S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/23/2015 - 03:49

హైదరాబాద్, డిసెంబర్ 22: లోకకళ్యాణం, విశ్వశాంతి కోసం ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు తలపెట్టిన అయుత చండీయాగం బుధవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభం కాబోతుంది. చండీయాగానికి ముందు చేయాల్సిన పూజా కార్యక్రమాలను మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి కెసిఆర్ దంపతులు నిర్వహించిన అనంతరం వేద మంత్రోచ్ఛరణల మధ్య వారు యాగశాలలోకి ప్రవేశించారు.

12/23/2015 - 03:47

హైదరాబాద్, డిసెంబర్ 22: డిఎస్సీ- 2014లో స్థానికేతరుల కోటా వివాదంపై ట్రిబ్యునల్ తీర్పు వెలువరించింది. 20 శాతం స్థానికేతర కోటాకు రాష్ట్రేతరులు కూడా అర్హులేనని ట్రిబ్యునల్ పేర్కొంది. స్థానికేతర కోటా రాష్ట్రంలోని 13 జిల్లాలకేనన్న ఆంధ్రప్రదేశ్ వాదనను ట్రిబ్యునల్ కొట్టివేసింది. స్థానికేతరుల కోటా రాష్ట్రానికే వర్తింపచేసే అధికారం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది.

12/23/2015 - 03:45

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: ఇక బాల నేరస్థుల ఆటకట్టు. మైనార్టీ తీరలేదు కాబట్టి ఎలాంటి ఘోరాలకు, నేరాలకు, అఘాయిత్యాలకూ పాల్పడ్డా చిక్కే ఉండదనుకుంటే ఇబ్బందే. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నిర్భయ కేసు నేపథ్యంలో మహిళలకు మరింత భద్రత కలిగించే దిశగా పార్లమెంట్ బలమైన ముందడుగు వేసింది. హేయమైన, ఘోరమైన ఆకృత్యాలకు పాల్పడే 16-18 సంవత్సరాల వయస్కులను ఇంకెంత మాత్రం బాల నేరస్థులుగా పరిగణించరు.

12/23/2015 - 03:19

నేనిదివరలో హంపీ దర్శించడం జరిగింది. అక్కడ రాయలవారి కోటను, అనేక భవనాలను పూర్వపు ముస్లిం రాజులు ధ్వంసం చేసిన శిథిలాలు కళ్ళారా చూసాను. అక్కడ ఇప్పటికీ పోలీసు పికెటింగ్‌లోనే పరిసరాలు నడుస్తున్నాయి. ఆ ముస్లి రాజులకు తీసిపోయిన వాడు కాదీ టిప్పుసుల్తాన్. కర్నాటక ప్రభుత్వం కుహనా రాజకీయాలకు స్వస్తిచెప్పకపోతే ప్రజలే భవిష్యత్తులో వారికి గుణపాఠం చెపుతారని గమనించాలి.

12/23/2015 - 03:14

తెలుగు భాష అజంత భాష. అజంత భాష అంటే అచ్చులతో అంతమయ్యే భాష అని అర్థం. రామయ్య, సీతమ్మ, సుబ్బమ్మ ఇవన్నీ అజంత పదాలు. భాష కూడా ముత్యాల్లా గుండ్రంగా ఎవరినైనా ఆకర్షిస్తుంది. తెలుగు సాహిత్య పరిణామక్రమాన్ని నన్నయ యుగంతో మొదలుపెడ్తే అప్పటి నుంచి ఇప్పటివరకు భాష అనేక మార్పులు చెంది కాలానుగుణంగా ఆధునిక భాషగా పరివర్తన చెందింది. నన్నయకు ముందున్న కాలాన్ని ప్రాఙ్నన్నయ యుగమంటారు.

12/23/2015 - 03:13

ఈ మధ్య అనేక వ్యాసాలలో ఉత్తరాలలో హిందూ మతం నశించిపోవటానికి ఆ మతంలోని లౌకిక వాదులతో సహా ఇతర మతాల ప్రచారం, ప్రలోభాలూ కారణమనీ అనేక మంది తమ ఆవేదనని వ్యక్తం చేశారు. అవన్నీ చదివినప్పుడూ చదువుతున్నపుడూ నన్ను వేసుకున్న ప్రశ్న, ‘దీనికి నిజంగా కారణమెవర’ని. ‘సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలంటూ ధర్మప్రచారకులూ, పండితులూ నిరంతరం ప్రజలకి బోధించడానికి శ్రమపడుతున్నారు.

12/23/2015 - 03:12

భారతదేశంలోలా కాకుండా సింగపూర్‌లో అమల్లో ఉన్న ఆరోగ్య వైద్య విధానం కింద, ఆ దేశంలోని ప్రతి వ్యక్తికీ, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, ఆసుపత్రి వైద్యం, దీర్ఘకాలిక ఆరోగ్య పరిరక్షణ, తదితర సంబంధిత కార్యక్రమాలు ఒక క్రమ పద్ధతి ప్రకారం చేపట్టి అమలు చేస్తారు.

12/23/2015 - 03:09

ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను ప్రభుత్వేతరులకు అమ్మివేయడం ఈ సంవత్సరం మరింతగా పుంజుకోవడం ప్రపంచీకరణ ప్రభావం గొప్పగా విస్తరించ బోతున్నదనడానికి మరో నిదర్శనం. ఇలా తెగనమ్మడం వల్ల లభిస్తున్న ఆదాయాన్ని కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు వార్షిక ఆదాయ వ్యయాల ఖాతాలలో జమ కట్టుకుంటున్నాయి. తద్వారా కొత్త పన్నులు విధించకుండా సాలుసరి లోటును పూడ్చుకుంటున్నాయి.

12/23/2015 - 02:53

అద్భుత సౌందర్యంతో హొయలొలికించడమే కాదు, అసమాన అభినయ విన్యాసంతో సంచలన నటిగానూ కీర్తిశిఖరాలను అధిరోహించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ ఐశ్వర్య రాయ్ బచ్చన్ మరో అవార్డును తన ఖాతాలో వేసుకుంది. శక్తిమంతమైన నటనతో 2015లో సంచలన నటిగా ఆమె ముంబయిలో సోమవారం రాత్రి ‘సాన్‌సుయ్-కలర్స్-స్టార్‌డస్ట్’ అవార్డును అందుకుంది.

12/23/2015 - 02:56

రాజస్థాన్‌లో ఎడారి భూములను హరిత వనాలుగా మార్చిన ఘనత ఆమెకే దక్కింది.. అందుకే ఆమెను అందరూ ‘వాటర్ మదర్’ అని గౌరవంగా పిలుస్తారు. ఎండిపోయిన చెరువులు, కుంటల్లో మళ్లీ జలకళ ఉట్టిపడేలా చేయడం ఆమెకి వెన్నతో పెట్టిన విద్య. నీటిని ఒడిసి పట్టుకోవడం, పొదుపుగా వాడుకోవడం, వ్యవసాయానికి వినియోగించుకోవడంలో పల్లెవాసులకు ఆమె తగిన తర్ఫీదు ఇస్తుంటారు.

Pages