S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/01/2016 - 21:20

పద్మపురాణాదులు పదునెనిమిది- అవి 1.బ్రహ్మపురాణము 2.పద్మపురాణము 3.విష్ణుపురాణము 4.శివపురాణము 5.్భగవత పురాణము 6.్భవిష్య పురాణము 7.నారద పురాణము 8.మార్కండేయ పురాణము 9.అగ్నిపురాణము 10.బ్రహ్మవైవర్త పురాణము 11.లింగపురాణము 12.వారాహ పురాణము 13.స్కాంద పురాణము 14.వామన పురాణము 15.కూర్మ పురాణము 16.మత్స్యపురాణము 17.గరుడ పురాణము 18.బ్రహ్మాండ పురాణము- వీటికే అష్టాదశ పురాణాలు అని పేరు.

09/01/2016 - 21:17

వేద సంస్కృతిలో హృదయంలో భక్తిని ప్రోది చేయడానికి వేదసూక్త పఠనాన్ని విశేషంగా చేయాలని మహర్షులు ప్రతిపాదించారు. పురుషసూక్తం, శ్రీసూక్తం వేదసూక్తాల్లో సుప్రసిద్ధమైనవి. ఆర్షధర్మాన్ని ప్రతిష్ఠించడానికి, వేద సంస్కృతిని సంరక్షించడానికి, జ్ఞాన సముపార్జనకి, సకల ఐశ్వర్యసిద్ధికి వేదసూక్త పఠనం తప్పనిసరిగా చేయాలి.

,
09/01/2016 - 21:11

బాలకృష్ణ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చారిత్రాత్మక చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో జరుగుతోంది. రెండవ శతాబ్దానికి చెందిన రాజులలో గౌతమీపుత్ర శాతకర్ణి అగ్రగణ్యుడు. ఆయన జీవిత కథను ఆధారంగా ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపొందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ మధ్యప్రదేశ్‌లో శరవేగంగా సాగుతోంది.

09/01/2016 - 21:08

పవన్‌కళ్యాణ్ సినిమా అంటే ప్రేక్షకులకు అదోక్రేజ్. పవన్ కూడా సాధ్యమైనంత వరకూ వైవిధ్యం ఉండేలా సినిమాను ఎంపిక చేసుకుంటారు. అందులోభాగంగానే పవన్ నటించే తదుపరి సినిమాకు వెరైటీ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. పవన్‌కల్యాణ్ తదుపరి సినిమా పేరు ‘కాటమరాయుడు’ అని ఖరారు చేశారు. డాలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పూర్తిగా ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ప్రేమకథ.

09/01/2016 - 21:06

చిరంజీవి 151వ సినిమా దర్శకుడు బోయపాటేనా? అంటే ఔననే అంటున్నాయి సినీవర్గాలు. ‘సరైనోడు’తో మాస్ హిట్ కొట్టాడు బోయపాటి శ్రీను. వందకోట్లకిపైగా వసూళ్లు సాధించింది ఆ చిత్రం. ఆ సినిమాకి సంబంధించిన ఓ వేడుకలో స్వయంగా చిరంజీవి మాట్లాడుతూ తాను బోయపాటితో సినిమా చేయడానికి రెడీ అని గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేడు. అంతకంటే బంపర్ ఆఫర్ బోయపాటికి ఇంకేముంటుంది? ఆ మాటతో బోయపాటి ప్లానింగ్ అంతా మారిపోయిందని సమాచారం.

09/01/2016 - 21:05

ధనుష్ కథానాయకుడిగా, కీర్తి సురేష్ కథానాయికగా రూపొందిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘రైల్’. ఆదిత్య మూవీ కార్పొరేషన్, శ్రీ పరమేశ్వరి రగ్న పిక్చర్స్ పతాకాలపై ప్రభు సాల్మన్ దర్శకత్వంలో ఆదిరెడ్డి, ఆదిత్యరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 16న విడుదల కాబోతోంది.

09/01/2016 - 21:02

గాదె తరుణ్, తేజ్, భావన ప్రధాన తారాగణంగా సిక్స్ ఫ్రెండ్స్ క్రియేషన్స్ పతాకంపై శ్రీరామచంద్ర గొర్రెపాటి సమర్పణలో డా కృష్ణమోహన్ రూపొందిస్తున్న చిత్రం ‘కుర్ర తుఫాను’. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- మంచి ఔట్‌పుట్ కోసమే సినిమా షూటింగ్ ఆలస్యమైనా రాజీపడకుండా చేస్తున్నామని, ఈ నెలతో షూటింగ్ పూర్తిచేస్తామని అన్నారు.

09/01/2016 - 21:01

తమిళంలో సంచలన విజయం సాధించిన ‘తరకప్పు’ చిత్రాన్ని తెలుగులో ‘ఈ చరిత్ర ఇంకెన్నాళ్లు’గా అనువదిస్తున్నారు. శక్తివేల్ వాసు, సముద్రఖని ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రాన్ని వి.జె.వై.ఎస్.ఆర్ ఆర్ట్స్ పతాకంపై రవి దర్శకత్వంలో వై.శేషిరెడ్డి అందిస్తున్నారు.

09/01/2016 - 20:59

గ్లామర్ భామ నయనతార ఇప్పుడు కోలీవుడ్‌లో మంచి జోరుమీదుంది. ఇప్పటికే గ్లామర్‌తో ఆకట్టుకుంటూ.. అటు స్టార్ హీరోల సరసన, ఇటు యువ హీరోల సరసన ఛాన్సులు కొట్టేస్తూ జోరుమీదుంది. ఇటీవలే తెలుగులో వెంకటేష్ సరసన ‘బాబు బంగారం’ చిత్రంలో నటించిన ఈ భామ ఇప్పుడు సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేస్తోందని తెలిసింది. ఇప్పటికే ఆమె ఎఐఎడిఎంకె పార్టీతో మంచి సంబంధాలు కొనసాగిస్తోంది.

09/01/2016 - 20:58

‘హాయ్’ అంటూ పలకరించి ఆ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అందాల భామ నిఖిత ఆ తర్వాత డజనుకు పైగా తెలుగు సినిమాలతోపాటు.. అంతకుమించిన సంఖ్యలోనే కన్నడ..తమిళ్.. మలయాళ సినిమాల్లో నటించింది. చాలాకాలంగా సౌత్‌లో హీరోయిన్‌గా కెరీర్ కంటిన్యూ చేస్తున్న ఈ భామకు ఇప్పటికీ అవకాశాలు వస్తూనే ఉన్నాయ్ కానీ.. అవేవీ కెరీర్‌కి బ్రేక్‌ఇచ్చే రేంజ్‌వి కావు. అందుకే తన కెరీర్‌కి తనే టర్నింగ్ ఇచ్చుకోవాలని డిసైడ్ అయిపోయింది నిఖిత.

Pages