S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/22/2016 - 11:51

హైదరాబాద్: హైదరాబాద్ లో గురువారం ఉదయం పలు కాలనీలు, బస్తీలు వరద నీటిలోనే ఉండిపోయాయి. అల్వాల్‌లో పలు కాలనీలు జలదిగ్బంధంలోనే ఉండిపోయాయి. వెస్ట్, నార్త్‌ జీహెచ్‌ఎంసీ జోనల్‌ ప్రాంతాల్లో పరిస్థితులు కొలిక్కిరాలేదు. చాలా అపార్ట్‌మెంట్‌లలో వాననీళ్లు నిలిచి ఉండటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. నిజాంపేటలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ లేక ప్రజల ఇబ్బందులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

09/22/2016 - 11:47

గుంటూరు: చిలకలూరిపేట మండలంలో గురువారం ఉదయం ముగ్గురు వ్యక్తులు వరద ప్రవాహానికి గల్లంతయ్యారు.
అమీన్‌సాహెబ్‌ పాలెం వద్ద చప్టాపై వరద నీరు ప్రవాహానికి అటుగా వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు.

09/22/2016 - 11:41

హైదరాబాద్‌: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా బలపడింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. గురు, శుక్రవారాల్లో సైతం రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. గురు, శుక్రవారాల్లో సైతం ఇంతకన్నా ఎక్కువగా కురిసే అవకాశాలున్నందున ప్రజలంతా అవసరమైతే తప్ప బయటికి రావద్దని అధికార వర్గాలు సూచించాయి.

09/22/2016 - 11:37

శ్రీనగర్‌: జమ్మూ కాశ్మీర్‌లోని బందిపోరా జిల్లా అర్గమ్‌ గ్రామంలో ఓ ఇంట్లో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారంతో తనిఖీలు చేపట్టిన భద్రతా దళాలపై గురువారం ఉదయం ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. భద్రతా సిబ్బంది కూడా ఎదురుకాల్పులకు దిగారు. ఓ ఉగ్రవాదిని హతమార్చినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.

09/22/2016 - 11:34

విజయవాడ : బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం అర్ధరాత్రి నుంచి విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. వరదనీరు రహదారులపై ప్రవహిస్తుండటంతో గుంటూరు జిల్లాలోని నరసరావుపేట, సత్తెనపల్లి ప్రాంతంలో రవాణా వ్యవస్థ స్తంభించింది. పిడుగురాళ్ల వద్ద రైలు పట్టాలపైకి వరద నీరు చేరడంతో పలుమ రైళ్ల రాకపోకలకు అంతరాయమేర్పడింది.

09/22/2016 - 09:02

అనంతపురం, సెప్టెంబర్ 21: మంత్రి పల్లె రఘునాథరెడ్డిని బుధవారం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వద్ద సిపిఎం కార్యకర్తలు ఘెరావ్ చేశారు. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగే సమావేశానికి హాజరయ్యేందుకు మంత్రి పల్లె ఆసుపత్రి ముందునుంచి వెళ్తుండగా సిపిఎం, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు.

09/22/2016 - 09:02

కర్నూలు, సెప్టెంబర్ 21: కర్నూలు జిల్లాలో ఉల్లి రైతుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. రైతులు అమ్మే ఉల్లి క్వింటాలు ధర కేవలం రూ.150 నుంచి 200 లోపు పలుకుతుండగా, అదే ఉల్లి ప్రజలు కొనాలంటే కిలోకు రూ.15 వరకు చెల్లించాల్సిన పరిస్థితి. కర్నూలు మార్కెట్ యార్డుకు భారీ ఎత్తున ఉల్లిని తీసుకువస్తున్న రైతులకు వ్యాపారులు కనీస ధర కూడా చెల్లించడం లేదు.

09/22/2016 - 09:01

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 21: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి జిల్లాలు బుధవారం తడిసి ముద్దయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో భారీగాను, మరికొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో చాలా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. పలు ప్రాంతాల్లో రహదార్లపై మోకాలి లోతు వర్షపు నీరు చేరింది.

09/22/2016 - 09:01

హైదరాబాద్, సెప్టెంబర్ 21: గ్రేటర్ ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపిన సర్కారుపై నగర ప్రజలు పెట్టుకున్న ఆశలు ఆవిరవుతున్నాయి. విశ్వనగరంపై భ్రమలు తొలగిపోతున్నాయి. రాజధాని నగరం నరకంగా మారుతోంది. చివరకు ‘మహా’ హామీలు గుప్పించిన మంత్రి కూడా రాజధాని అనుభవిస్తున్న నరకయాతనపై నిస్సహాయత వ్యక్తం చేస్తున్న దయనీయం. సిఎం కెసిఆర్ దత్తత తీసుకున్న పార్సీగుట్ట ప్రాంతం అల్లకల్లోలంగా మారింది.

09/22/2016 - 09:00

సంగారెడ్డి/ నిజామాబాద్/ వరంగల్/ మహబూబ్‌నగర్/ నల్లగొండ, సెప్టెంబర్ 21: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం రాత్రి నుండి బుధవారం ఉదయం వరకు ఎడతెరిపిలేని వర్షం కురిసింది. నల్లగొండ జిల్లాలో వర్షాల జోరుతో మూసీ నదితో పాటు వాగులు వంకలు పొంగగా చెరువులు, కుంటలు నిండి అలుగులు పోస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 59మండలాల్లో సగటు 40.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Pages