S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/23/2016 - 05:11

పెద్దపల్లి రూరల్. సెప్టెంబర్ 22: పెద్దపల్లి మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగుతుండగా, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. వర్షాభావ పరస్థితుల కారణంగా పంటలు పండుతాయో, లేదో అన్న బెంగతో ఉన్న రైతులకు ఇటీవల కాలంలో కురిసిన వర్షాలు ఖరీప్ పంటలపై ఆశలు సజీవం చేశాయి.

09/23/2016 - 05:10

హుజూరాబాద్ రూరల్, సెప్టెంబర్ 22: హుజూరాబాద్-జమ్మికుంట ఫోర్‌లైన్స్ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభమై చురుగ్గా సాగుతున్నాయి. 14 కిలోమీటర్ల ఈ రోడ్డు నిర్మాణానికి ప్ర భుత్వం రూ.36 కోట్లు మంజూరు చేసింది.

09/23/2016 - 05:10

పెద్దపల్లి రూరల్, సెప్టెంబర్ 22: ప్రభుత్వ పాఠశాలల నిర్వహణలో ప్రజా భాగస్వామ్యం అవసరమని, అలాంటటప్పుడే పాఠశాలలు ప్రగతి పథంలో పయణిస్తాయని జిల్లా మానిటరింగ్ సభ్యులు టి.తిరుపతి టి.వేణుగోపాల్, కుంభాల సుధాకర్, మల్లయ యలు సూచించారు. రాష్టవ్య్రాప్తంగా విద్యాశాఖలో ఈనెల 21 నుంచి ప్రభు త్వ పాఠశాలల పర్యవేక్షణ కొనసాగుతోంది.

09/23/2016 - 05:09

మానకొండూర్, సెప్టెంబర్ 22: మరుగుదొడ్ల నిర్మాణ పనులను వేగవతంగా చేపట్టి లక్ష్యం పూర్తిచేయాలని సాంస్కృతిక సారథి ఛైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తెలిపారు. గురువారం మండల పరిధిలోని అన్నారం గ్రామంలోని ఎస్సీకాలనిలో కొనసాగుతున్న మరుగుదొడ్ల నిర్మాణ పనులను ఇంటింట తిరుగు తూ పరిశిలించారు. రసమయి మాట్లాడుతూ మరుగుదొడ్డి నిర్మించుకుంటే ప్రజలు ఆరోగ్యంగా జీవించవచ్చు అని తెలిపారు.

09/23/2016 - 05:09

కరీంనగర్, సెప్టెంబర్ 22: వివిధ రకాల కేసుల్లో పోలీస్ అధికారులు నేర స్థలాన్ని సందర్శించి పకడ్బంధీగా దర్యాప్తు చేపట్టాలని కరీంనగర్ ఇం చార్జి డిఐజి సి.రవివర్మ అన్నారు. కేసుల దర్యాప్తు, విచారణల్లో అలసత్వం ప్రదర్శిస్తే క్రమశిక్షణాచర్యలు తప్పవని హె చ్చరించారు. గురువారం స్థానిక పో లీస్ హెడ్‌క్వార్టర్స్‌లో జిల్లా నేర సమీక్షాసమావేశం జరిగింది.

09/23/2016 - 05:08

ఎల్కతుర్తి, సెప్టెంబర్ 22: పెళ్లి చేసుకుంటానని పెద్దమనుషుల ముందు ఒ ప్పుకుని ఇప్పుడు పెళ్లి చేసుకోవడం లేదని, ప్రియుడితో పెళ్లి జరిపించాలని డిమాండ్‌చేస్తూ ప్రియుడి ఇంటి ముం దు ప్రియురాలు బైఠాయించిన సంఘటన ఎల్కతుర్తి మండలం దామెర గ్రా మంలో గురువారం సాయంత్రం చో టుచేసుకుంది. ఈ సంఘటనకు సం బంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

09/23/2016 - 04:56

కాన్పూర్, సెప్టెంబర్ 22: భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయమైన 500వ టెస్టు మ్యాచ్ గురువారం ఆరంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 291 పరుగులు చేసింది.

09/23/2016 - 04:53

భారత్ టెస్టు క్రికెట్ 500వ మ్యాచ్ మైలురాయిని చేరుకున్న సందర్భంగా కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో గురువారం జరిగిన సన్మాన కార్యక్రమానికి హాజరైన మాజీ కెప్టెన్లు. ఇంత వరకూ 499 టెస్టులు ఆడిన భారత్‌కు న్యూజిలాండ్‌తో ఆరంభమైన మ్యాచ్ 500వ టెస్టు.

09/23/2016 - 04:51

కాన్పూర్, సెప్టెంబర్ 22: ప్రస్తుతం న్యూజిలాండ్ సిరీస్‌కు ఎంపికైన 15 మంది సభ్యులతో కూడిన జట్టు మరో పదేళ్లు టెస్టు క్రికెట్ ఆడుతుందని భారత మాజీ కెప్టెన్ సచిన్ తెండూల్కర్ వ్యాఖ్యానించాడు. భారత్ 500వ టెస్టు మ్యాచ్ కివీస్‌తో గురువారం ఇక్కడి గ్రీన్ పార్క్ స్టేడియంలో మొదలైంది.

09/23/2016 - 04:47

టోక్యో, సెప్టెంబర్ 22: జపాన్ ఓపెన్ బాడ్మింటన్‌లో భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్స్ చేరాడు. అయితే, అతను ముందంజ వేయడానికి మన దేశానికే చెందిన అజయ్ జయరామ్‌తో తలపడ్డాడు. తొలి సెట్‌ను 21-16 తేడాతో గెల్చుకున్నాడు. అయితే, కండరాలు పట్టుకోవడంతో జయరామ్ ఆటను కొనసాగించలేకపోయాడు. దీనితో శ్రీకాంత్‌కు క్వార్టర్స్‌లో స్థానం లభించింది.

Pages