S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/07/2016 - 02:08

హైదరాబాద్, ఆగస్టు 6: దేశంలోని వివిధ యూనివర్శిటీలకు చెందిన నకిలీ ఎడ్యుకేషనల్ సర్ట్ఫికెట్లు తయారుచేసి అమ్ముతున్న ముఠాకు చెందిన ముగ్గురు సభ్యులను హైదరాబాద్ ఈస్ట్‌జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 24 డిగ్రీ, బి టెక్, ఎంఎస్సీ సర్ట్ఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు.

08/07/2016 - 01:29

న్యూఢిల్లీ, ఆగస్టు 6: స్వచ్ఛ్భారత్ మిషన్ ప్రజల ఉద్యమంగా మారాలని ప్రభుత్వ కార్యక్రమంగా దాన్ని చూడకూడదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 500 మున్సిపాలిటీల్లో ఈ ఏడాది నిర్వహించనున్న స్వచ్ఛ్భారత్ సర్వేక్షణ్-2017ను మంత్రి ఆదివారం ఇక్కడ ప్రారంభించారు.

08/07/2016 - 01:27

న్యూఢిల్లీ, ఆగస్టు 6: పార్లమెంటులో ఎస్‌సి వర్గీకరణ బిల్లును ప్రవేశపెడితే కాంగ్రెస్ మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ వెల్లడించారు. ఎస్‌సి వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ జంతర్‌మంతర్ వద్ద నిర్వహిస్తున్న దీక్షా శిబిరానికి దిగ్విజయ్ సింగ్ శనివారం వచ్చి తమ సంఘీభావం ప్రకటించారు.

08/07/2016 - 01:22

రోవన్, ఆగస్టు 6: ఫ్రాన్స్‌లోని రోవన్ నగరంలో ఓ బార్‌లో బర్త్‌డే పార్టీ పెను విషాదాన్ని మిగిల్చింది. బర్త్‌డే పార్టీలో కేక్ వద్ద వెలిగించిన కొవ్వొత్తులు పడి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పక్కనే ఉన్న మద్యం బాటిళ్లపై పడి మంటలు చెలరేగాయి. అంతే అక్కడున్న డెకరేషన్‌కు మంటలు వ్యాపించి 13 మంది దుర్మరణం చెందారు. అగ్ని ప్రమాదంలో చనిపోయినవారంతా 18-25 మధ్య వయస్కులే.

08/07/2016 - 01:21

మచిలీపట్నం, ఆగస్టు 6: కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని జిల్లా కేంద్రం మచిలీపట్నంలో చేపట్టిన సుందరీకరణ పనులు పాలకుల తీరును వెక్కిరిస్తున్నాయి. కోట్లాది రూపాయలతో చేపట్టిన పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయ్యాయి. మరో వారం రోజుల్లో పుష్కరాలు ప్రారంభం కానున్నాయి.

08/07/2016 - 01:20

న్యూయార్క్, ఆగస్టు 6: ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా ఈసారి మహిళను ఎన్నుకోవాలన్న సభ్య దేశాల ఆశలు క్రమంగా ఆవిరైపోతున్నాయి. ఈ పదవికోసం పోటీపడుతున్న 11 అభ్యర్థులకు శుక్రవారం భద్రతా మండలి నిర్వహించిన రెండో విడత సాధారణ ఎన్నికల్లో పోర్చుగల్ మాజీ ప్రధాన మంత్రి అంటానియో గటెర్రెస్ మరోసారి తన ఆధిక్యతను చాటుకున్నారు.

08/07/2016 - 01:19

విజయవాడ, ఆగస్టు 6: కృష్ణా పుష్కరాలలో స్నాన ఘాట్లకు ప్రతి మూడు నిమిషాలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని యాత్రికులకు అందుబాటులో ఉంచుతున్నామని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు అన్నారు. మూడు వేల ఆర్టీసీ బస్సులను సిద్ధం చేస్తున్నామని, గుంటూరుకు అదనంగా మరో 500 బస్సులు కేటాయించగలమని తెలిపారు. ఈ 12 రోజుల్లో 25వేల మంది అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తిస్తారని అన్నారు.

08/07/2016 - 01:18

విజయవాడ, ఆగస్టు 6: సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షలు -2016 విజయవాడ నగరంలోని 28 కేంద్రాల ద్వారా 14,647 మంది అభ్యర్థులు హాజరవుతున్నారని జాయింట్ కలెక్టర్ గంథం చంద్రుడు తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ముందుగానే వారికి కేటాయించిన కేంద్రాలకు చేరాలని ప్రత్యేక పరిస్థితులలో 10 నిమిషాల వరకు సమయం ఇవ్వటం ద్వారా ఆయా కేంద్రాల నిర్వాహకులకు అధికారాలు ఇవ్వటం జరిగిందని ఆయన తెలిపారు.

08/07/2016 - 01:17

గాంధీనగర్, ఆగస్టు 6: గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా ఎంపికయిన విజయ్ రూపాని శనివారం రాష్ట్ర గవర్నర్ ఓపి కోహ్లీని కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు. రూపాని ఆదివారం మధ్యాహ్నం 12.40 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దినేశ్ శర్మ ప్రకటించారు.

08/07/2016 - 01:17

విజయవాడ (కార్పొరేషన్), ఆగస్టు 6: రాష్ట్ర చరిత్రలోనే కాక పుష్కర చరిత్రలోనే చిరస్థాయిగా నిలచిపోయే కృష్ణా పుష్కరాలలో ప్రజాప్రతినిధులు కూడా భాగస్వాములై పుష్కర భక్తుల సేవల్లో తరించడమే కాకుండా పుష్కర పనులపై నిరంతర పర్యవేక్షణ చేసి పుష్కరాలను విజయవంతానికి కృషి చేయాలని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని పిలుపునిచ్చారు.

Pages