S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/07/2016 - 01:15

విజయవాడ, ఆగస్టు 6: పుష్కరాల సందర్భంలో అన్ని టెలిఫోన్ సర్వీసు ప్రొవైడర్లు ఇంటరాసర్కిల్ రోమింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ బాబు ఎ కోరారు. స్థానిక కలెక్టర్ ఛాంబరులో బియస్‌ఎన్‌ఎల్, ఎయిర్‌టెల్, రిలయన్స్, టాటా డొకొమో తదితర కంపెనీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

08/07/2016 - 01:15

గౌహతి, ఆగస్టు 6: అస్సాంలోని ఒక దేవాలయ ప్రవేశం విషయంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) పరువుకు నష్టం కలిగించే రీతిలో వ్యాఖ్యలు చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సెప్టెంబర్ 21న కోర్టులో హాజరుకావాలని ఒక మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది.

08/07/2016 - 01:14

విజయవాడ, ఆగస్టు 6: తాము అధికారంలోకి వస్తే సంవత్సరానికి రెండు లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తాం, ఇల్లు లేని పేదవాడు అంటూ ఉండటానికి వీల్లేదంటూ ఎన్నికల్లో ప్రచారం చేసి, మేనిఫెస్టోలో పొందుపర్చిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడచినా ఇంతవరకు ఒక ఇల్లు కూడా ఇచ్చిన దాఖలాలు లేవని పలువురు వక్తలు ధ్వజమెత్తారు.

08/07/2016 - 01:13

పవిత్ర కృష్ణానది పుష్కరాల సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో విజయవాడలోని పిడబ్ల్యుడి మైదానంలో స్వామి వారి నమూనా ఆలయాన్ని ఈ నెల 7వ తేదీ ఆదివారం ప్రారంభించనున్నారు. ఉదయం 7.30 నుండి 9 గంటల వరకు మహాసంప్రోక్షణను శాస్త్రోక్తంగా నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం కృష్ణానది జలాలను తీసుకువచ్చి మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించనున్నారు.

08/07/2016 - 01:11

విజయవాడ, ఆగస్టు 6: మూడున్నర కోట్ల మందిని దృష్టిలో ఉంచుకుని పుష్కరాల ఏర్పాట్లను నగరంలో చేసినట్లు కలెక్టర్ బాబు ఎ చెప్పారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మీడియాను ఉద్దేశించి పుష్కర యాత్రికులకు నగరంలో ఏర్పాటు చేసిన సౌకర్యాల గురించి వివరించటం జరిగింది.

08/07/2016 - 01:09

బెంజిసర్కిల్, ఆగస్టు 6: ఏపి ప్రజలు కాంక్షిస్తున్న ప్రత్యేక హోదాను కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వ తప్పకుండా ఇస్తుందని బలంగా నమ్ముతున్నట్లు కేంద్ర ఐటి అంట్ ఇన్‌ఫర్‌మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి సుజనా చౌదరి స్పష్టం చేశారు. అయితే కొన్ని సందర్భాల్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యల కారణంగానే కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందన్నారు.

08/07/2016 - 01:08

న్యూఢిల్లీ, ఆగస్టు 6: అనారోగ్యంతో వారం రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది. మూడు రోజుల క్రితం ఎడమ భుజానికి ఆపరేషన్ చేసిన తర్వాత శనివారం ఆమె కొంతసేపు నడిచారని, కొన్ని ఎక్సర్‌సైజులు కూడా చేశారని ఇక్కడి సర్ గంగారామ్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

08/07/2016 - 01:08

శ్రీనగర్, ఆగస్టు 6: జమ్మూ, కాశ్మీర్‌లో శనివారం కూడా ఆందోళనలు కొనసాగాయి. అనంత్‌నాగ్, హోపియాన్ జిల్లాల్లో ఆందోళనకారులకు, భద్రతా దళాలకు మధ్య ఘర్షణలు చెలరేగాయి. మరోవైపు కాశ్మీర్ లోయలోని చాలా ప్రాంతాల్లో వరసగా 29వ రోజు కూడా కర్ఫ్యూ కొనసాగడంతో జన జీవితం స్తంభించిపోయింది.

08/07/2016 - 01:07

జోహాన్స్‌బర్గ్, ఆగస్టు 6: దక్షిణాఫ్రికాలోని అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎఎన్‌సి)కి ఎన్నికల రీత్యా గతంలో ఎన్నడూ లేని రీతిలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మైనారిటీలయిన శే్వతజాతీయుల పాలనకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం సలిపి 1994 ఎన్నికల్లో విస్త్రృత ప్రజాబాహుళ్యం మద్దతుతో అధికారంలోకి వచ్చిన ఎఎన్‌సికి ఈ స్థాయిలో ఎదురుదెబ్బ తగలడం ఇదే మొదటిసారి.

08/07/2016 - 01:07

చండీగఢ్, ఆగస్టు 6: ప్రజలకు చౌక ధరల్లో ఔషధాలను అందించేందుకు ప్రభుత్వం ఈ సంవత్సరం 300 అమృత్ ఔట్‌లెట్లను, మూడు వేల జన్ ఔషధి స్టోర్‌లను ఏర్పాటు చేస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి జెపి నడ్డా తెలిపారు. శనివారం ఇక్కడి పిజిఐఎంఇఆర్ వద్ద రెండు అమృత్ ఔట్‌లెట్లను ఆయన ప్రారంభించారు.

Pages