నిండిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, ఆమెతో ఉన్న అధికారులు ఆర్డీఓ మెంచు నగేష్, డిఎస్పీ నాగరాజు, ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏసయ్య తదితర అధికారులందరు జల దిగ్భందంలో కూరుకుపోయారు.

09/26/2016 - 06:12

సిద్దిపేట, సెప్టెంబర్ 25 : సిద్దిపేట కోమటిచెరువు మినిట్యాంక్ బండ్‌ను ఆదివారం ఉదయం మంత్రి హరీష్‌రావు మరో సారి సందర్శించారు. మత్తడి దూకుతున్న దృశ్యాలను మంత్రి హరీష్‌రావు వీక్షించి సంతోషం వ్యక్తం చేశారు. కోమటిచెరువుకు వచ్చిన పర్యాటకులతో మమేకపై ఆప్యాయంగా పలకరించి వారితో జళకళ ఆనందాన్ని పంచుకున్నారు. కోమటిచెరువుకు పర్యాటక శోభ సంతరించుకోవటం మంత్రి హరీష్‌రావు ఆనందం వ్యక్తం చేశారు.

09/26/2016 - 06:11

పాపన్నపేట, సెప్టెంబర్ 25: ఏడుపాయల మంజీరలో చిక్కుకున్న ఒరిస్సా, మధ్యప్రదేశ్‌లకు చెందిన 23 మంది వలస కూలీలను రెండు ఆర్మీ హెలిఫ్యాడ్‌ల ద్వారా ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎయిర్‌ఫోర్స్ రెస్క్యూ బృందాలు రక్షించాయి. ఏడుపాయల్లో ఆదివారం ఉదయం 7:30 గంటలకు రెండు ఆర్మీ హెలికాప్టర్లు చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు రంగంలోకి దిగి ఆపరేషన్ ప్రారంభించాయి.

09/26/2016 - 06:11

సిద్దిపేట, సెప్టెంబర్ 25 : వ్యవసాయ మార్కెట్లు, గోదాంలను బలోపేతం చేసి ..రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా మార్కెట్ కమిటీల అభివృద్ధి చేయటమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో చిన్నకోడూడూరు మార్కెట్ యార్డు నిర్మాణానికి భూమి ఇచ్చిన రైతులకు చెక్కులను అందచేశారు.

09/26/2016 - 06:10

హత్నూర, సెప్టెంబర్ 25: కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మండల పరిధిలోని బోర్పట్ల-రెడ్డిఖానాపూర్ శివారులోని వాగులో వ్యక్తి గల్లంతైన సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం..

09/26/2016 - 06:10

మెదక్ రూరల్: వ్యవసాయ పొలాల వద్దకు వెళిల హల్దీవాగులో చిక్కుకున్న ఇద్దరు గిరిజన రైతులను జాతీయ విపత్తుల నివారణ సంస్థ(ఎన్‌డిఆర్‌ఎఫ్) సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న డిప్యూటీ స్పీకర్ ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి హుటాహుటిన సంఘటన స్థలానికి ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బందితో తరలివచ్చి వారిని రక్షించారు.

09/26/2016 - 06:08

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 25: అందరి సహకారంతో మహబూబ్‌నగర్ పట్టణం అభివృద్ది చేస్తున్నానని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్ పట్టణంలోని న్యూటౌన్‌లో నిర్మించబోయే బిడ్జ్రి పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా రోడ్డు వెడల్పు పనులను కూడా ఆయన పరిశీలించారు. ఆర్‌అండ్‌బి అతిథి గృహాం దగ్గర పాత ప్రహరి గోడను కూల్చివేత పనులకు సైతం ఆయన శ్రీకారం చుట్టారు.

09/26/2016 - 06:08

భూత్పూర్, సెప్టెంబర్ 25: జాతీయ రహదారిపై ప్రమాదాలను నివారించడానికి రహదారి విస్తరణకు కోట్లాది రూపాయలతో రోడ్డు నిర్మాణం పనులు చేపట్టారు. భూత్పూర్‌లో కిలోమీటర్ మేర వంతెన నిర్మాం చేపట్టగా, వంతెనకు ఇరువైపులా కాల్వల నిర్మాణం చేపట్టిన వృథాగా మారింది. ఇంటర్నల్ రహదారికి మరమత్తులు చేపట్టకపోవడంతో రహదారి గుంతల మయంగా మారింది.

Pages