S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/30/2016 - 07:03

వీరఘట్టం, ఆగస్టు 29: సైఫన్ బేరల్ పనులు పది రోజుల్లో పూర్తి చేసి సాగునీరు అందిస్తామని బొబ్బిలి జలవనరులశాఖ ఎస్‌ఇ ఎం.వి. ఎస్.మూర్తి తెలిపారు. సోమవారం సైఫన్ వద్ద తనను కలిసిన విలేఖర్లతో మాట్లాడారు. వాతావరణం అనుకూలంగా లేనందువల్ల పనులకు ఆటంకం ఏర్పడుతుందన్నారు. ప్రస్తుతం ఒట్టిగెడ్డ నీరు తగ్గడం వల్ల నీటికి అడ్డంగా బస్తాలు వేసి నీరు మళ్లించామన్నారు.

08/30/2016 - 07:00

విశాఖపట్నం, ఆగస్టు 29: పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరితేనే సంక్షేమ, అభివృద్ధి పథకాలు సవ్యంగా కొనసాగుతాయని ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. వాణిజ్య పన్నుల శాఖ విశాఖ డివిజన్ కార్యాలయం భవనాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఆర్థిక ఒడిడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామన్నారు.

08/30/2016 - 07:00

విశాఖపట్నం, ఆగస్టు 29 : విపత్తుల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు తూర్పు నౌకాదళాధికారి నిర్వహిస్తున్న మూడు రోజుల ప్రకంపన సమావేశాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే నౌకాదళం పూర్తి చేసింది. ఈ సమావేశానికి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఠక్కర్ హాజరుకానున్నారు. దీనికి తోడు వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల కూడా హాజరు కానున్నారు.

08/30/2016 - 07:00

విశాఖపట్నం (కల్చరల్), ఆగస్టు 29 : తెలుగు వ్యవహార భాషా ఉద్యమ స్ఫూర్తికి ఆద్యుడైన గిడుగు రామ్మూర్తి జయంతి వేడుకలు సోమవారం ఉద యం జివి ఎంసి కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద వినూత్నంగా ప్రారంభమయ్యాయి. పరవస్తు పద్యపీఠం వ్యవస్థాపకుడు పరవస్తు ఫణిశయనసూరి నేతృత్వంలో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు దండు ఏర్పడి తెలుగు దీక్షకు శ్రీకారం చుట్టింది.

08/30/2016 - 06:59

విశాఖపట్నం, ఆగస్టు 29: జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయం క్రీడా విభాగం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆర్కేబీచ్‌లోని వైఎంసిఎ వద్ద నుంచి ఎయులోని ధ్యాన్‌చంద్ విగ్రహం వరకూ వివిధ క్రీడా సంఘాలు, క్రీడాకారులు ర్యాలీ నిర్వహించారు. ఎయు వీసీ ఆచార్య నాగేశ్వరరావు జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ధ్యాన్‌చంద్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

08/30/2016 - 06:59

అనకాపల్లి(నెహ్రూచౌక్), ఆగస్టు 29: ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతీ ఒక్క రూ తప్పనిసరిగా హెల్మెట్‌ను దరించాలని తద్వారా ప్రమాదాల ను నివారించవచ్చునని రూరల్ జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ అన్నారు.సోమవారం పట్టణ పోలీస్ స్టేషన్ ను ఆయన సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భం గా స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ వాహనాలు కొనుగోలు చేసే షోరూముల్లో బైక్‌తోపాటు హెల్మెట్‌ను కూడా ఇవ్వాలని ఆదేశించామన్నారు.

08/30/2016 - 06:58

విశాఖపట్నం, ఆగస్టు 29: విశాఖలో ఎపి స్టడీసర్కిల్ కేంద్రాన్ని పున:ప్రారంభించాలని డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రతినిధులు డిమాండ్ చేశారు. స్టడీసర్కిల్‌ను పునరుద్ధరించడానికి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ వివిధ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.

08/30/2016 - 06:58

విశాఖపట్నం(క్రైం), ఆగస్టు 29:అనుమతి లేకుండా బాణసంచా తయారీ, నిల్వ ఉంచడం చట్టరీత్యా నేరమని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు రోజుల క్రితం ఆనందపురం మండలం, గిడిజాల పంచాయితీలోని వేమగొట్టిపాలెంలో జరిగిన సంఘటనలో భార్యభర్తలిద్దరు మృత్యువాత పడగా, వారి మూడేళ్ల చిన్నారి ఆనాథగా మిగిలిన విషయం తెలిసిందే.

08/30/2016 - 06:57

రోలుగుంట, ఆగస్టు 29: మండల కేంద్రం రోలుగుంటలో సోమవారం ఉదయం నుండి రాత్రి వరకు పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. ఎదురుగా వస్తున్న వారందరినీ అడ్డు, అదుపు లేకుండా కరుచుకుంటూ సుమారు 25 మందిని గాయపరిచింది. గ్రామంలోని శెట్టిబలిజవీధికి చెందిన యువకులతో పాటు గ్రామస్థులంతా కర్రలు పట్టుకుని పలు వీధుల మీదుగా తిరుగుతూ పిచ్చికుక్క కోసం గాలిస్తున్నారు.

08/30/2016 - 06:56

విజయనగరం, ఆగస్టు 29: ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలతోపాటు విద్య, వైద్య శాఖలపై ప్రత్యేకదృష్టి పెడతామని జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ తెలిపారు. జిల్లాలో అక్షరాస్యత తక్కువగా ఉందని, దీనివల్ల ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో సరైన అవగాహన లేక వాటిని వినియోగించుకోలేక పోతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Pages