S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/23/2016 - 05:40

తాడేపల్లిగూడెం, సెప్టెంబర్ 22: రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న డయాలసిస్ సెంటర్లకు అదనంగా మరికొన్ని ఉచిత డయాలసిస్ సెంటర్లు ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. గురువారం ఏరియా ఆస్పత్రిలో రూ.2కోట్లతో ఏర్పాటుచేసిన ఉచిత డయాలసిస్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు.

09/23/2016 - 05:40

తాళ్లపూడి, సెప్టెంబర్ 22: తాళ్లపూడిలో చుట్టూ పచ్చని నాచుతో దుర్గంధం వెదజల్లే నీటి మధ్య దాదాపు 40 యానాది కుటుంబాలు గత 20 రోజులుగా జీవనం సాగిస్తున్నారు. దూరం నుండి చూస్తే తాళ్లపూడి యానాది కాలనీ పచ్చని దీవిలో ఉన్నట్టు కన్పిస్తుంది. గ్రామంలో యానాది కాలనీకి ఎగువన ఉన్న పాకలవీధి, బిసిల వీధి నుండి వచ్చే మురుగునీటితో యానాది కాలనీ సమీపంలో గల చెరువు నిండిపోయింది.

09/23/2016 - 05:39

తణుకు, సెప్టెంబర్ 22: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ స్థానిక ప్రభుత్వాసుపత్రిని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా వివిధ విభాగాలకు చెందిన వార్డులను సందర్శించి రోగులను కలిసి, అందుతున్న సేవలపై ఆరాతీశారు. అలాగే పారిశుద్ధ్యం అమలును కూడా ఆయన పరిశీలించారు.

09/23/2016 - 05:39

ఏలూరు, సెప్టెంబర్ 22 : జిల్లాలో 152 ప్రత్యేక తరగతి గదులను ఎస్సీ, బిసి హాస్టల్స్‌లో నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధంచేయాలని కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో గురువారం విద్యాశాఖాధికారులతో ఆయన వివిధ అంశాలపై సమీక్షించారు.

09/23/2016 - 05:39

తణుకు, సెప్టెంబర్ 22: గత మూడురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తణుకు పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రకృతి చిరుజల్లులతో సరిపెట్టినా, రాత్రి 9గంటల నుంచి మాత్రం విజృంభించి మొత్తం వీధులను ముంచెత్తింది. ముఖ్యంగా పట్టణంలోని మూడో ప్రధాన రహదారి అయిన స్ర్తిసమాజం, రైల్వేస్టేషన్ రోడ్డు నీటితో మునిగింది.

09/23/2016 - 05:38

ఏలూరు, సెప్టెంబర్ 22: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నోరు తెరిస్తే అన్ని అబద్ధాలేనని, అంతా మోసమేనని వైకాపా అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు జనం ఓట్ల కోసం ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయినా ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసగించారన్నారు.

09/23/2016 - 05:30

విజయవాడ (కార్పొరేషన్), సెప్టెంబర్ 22: విజయవాడ నగరపాలక సంస్థలో కమాండ్ కంట్రోల్ వ్యవస్థ అమలులోకి వచ్చింది. తొలివిడతగా వీధి దీపాల నిర్వహణను అమలులోకి తెచ్చిన నగర పాలకులు ఈ వ్యవస్థ రాష్ట్ర ముఖ్యమంత్రి డాష్‌బోర్డునకు కూడా అనుసంధానం చేయడంతో నగర వీధి దీపాల నిర్వహణ సిఎం కార్యాలయ పరిశీలనలో ఉంటుంది. దీంతో నగర ప్రజలకు వీధి దీపాల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందనే చెప్పాలి.

09/23/2016 - 05:29

మచిలీపట్నం, సెప్టెంబర్ 22: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా బుధవారం అర్ధరాత్రి నుండి గురువారం తెల్లవారుఝాము వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. దీంతో జిల్లాలో 43.0 మి.మీల సరాసరి వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పెడన మండలంలో 150.6 మి.మీలు, అత్యల్పంగా తిరువూరులో 6.8 మి.మీల వర్షపాతం నమోదైంది. భారీ వర్షం కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పంట కాలువలు నిండుగా ప్రవహిస్తున్నాయి.

09/23/2016 - 05:28

నందిగామ/ పెనుగంచిప్రోలు/ వత్సవాయి, సెప్టెంబర్ 22: నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతాల్లో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు భారీ వర్షం కురవడంతో లోటత్తు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు మునే్నరుకు భారీగా వరద నీరు చేరుకుంది. వత్సవాయి మండలం లింగాల వద్ద మునే్నరు కాజ్‌వేను ఆనుకుని వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

09/23/2016 - 05:26

కలిదిండి, సెప్టెంబర్ 22: విద్యుదాఘాతానికి గురైన పడవ యజమాని నీటిలో గల్లంతైన సంఘటన గురువారం మండలంలోని కోరుకొల్లు శివారు చైతన్యపురంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం చైతన్యపురంలో చేపల పట్టుబడి నిమిత్తం ఆవకూరు వంతెన వద్ద పడవరేవు నుండి కూలీలతో పడవ యజమాని గంధం దొరబాబు(35) చైతన్యపురం బయలుదేరాడు.

Pages