S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/22/2020 - 04:48

న్యూఢిల్లీ, మార్చి 21: కరోనా వైరస్ మహమ్మారి బారిన పడొద్దని, ఆ లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా ప్రజలు పెడచెవిన పెట్టడం ఆందోళన కలిగిస్తోంది. దక్షిణ మధ్య రైల్వేలో శనివారం నాడొక ఘటన తీవ్ర కలకలం రేపింది. దేశ రాజధాని ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో క్వారంటైన్ సీల్ ఉన్న ఓ దంపతులు ప్రయాణిస్తున్నారు.

03/22/2020 - 04:47

న్యూఢిల్లీ, మార్చి 21: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సెంటర్ ఫర్ సెల్యుల్లార్ అండ్ మాలిక్యులార్ బయోలాజీ (సీసీఎంబీ)లో కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెంలగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు చేసిన విజప్తిని ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదించారు. సీసీఎంబీలో కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించవచ్చునని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి వర్తమానం పంపించింది.

03/22/2020 - 04:46

న్యూఢిల్లీ, మార్చి 21: దేశంలో కరోనా కేసులు రోజు రోజుకూ తీవ్రం కావడం తో కేంద్ర ఆరోగ్య శాఖ విస్తృత స్థాయి లో కీలక వైద్య చికిత్స చర్యలను చేపట్టింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివా రం దాదాపు వెయ్యి ప్రాంతాల్లో ఈ శిక్ష ణ కార్యక్రమాన్ని నిర్వహించింది. వైరస్ కేసులు తీవ్రమయ్యే పక్షంలో అత్యవసరంగా ఏ విధంగా స్పందించాలన్న దానిపై ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణను అందించారు.

03/22/2020 - 04:45

న్యూఢిల్లీ, మార్చి 21: దేశంలో ఎలక్ట్రానిక్ పరిశ్రమల ఆభివృద్ది, భారీ మందుల తయారీ పరిశ్రమల పార్కుల అభివృద్ధికి ఉద్దేశించిన పలు కీలక నిర్ణయాలను కేంద్ర మంత్రివర్గం తీసుకున్నది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో అనేక నిర్ణయాలు తీసుకున్నది. దేశంలో ఎలక్ట్రానిక్ విడి భాగాలు, సెమికండక్టర్ల ఉత్పత్తిని పెంచేందుకు పలు ప్రోత్సాహకాలను మోదీ ప్రభుత్వం ప్రకటించింది.

03/22/2020 - 04:44

లక్నో, మార్చి 21: కరోనా వైరస్ మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని సుమారు 35 లక్షల మంది కార్మికులకు ఒక్కొక్కరికి రూ. 1,000 చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. అలాగే 1.65 కోట్ల మంది నిర్మాణ రంగ కార్మికులకు ఒక నెల కోసం రేషన్‌ను ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు తెలిపింది.

03/22/2020 - 04:44

న్యూఢిల్లీ, మార్చి 21: ప్రాణాంతక కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలో ఆదివారం ప్రజలు ఆరోగ్య సంరక్షకులకు, అత్యవసర పరిస్థితుల్లో స్పందిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలుపనుండగా, అదే సమయంలో దేశ రాజధాని ప్రాంతంలోని అనేక మంది కొత్త కోవిడ్-19 మహమ్మారి కారణంగా జాతీయ పౌర రిజిస్టరు (ఎన్‌పీఆర్)ను తాజాపరచాలనే తన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ తమ ఇళ్లలో నిలబడి చప్పట్లు కొట్

03/22/2020 - 04:40

హైదరాబాద్, మార్చి 21: ఏపీ రాష్ట్ర ఎన్నికల అధికారి రమేష్‌కుమార్ నిజంగా కరోనా వైరస్ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని స్థానిక ఎన్నికలను వాయిదా వేసి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం స్వాగతించేదని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేందర్‌నాథ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

03/22/2020 - 04:39

హైదరాబాద్, మార్చి 21: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ వ్యాప్తిని నివారించే ప్రక్రీయలో ముందు జాగ్రత్త చర్యగా మార్చి 20వ తేదీ నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు రోజువారి ఫిర్యాదు కేసుల విచారణ వాయిదా వేసింది.

03/22/2020 - 04:39

హైదరాబాద్, మార్చి 21: లండన్‌లో చిక్కుకున్న విద్యార్థులను వెంటనే ఇండియాకు రప్పిచాలని, ఈ విషయమై రాష్ట్రప్రభుత్వం చొరవ చూపాలని తెలంగాణ ఎన్నారై ఫోరం డిమాండ్ చేసింది. విద్యార్థులకు అండగా ఉంటామని ఫోరం పేర్కొంది. ఎమిరేట్స్, ఇతైద్ ఎయిర్ లైన్స్‌లవ నిర్లక్ష్యం, భారత్ విమాన రాకపోకల రద్దు కారణంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు సంబంధించి 45 మంది విద్యార్థులు లండన్‌లో చిక్కుకున్నారన్నారు.

03/22/2020 - 04:38

హైదరాబాద్, మార్చి 21: దేశ వ్యాప్తంగా జరిగే జనగణనలో బీసీ కులాల లెక్కలు తీయాల్సిందేనని డిమాండ్ చేస్తూ ఈనెల 23న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వేలాది మందితో జరుగబోయే బీసీల జనగణన గర్జన మహాసభను కరోన వైరస్ వ్యాప్తి దృష్ట్యా తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.

Pages