S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/23/2016 - 11:33

అస్సాం: శుక్రవారం తెల్లవారు జామున కర్బి అంగ్లాంగ్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్లో కేపీఎల్‌టీ(కర్బి పీపుల్స్ లిబరేషన్ టైగర్స్) కి చెందిన ఆరుగురు తీవ్రవాదులు హతమయ్యారు. బోకజాన్ పోలీస్ స్టేషన్ పరిథిలోని బనిపథర్ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. నిర్దిష్ట సమాచారం మేరకు పోలీసులు, సైన్యం సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను నిర్వహించాయి. మృతుల్లో కేపీఎల్‌టీ అగ్ర నేతలిద్దరు ఉన్నారు. ఓ సైనిక జవానుకు గాయాలయ్యాయి.

09/23/2016 - 11:16

హైదరాబాద్‌: సాక్షిలో పెట్టుబడులపై ఈడీ దాఖలు చేసిన అక్రమాస్తుల కేసులో శుక్రవారం ఈడీ కోర్టులో విచారణ జరిగింది. వైకాపా అధ్యక్షుడు జగన్‌తో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి, అయోధ్య రామిరెడ్డి, వెంకట్రామిరెడ్డి విచారణకు హాజరయ్యారు. జగతి పబ్లికేషన్స్‌లో రాంకీ పెట్టుబడులు మనీలాండరింగ్‌ చట్టానికి విరుద్ధమని ఈడీ అభియోగం.

09/23/2016 - 06:21

భద్రాచలం, సెప్టెంబర్ 22: అరవై పదుల అమ్మకు కన్నబిడ్డలు దూరమైతే.. తన ఒడిలో పుట్టి పెరిగిన బిడ్డలను తల్లి నుండి బలవంతంగా వేరుచేస్తుంటే.. ఆ కన్న తల్లి ఎంత తల్లిడిల్లుతుంది. ఈ చేదు అనుభవాలన్నీ ఇప్పుడు ఖమ్మం జిల్లా వాసుల గుండెలను పిండేస్తున్నాయి. పాలకుల పాపమో..దేవుని శాపమో కానీ ఖమ్మం జిల్లా తల్లికి కడుపు కోతే మిగిలింది.

09/23/2016 - 06:21

ఖమ్మం(మామిళ్ళగూడెం), సెప్టెంబర్ 22: బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, రుతుపవనాల ప్రభావంతో జిల్లాలో రెండు రోజులుగా ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం అర్ధరాత్రి జిల్లాలోని పలు మండలాల్లో ఎడతెరిపిలేకుండా వర్షం కురవడంతో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. అత్యధికంగా గుండాల మండలంలో 62.2 మిల్లిమిటర్ల వర్షపాతం నమోదు కాగా, ఏన్కూరు మండలంలో అత్యల్పంగా 4.6 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు అయింది.

09/23/2016 - 06:20

చర్ల: అల్పపీడన ద్రోణి కారణంగా చర్ల మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు తాలిపేరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు గురువారం ప్రాజెక్టులో 7 గేట్లను నాలుగు అడుగుల మేర ఎత్తి 18వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. రెండురోజులుగా చర్ల మండలంలో ఎడతెరపి లేని వర్షం కురుస్తోంది. అలాగే తాలిపేరు ఎగువున ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

09/23/2016 - 06:20

భద్రాచలం, సెప్టెంబర్ 22: వాయుగుండం కారణంగా భద్రాచలం మన్యంలో గురువారం కుండపోతగా వర్షం కురిసింది. ఏజెన్సీలోని వాగులు, కుంటలు, చిన్నచిన్న చెరువులు వర్షపు నీటితో హోరెత్తుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భద్రాచలంలో 10.8 మి.మీలు, చర్లలో 24మి.మీలు, వాజేడులో 37.2 మి.మీలు, వెంకటాపురంలో 18.4 మి.మీలు, దుమ్ముగూడెంలో 41.8 మి.మీలు చొప్పున వర్షపాతం నమోదైంది.

09/23/2016 - 06:19

సత్తుపల్లి, సెప్టెంబర్ 22: ఈ నెల 19,20 తేదీలలో వేంసూరు మండలం అడసర్లపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన జోనల్‌స్థాయి ఖోఖో క్రీడలో సత్తుపల్లి కెపిఆర్ గౌతమ్‌కు చెందిన విద్యార్థులు ఎం వినయ్, షేక్ మీర్జావలిలు ఉత్తమ ప్రతిభ కనబర్చి జిల్లా స్థాయి క్రీడలకు ఎంపికైనట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది.

09/23/2016 - 06:19

కొత్తగూడెం టౌన్, సెప్టెంబర్ 22: విదేశీ బొగ్గు దిగుబడుల వల్ల వస్తున్న సవాళ్ళను అధిగమించి సింగరేణి కార్మికులు సంస్థ నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించాలని కొత్తగూడె ఏరియా జిఎం రమణమూర్తి అన్నారు. కొత్తగూడెం ఏరియాలోని జికే ఓసిలో గురువారం మొదటి షిఫ్ట్ ప్రారంభంలో మల్టీ డిపార్ట్‌మెంటల్ బృంద సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఏరియా ఎండిటి నాయకులు, జనరల్ మేనేజర్ కెవి రమణ మూర్తి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

09/23/2016 - 06:18

కొణిజర్ల, సెప్టెంబర్ 22: మండల పరిధిలోని సింగరాయపాలెంలో రైతులు గురువారం వ్యవసాయ అధికారులను నిర్బంధించారు. గ్రామంలో వందమందికి పైగా రైతులు ఈ ఏడాది ఖరీఫ్‌లో ఓ కంపెనికి చెందిన మిరప విత్తనాలు సాగు చేశారు. ఇప్పటి వరకు ఎకరాకు ముపై నుంచి యాబై వేల వరకు ఖర్చు చేసి, ఆ కంపెనికి చెందిన మిరప విత్తనాలతో తోటలు సాగు చేశారు.

09/23/2016 - 06:18

తిరుమలాయపాలెం, సెప్టెంబర్ 22: మండలంలోని వివిధ పాఠశాలలకు మధ్యాహ్న భోజనం వండిపెట్టేందుకు 10.07క్వింటాళ్ళ బియ్యం మంజూరైనట్లు మండల విద్యాశాఖాధికారి ఇటికాల సత్యనారాయణ తెలిపారు. సెప్టెంబర్ మాసానికి గానూ మండలంలోని 74ప్రభుత్వ పాఠశాలలకు 6999మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండిపెట్టేందుకు బియ్యం మంజూరైనట్లు ఎంఇఓ పేర్కొన్నారు.

Pages