S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/29/2016 - 04:13

న్యూఢిల్లీ, ఆగస్టు 28: దేశీయ స్టాక్ మార్కెట్లను ఈ వారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చైర్‌పర్సన్ జనెట్ యెల్లెన్ ప్రసంగం ప్రభావితం చేయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత వారం యెల్లెన్ ద్రవ్యసమీక్ష సందర్భంగా మాట్లాడగా, అప్పటికే దేశీయ స్టాక్ మార్కెట్లు ముగిశాయి. దీంతో సోమవారం దీనిపై సూచీలు స్పందించే వీలుందని పేర్కొంటున్నారు.

08/29/2016 - 22:21

జగ్గయ్యపేట రూరల్, ఆగస్టు 28: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాల సమీపంలోని కెసిపి సిమెంట్స్ కర్మాగారంలో రెండో ప్లాంట్ నిర్మాణానికి ఆ సంస్థ జెఎండి వెలగపూడి ఇందిరాదత్తు ఆదివారం భూమిపూజ, శంకుస్థాపన చేశారు. ప్రస్తుత వార్షిక సామర్థ్యం 1.86 మిలియన్ టన్నులని, దాన్ని రూ. 400 కోట్ల వ్యయంతో రెట్టింపు చేస్తున్నామన్నారు. 2017 డిసెంబర్ నాటికి ఈ ప్లాంట్‌ను పూర్తిచేస్తామని, మరో రూ.

08/29/2016 - 04:09

హైదరాబాద్, ఆగస్టు 28: ఇంజినీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ డాటా ఎనలిటిక్స్, నెట్‌వర్క్స్‌లో సైయెంట్ సంస్థను అగ్రగామిగా తీర్చిదిద్దుతామని ఆ సంస్థ వ్యవస్ధాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బివి మోహన్ రెడ్డి అన్నారు. ఈ సంస్థ 25వ వార్షికోత్సవ వేడుకలు ఇక్కడ జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1991లో సైయెంట్ ప్రారంభమైందన్నారు. 3 వేల కోట్ల రూపాయల ఆదాయం ఆర్జిస్తున్నట్లు చెప్పారు.

08/29/2016 - 04:07

న్యూఢిల్లీ, ఆగస్టు 28: విదేశీ మదుపరులు ఈ నెలలో దేశీయ స్టాక్ మార్కెట్లలోకి 8,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను తీసుకొచ్చారు.

08/29/2016 - 04:05

న్యూఢిల్లీ, ఆగస్టు 28: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ వ్యవహారంలో విచారణను మరింత విస్తృతం చేస్తోంది వైట్-కాలర్ నేరాల దర్యాప్తు సంస్థ ఎస్‌ఎఫ్‌ఐఒ. ఇందులో భాగంగానే పలు బ్యాంకుల మాజీ అధిపతులను విచారిస్తోంది. ఇందులో ప్రైవేట్‌రంగ బ్యాంకులతోపాటు, ప్రభుత్వరంగ బ్యాంకుల చీఫ్‌లున్నారు.

08/29/2016 - 04:05

వాషింగ్టన్/ముంబయి, ఆగస్టు 28: సంస్కరణలతో వాణిజ్యం బలోపేతమవుతుందని, వ్యాపార నిర్వహణ సులభతరమవుతుందని అగ్రరాజ్యం అమెరికా అభిప్రాయపడింది. భారత్‌తో విదేశాలకున్న ఆర్థిక సంబంధాలు కూడా బలపడతాయంది. అమెరికా వాణిజ్య మంత్రి పెన్ని రిట్జ్‌కర్ సోమవారం నుంచి మూడు రోజులపాటు భారత్‌లో పర్యిటించనున్న క్రమంలో ఆదివారం అమెరికా పైవిధంగా స్పందించింది.

08/29/2016 - 04:04

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు చేపడుతున్నందుకు నిరసనగా వచ్చే నెల 2న సమ్మె నిర్వహించనున్నట్లు రాష్ట్ర పరిశ్రమల ఉద్యోగుల, కార్మికుల సంఘం అధ్యక్షుడు బి మారుతీ రావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో ప్రభుత్వ వాటాలు అమ్మరాదని, కార్మిక చట్టాల సవరణలను నిలిపివేయాలని, కనీస వేతనం నెలకు రూ.

08/29/2016 - 04:03

నర్సీపట్నం, ఆగస్టు 28: కార్మిక హక్కులను నరేంద్ర మోదీ ప్రభుత్వం హరిస్తోందని కేరళ మత్స్య, జీడిపిక్కల పరిశ్రమల శాఖ మంత్రి మెర్సి కుట్టిఅమ్మ ధ్వజమెత్తారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో సిఐటియు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జీడిపిక్కల కార్మికుల సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

08/29/2016 - 03:17

బెంగళూరు, ఆగస్టు 28: రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా చదవాలని, ప్రభుత్వ, పరిపాలనకు సంబంధించిన అంశాల్లో భాగస్వాములై సమాజంలో కోరుకున్న మార్పును తీసుకురావాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ న్యాయ విద్యార్థులకు సూచించారు. ఆదివారం బెంగళూరులో ఆయన ఎన్‌ఎల్‌ఎస్‌ఐయు (నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్శిటీ) 24వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ ఈ విజ్ఞప్తి చేశారు.

08/29/2016 - 03:15

ఓ అధికారికి లంచం ఇచ్చేందుకు ఓ పిల్లవాడు బిచ్చమెత్తుకోవలసి వచ్చింది. తండ్రి చనిపోయినందుకు ప్రభుత్వం ఇచ్చిన పరిహారం సాధించుకునేందుకు అధికారి లంచం అడగటంతో ఆ పిల్లవాడు సదరు లంచం మొత్తాన్ని సంపాదించేందుకు బిచ్చం ఎత్తుకోవలసి వచ్చింది. తమిళనాడులోని విల్లుపురం జిల్లా కున్నత్తూర్‌లో అజిత్ అనే పదిహేనేళ్ల పిల్లవాడి తండ్రి నిరుడు చనిపోయాడు.

Pages