S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/23/2016 - 06:11

విశాఖపట్నం, సెప్టెంబర్ 22: పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్నాం. ఎన్నో కష్టాలు అనుభవించాం. అప్పటి అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేశాం. అధికారం దక్కి రెండున్నరేళ్లు దాటుతోంది. అయినా నామినేటెడ్ పోస్టుల భర్తీ లేదు. ఇంకెన్నాళ్లు జెండాలు మోస్తూ వెట్టిచాకిరీ చేయాలంటూ తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు.

09/23/2016 - 22:39

శ్రీకాకుళం, సెప్టెంబర్ 22: జిల్లాలో త్వరలో ఆధ్యాత్మిక భావాలు సెలయేరులా ప్రవహించనున్నాయి. అప్పుడప్పుడు అసాంఘిక కార్యక్రమాలు చోటుచేసుకుంటున్న వాతావరణంలో ఇక ప్రశాంతత ఏర్పడనుంది. వివరాలివి. జాతీయ రహదారికి ఆనుకుని తర్లిపేట నుంచి టెక్కలికి వెళ్ళే మార్గంలో తర్లికొండ సర్వే నెం.36లో 209 ఎకరాలు వేదవిద్య విశ్వవిద్యాలయానికి భూమి కేటాయిస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.

09/23/2016 - 06:06

ఒంగోలు, సెప్టెంబర్ 22: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవగా, మరికొన్ని ప్రాంతాల్లో చెదురుమదురుగా కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ భారీ వర్షాలకు పర్చూరు మండలం అడుసుమల్లి వద్ద సాకివాగు పొంగి ప్రవహిస్తుండటంతో పర్చూరు- గుంటూరు మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి.

09/23/2016 - 22:02

కావలి రూరల్, సెప్టెంబర్ 22: కాపులకు ప్రభుత్వం అన్నివిధాలా చేయూతనిస్తోందని బిసి కార్పొరేషన్ ఇడి వెంకటస్వామి పేర్కొన్నారు. ఎంపిడిఓ కార్యాలయంలో కాపులకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాల గురించి అవగాహన కల్పించే కార్యక్రమంలో వివిధ అంశాలను ఆయన వివరించారు.

09/23/2016 - 22:33

నంద్యాల, సెప్టెంబర్ 22: నంద్యాల, మహానంది ప్రాంతాల్లో గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పట్టణ నడిబొడ్డులో ప్రవహిస్తున్న చామకాల్వకు వరద ఉద్ధృతి క్రమక్రమంగా పెరుగుతోంది. దీంతో చామకాల్వకు రెండు వైపులా ఉన్న లోతట్టు ప్రాంతాల కాలనీల్లోకి వరదనీరు ఇళ్ళల్లోకి చేరింది. దీంతో సుమారుగా 500కుటుంబాలు నిరాశ్రయులయ్యారు.

09/23/2016 - 06:17

ఖమ్మం, సెప్టెంబర్ 22: జిల్లాల విభజన నేపథ్యంలో ఆయా జిల్లాల్లో కొత్త కమిటీలను వేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. కొత్త జిల్లాల్లో నేతలకు పార్టీల పదవులు దక్కే అవకాశం ఉండటంతో వారిలో ఆనందం వ్యక్తమవుతోంది.

09/23/2016 - 22:23

గుంటూరు, సెప్టెంబర్ 22: జిల్లాను కుంభవృష్టి కుదిపివేసింది. భారీ వర్షాలకు వ్యవసాయ, ఉద్యానవన పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఇటీవల కురిసిన వర్షాలకు రసాయనాలు చల్లి పంటలను కాపాడుకునే ఆతృతతో ఉన్న రైతులు ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు పంటలు చేతికి అందివచ్చే పరిస్థితులులేవని లబోదిబో మంటున్నారు. పత్తి, మిర్చి, వరి పంటలకు అపారన సంభవించింది.

09/23/2016 - 05:55

సత్తెనపల్లి, సెప్టెంబర్ 22: గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో పాటు వివిధ గ్రామాలను వరదనీరు చుట్టుముట్టి అతలాకుతలం చేసింది. బుధవారం ఆర్ధరాత్రి నుండి గురువారం ఉదయం 11 గంటల వరకు కురిసిన వర్షానికి పట్టణంలోని ప్రజలు ఎప్పుడు ఏమి జరుగుతుందోన్న భయంతో వణికిపోయారు.

09/23/2016 - 05:55

నాదెండ్ల, సెప్టెంబర్ 22: బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మండలంలోని రెండు రోజుల నుండి కురుస్తున్న అకాల వర్షాల వల్ల కుప్పగంజి వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఈ వరద బీభత్సం వల్ల అమిన్‌సాహేబ్‌పాలెం గ్రామంలో కుప్పగంజి వాగు పొంగి పొర్లటంతో ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. ఒక వ్యక్తి 20 గంటల పాటు తాటిచెట్టును పట్టుకుని స్థానికుల సహాయంతో బయటపడ్డాడు.

09/23/2016 - 22:18

కాకినాడ, సెప్టెంబర్ 22: భారీ వర్షాలపై అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా యంత్రాంగాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టాలు లేకుండా తగు ముందస్తు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్‌కు సూచించారు. గురువారం ముఖ్యమంత్రి నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో జిల్లా కేంద్రం కాకినాడ నుండి పాల్గొన్న కలెక్టర్ జిల్లాలో నెలకొన్న పరిస్థితులను వివరించారు.

Pages