S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/22/2016 - 16:11

గుంటూరు : మునగోడు, అవిశాయపాలెంలో వరదలో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు రెండు హెలికాఫ్టర్లను ఏర్పాటు చేసినట్లు గుంటూరు కలెక్టర్‌ కాంతీలాల్‌ దండే చెప్పారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలను సురక్షితంగా బయటికి తీసుకొచ్చేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను కూడా రంగంలోకి దించినట్లు పేర్కొన్నారు. క్రోసూరు మండలంలోని వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీసుకొచ్చినట్లు వెల్లడించారు.

09/22/2016 - 16:08

గుంటూరు : పులిచింతల ప్రాజెక్టులో 10 గేట్లను 4మీటర్ల మేర ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే గురువారం తెలిపారు. వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటితో జలాశయానికి 4.6లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 2.5లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు చెప్పారు. ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామని వెల్లడించారు.

09/22/2016 - 15:39

హైదరాబాద్: పులిచింతల ప్రాజెక్టులో నీటిమట్టం భారీగా పెరిగిందని, నల్గొండ కలెక్టర్‌ను అప్రమత్తం చేయాలని ఏపీ మంత్రి దేవినేని ఉమ తెలంగాణ మంత్రి హరీశ్‌రావుతో గురువారం సంభాషించారు. వెంటనే హరీష్‌రావు నల్గొండ కలెక్టర్‌తో మాట్లాడి మేళ్లచెరువు మండలంలో ప్రజానీకాన్ని అప్రమత్తం చేయాలని ఆదేశించారు.

09/22/2016 - 15:31

నల్గొండ: నాగార్జునసాగర్ ఎర్త్ డ్యాం దగ్గర రోడ్డు పక్కన పాత వాటర్ ట్యాంక్ గురువారం కూలింది. వాటర్ ట్యాంక్ చాలా పెద్దది కావడం, రహదారిపై కూలడంతో హైదరాబాద్-మాచర్ల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నల్గొండ జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

09/22/2016 - 15:24

అమలాపురం: కుండపోత వర్షాల ప్రభావంతో కోనసీమ లోతట్టు ప్రాంతాలు గురువారం ముంపు బారిన పడ్డాయి. గోదావరి పాయలకు వరద ఉద్ధతి పెరగడంతో లంక గ్రామాలు జలమయమయ్యాయి. సముద్ర తీర, లోతట్టు ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

09/22/2016 - 15:21

హైదరాబాద్ : నగరంలో రహదారులను ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ అధికారులు పట్టించుకోవడంలేదని అరోపిస్తూ యూత్ కాంగ్రెస్ అధ్వర్యంలో గురువారం జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. నగరంలో భారీ వర్షం కురిసి రహదారులు లోతట్టు ప్రాంతాలు జలమయమైనా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఎక్కడా పరిశీలించలేదని యూత్‌ కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. కేటీఆర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

09/22/2016 - 15:15

గుంటూరు: నరసరావుపేట మండలం జొన్నలగడ్డ వాగు ఉద్ధతి పెరగడంతో కాజ్‌వే కొట్టుకుపోయింది. గుంటూరు-హైదరాబాద్‌ మార్గంలో గురువారం వాహన రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలు ఎటూ కదల్లేని పరిస్థితిలో రహదారిపైనే భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. అల్పపీడన ప్రభావంతో గుంటూరు జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలు మార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

09/22/2016 - 15:11

హైదరాబాద్‌: పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ గురువారం హైదరాబాద్‌లో ముంపునకు గురైన ప్రాంతాలలో పర్యటించారు. సహాయచర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వరదనీటిలో చిక్కుకున్న బాధితులతో మాట్లాడి బాధలు తెలుసుకున్నారు. ఉదయం బేగంపేటలో పర్యటించిన ఆయన మధ్యాహ్నం నిజాంపేటలోని భండారీ లేఅవుట్‌లో పర్యటించారు.

09/22/2016 - 14:23

హైదరాబాద్‌ : నగరంలో కుండపోత వర్షాల కారణంగా 15 ఏళ్ల తర్వాత లుంబినీ పార్కులోకి భారీగా వరదనీరు చేరింది. గురువారం పార్కులోకి వరదనీరు మళ్లీ వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. దీంతో సందర్శకుల రాకపోకలను నిలిపివేశారు.

09/22/2016 - 14:19

హైదరాబాద్‌ : భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం నగరంలో గురువారం హైఅలర్ట్ ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను, నాలాలకు ఇరువైపులా ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, పాత భవనాలను ఖాళీ చేయించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హుస్సేన్‌సాగర్‌లోకి భారీగా వరదనీరు పెరిగింది. లుంబిని పార్కులోకి వరదనీరు చేరింది.

Pages