S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/26/2016 - 03:36

పాకిస్తాన్ ప్రజలు బీభత్సకాండను ప్రోత్సహిస్తున్న తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విప్లవించే రోజులు సమీపిస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటన మరో అంతర్జాతీయ ప్రకంపనం...

09/26/2016 - 03:35

రాజకీయాలు ఒక్కోసారి అనూహ్యమైన రీతిలో చిత్రమైన మలుపులు తిరుగుతుంటాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా వివాదపు సుడిగుండంలో బిజెపి చిక్కుకోవడం అటువంటిదే. ఆ అంశంపై బిజెపి రాష్ట్ర నాయకులు, కేంద్ర నాయకులు ఎవరో ఒకరు ఇంచుమించు ప్రతిరోజు సంజాయిషీలు ఇవ్వవలసి వస్తున్నది. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అయితే అక్షరాలా సతమతమవుతున్నారు. తనను చూసి ఒక్కోసారి అయ్యోపాపం అనిపిస్తున్నది.

09/26/2016 - 03:25

జల దిగ్బంధంలో అపార్ట్‌మెంట్‌లు!’ ‘వరద’ ముంపులో జన జీవనం!’ తెలుగు రాష్ట్రాల అవినాభావ సంబంధం ఏమిటో గానీ, ఎండలొచ్చినా వానలొచ్చినా, వరదొచ్చినా- ప్రకృతి మాత రెండు ప్రాంతాలనీ ఒకే కంట చూసుకుంటున్నది.

09/26/2016 - 03:21

వర్షాకాలంలో జ్వరాలు, అంటువ్యాధులు ప్రబలకుండా పట్టణాలలో, గ్రామాల్లో ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధులు బాధించకుండా వుంటాయి. మురికి గుంటలు, నీరు నిల్వవుండే తొ ట్టెల్లో నీరు నిల్వ వుండకుండా చూసుకోవాలి. పశువులను ఇళ్ల మధ్య కాకుండా ప్రత్యేక ప్రదేశాల్లో పోషించాలి. మరుగుదొడ్లు, స్నానాల గదుల్ని వెలుతురు వుండేలా చూసుకోవాలి.

09/26/2016 - 03:21

భారత భూభాగాలు ఆక్రమించి భారత్‌లో విప్లవ కారులకు, విధ్వంసాలకు సహాయం సహకారం అందించి భారత్‌కు ఎన్.ఎస్.బి.లో సభ్యత్వం వద్దు అని ప్రపంచ దేశాలకు చాటి, నిత్యం భారత్‌పై నిప్పులు రేపుతున్న శత్రుదేశమైన చైనాకు అమరావతి నిర్మాణంలో సాంకేతిక పరులకు అప్పగించి ఎర్ర చందనం ఎగుమతికి ఒప్పందం కుదుర్చుకొన్న ఆంధ్ర సి.ఎం. పరిశ్రమ స్థాపనకు స్థలాలు ఇస్తామనడం శోచనీయం.

09/26/2016 - 04:29

హైదరాబాద్, సెప్టెంబర్ 25: భారీ వర్షాలు, వరదల వల్ల ఎలాంటి విపత్కర పరిస్ధితి ఎదురైనా ఎదుర్కొవడానికి ప్రభుత్వంలోని అన్ని శాఖలు సిద్థంగా ఉండాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఆస్తి నష్టం జరిగితే పూడ్చుకోవచ్చు, కానీ ప్రాణ నష్టం సంభవిస్తే పూడ్చలేమని, వరదల నేపథ్యంలో అలాంటి పరిస్థితి రాకుండా యంత్రాంగం అప్రమత్తం కావాలని బలంగా ఆదేశించారు.

09/26/2016 - 03:14

హైదరాబాద్, సెప్టెంబర్ 25: దేశంలో పెద్ద ఎత్తున ఖాళీగా ఉన్న ఐఎఎస్, ఐపిఎస్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఐఎఎస్ ఖాళీలు 1470, ఐపిఎస్ 906 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కృష్ణయ్య ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కాబట్టి ఈ పోస్టుల భర్తీ కోసం వెంటనే యుపిఎస్‌సి ద్వారా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.

09/26/2016 - 03:13

వరంగల్, సెప్టెంబర్ 25: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరిలో క్రమక్రమంగా వరద ప్రవాహం పెరుగుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వరద పరిస్ధితిపై ముఖ్యమంత్రి కెసిఆర్ వరంగల్ జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. పరిస్థితి కలెక్టర్‌ను అడిగితెలుసుకున్నారు. ముందస్తుగా గోదావరి పరివాహక ప్రాంతాలలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు.

09/26/2016 - 03:11

సిద్దిపేట, సెప్టెంబర్ 25 : భారీ వర్షాలు కురుస్తున్నందున అధికారులు అప్రమత్తంగా భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదేశాలు జారీ చేశారు. మెదక్ జిల్లా సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయంలో జెసి వెంకట్రామ్‌రెడ్డి, ఇరిగేషన్, రెవెన్యూ, ఫారెస్టు, అధికారులతో భారీ వర్షాలు, వరదలు, సహయక చర్యలపై అధికారులతో సమీక్షించారు.

09/26/2016 - 03:09

నాగార్జునసాగర్, సెప్టెంబర్ 25: నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎగువ భాగాన గత రెండురోజులుగా శ్రీశైలం నుండి నీటిరాక ప్రారంభం కావడంతో సాగర్ జలాశయం నీటిమట్టం క్రమంగా పెరుగుతోది. నిన్నమొన్నటివరకు సాగర్ జలాశయ నీటిమట్టం 513 అడుగులు ఉండగా ఆదివారం సాయంత్రానికి 516 అడుగులకు పెరిగింది. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, ఉపనదులు ద్వారా ఎగువ కృష్ణానదిలో భారీగా నీరు వచ్చి చేరుతోంది.

Pages