S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/23/2016 - 12:19

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత గురువారం అర్ధరాత్రి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జ్వరం, డీహైడ్రేషన్ సమస్యలతో ఆమె బాధపడుతోందని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన అక్కర్లేదని వైద్యులు శుక్రవారం వెల్లడించారు.

09/23/2016 - 12:15

విజయవాడ : విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో వైఎస్ఆర్ సీపీ కార్పొరేటర్లను సస్పెండ్ చేస్తున్నట్లు మేయర్ కోనేరు శ్రీధర్ ప్రకటించారు. శుక్రవారం ఉదయం సమావేశం ప్రారంభమైన వెంటనే కృష్ణా పుష్కర పనుల్లో చోటు చేసుకున్న అవకతవకలపై విచారణ జరపాలని వైఎస్ఆర్ సీపీ కార్పొరేటర్లు పట్టుబట్టారు. మేయర్ కోనేరు శ్రీధర్ ససేమిరా అన్నారు.

09/23/2016 - 12:06

కడప : పులివెందుల శివారులో ఆనంద్ అనే ఆర్ఎంపీ వైద్యుడిని శుక్రవారం ఉదయం హత్యచేసి పడేశారు. అతన్ని ఎక్కడైనా చంపి ఇక్కడ పడేశారా? లేక ఇక్కడకు రప్పించి హత్య చేశారా? అన్న వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

09/23/2016 - 12:01

హైదరాబాద్ : భారీ వర్షాలతో హైదరాబాద్ నగరంలో 80 శాతం చెరువులు, కుంటలు పూర్తిగా నిండాయని, నాలాల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవడమేగాక, నాలాల ఆక్రమణలపై విచారణకు కమిటీ వేస్తామని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ, పరిస్థితిని చక్కదిద్దేందుకు జీహెచ్‌ఎంసీ సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారన్నారు.

09/23/2016 - 11:56

విశాఖపట్టణం : కోల్డ్‌ స్టోరేజీలకు సబ్సిడీ ఇస్తున్నామని, మత్స్య పరిశ్రమను ఏపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, ఆక్వా ఉత్పత్తుల అభివృద్ధికి రాయితీలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. విశాఖలో శుక్రవారం అంతర్జాతీయ సముద్ర ఉత్పత్తుల ప్రదర్శనలో మాట్లాడుతూ, ఏపీ నుంచి 2.35మెట్రిక్‌ టన్నుల మత్స్య సంపద ఎగుమతి జరుగుతుండగా, 70 శాతం ఎగుమతి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

09/23/2016 - 11:49

విశాఖ: కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు నగరంలో అంతర్జాతీయ సముద్ర ఉత్పత్తుల ప్రదర్శనను శుక్రవారం ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, పార్లమెంటు సభ్యులు గోకరాజు, హరిబాబు పాల్గొన్నారు. ఈ ప్రదర్శన మూడు రోజులపాటు జరగనుంది.

09/23/2016 - 11:44

ఢిల్లీ: ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబును విచారించాలని వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. రామకృష్ణారెడ్డి పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపి, ఈ కేసులో తాము జోక్యం చేసుకోబోమని పిటిషనర్‌కు సుప్రీం తేల్చిచెప్పింది. కేసుపై నాలుగు వారాల్లో విచారణ జరిపి, పరిష్కరించాలని ఈ సందర్భంగా హైకోర్టుకు సుప్రీం సూచించింది.

09/23/2016 - 11:38

కర్నూలు : బంగాళఖాతంలో అల్పపీడనం ప్రభావంతో కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కుందూ నది పొంగిపొర్లుతోంది. కోవెలకుంట్ల మండలం లింగాల, వల్లంపాడు, కొప్పెర్లలో కుందూనది, పాలేరు వాగులు పొంగిపొర్లుతున్నాయి. దాదాపు 600 ఎకరాల్లో ఆయా పంటలు నీటమునిగాయి.

09/23/2016 - 11:36

చిత్తూరు : రామకుప్పం మండలంలో ఎస్‌.గొల్లపల్లి, సంద్యాలమడుగు, నన్యాలతండాలో ఏనుగులు శుక్రవారం వరి, టమోటా, అరటి తోటలకు తీవ్ర నష్టం కలిగించాయి. చేతికందివచ్చిన పంటలు నష్టానికి గురవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

09/23/2016 - 11:35

హైదరాబాద్ : హైదరాబాద్లోని హుసేన్ సాగర్ లోతట్టుప్రాంతాల్లో నివాసముంటున్న 500 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హుసేన్ సాగర్లో నీటి మట్టం ప్రమాదస్థాయికి మించి ప్రవహిస్తుండటంతో ఇందిరాపార్కు, ఎన్టీఆర్ స్టేడియం ప్రాంతాల్లోని ఒపెన్ నాలా పక్కన ఉన్న అరుంధతీనగర్, సబర్మతీ నగర్ మురికి వాడలలో వరద ప్రవాహం పెరిగింది. దీంతో ఆయా బస్తీల వాసులను శిబిరాలకు తరలించారు.

Pages