S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/06/2016 - 02:02

నేరేడ్‌మెట్, ఆగస్టు 5: అనుమానాస్పద స్థితిలో ఇద్దరు యువతులు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నేరేడ్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సిఐ జగదీష్‌చంద్ర తెలిపిన వివరాల ప్రకారం నేరేడ్‌మెట్ పరిధిలోని రామకృష్ణపురం చెరువులో గుర్తుతెలియని రెండు మృతదేహాలు ఉన్నాయని స్థానికులు నేరేడ్‌మెట్ పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తిశారు.

08/06/2016 - 02:01

రాజేంద్రనగర్, ఆగస్టు 5: లక్కీ నెంబర్, సెంటిమెంట్ నెంబర్ మోజుతో వాహనాల ఫ్యాన్సీ నెంబర్లకు మంచి డిమాండ్ పెరిగింది. నెంబర్ రిజిస్ట్రేషన్ వేలం పాటలో టిఎస్ 07 ఎఫ్‌సి 6666 నెంబరుకు పోటీ పడి వేలంపాటలో రూ.2,10,126 లకు ఎంఎస్ అబూ కన్‌స్ట్రక్షన్ కో దక్కించుకుంది.

08/06/2016 - 02:00

హైదరాబాద్, ఆగస్టు 5: మహానగరంలో రోడ్లు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. బండి బయటకు తీయాలంటేనే నగరవాసులు బెంబేలెత్తుతున్నారు. నగరంలో ఇటీల తరుచూ కురిసిన వర్షాలతో రోడ్లన్నీ గుంతలమయంగా మారిన సంగతి తెలిసిందే! రోడ్డు డాక్టర్ అంటూ ప్రత్యేక బృందాలను వినియోగిస్తూ ఎప్పటికపుడు గుంతలను పూడ్చుతున్నామని జిహెచ్‌ఎంసి అధికారులు ప్రకటిస్తున్నా, క్షేత్ర స్థాయిలో రోడ్లపై గుంతలు మాత్రం అలాగే దర్శనమిస్తున్నాయి.

08/06/2016 - 02:00

హైదరాబాద్, ఆగస్టు 5: నగరంలో ఇటీవల నిర్మాణంలో ఉన్న ఫిల్మ్‌క్లబ్ పోర్టికో, కూకట్‌పల్లిలో ఓ కమాన్ కూలి అయిదుగురు దుర్మరణం చెందిన సంఘటన నేపథ్యంలో నిర్మాణ నిబంధనలు, నిర్మాణంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలు, విధి విధానాలపై నగరవాసులకు నేటి నుంచి అవగాహన శిబిరాలు నిర్వహించనున్నట్లు జిహెచ్‌ఎంసి అధికారులు తెలిపారు.

08/06/2016 - 01:59

వనస్థలిపురం, ఆగస్టు 5: బండ్లగూడ, పోచారంలో ఉన్న రాజీవ్ స్వగృహ భవనాలలో రూ.50 కోట్ల నిధుల ఖర్చుతో అన్ని వసతుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర గృహా నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. శుక్రవాం బండ్లగూడలోని రాజీవ్ స్వగృహ ఇళ్లను సందర్శించారు. అన్ని బ్లాకుల్లో కలయతిరిగి అక్కడ ఉన్న వసతులతోపాటు నిర్మాణాలను పరిశీలించారు.

08/06/2016 - 01:58

జీడిమెట్ల, ఆగస్టు 5: వ్యవసాయ రంగంలో పాలిహౌస్ టెక్నాలజీతో ఎక్కువ లాభాలు ఉన్నాయని రాష్ట్ర అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారధి అన్నారు. శుక్రవారం జీడిమెట్లలోని పాలిహౌస్‌లో జరిగిన హరిత హారం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి మొక్కలను నాటారు. పాలిహౌస్‌లోని పొలాలను, కూరగాయల మొక్కలను పరిశీలించారు. ఆ తరువాత రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

08/06/2016 - 01:58

ముషీరాబాద్, ఆగస్టు 5: కేంద్రంలో ఎన్డీఎ, తెలంగాణ సర్కార్ అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై యుద్ధానికి ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త సన్నద్ధం కావాలని అఖిలభారత యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అమరేందర్ సింద్ రాజా బరార్ పిలుపునిచ్చారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ కైవశం చేసుకోవడమే లక్ష్యంగా కృషి చేయాలని ఆయన అన్నారు.

08/06/2016 - 01:57

కులకచర్ల, ఆగస్టు 5: దేవాలయాలు సమాజాన్ని తీర్చిదిద్దే కర్మాగారాలని, వాటి పట్ల నిష్ఠ నియమాలు కలిగి ఉంటే సమాజం కచ్చితంగా బాగుపడుతుందని హిందూ ధర్మ ప్రచార పరిషత్ పరివ్రాజకులు శీధరాచార్యులు ఉద్బోధించారు. కులకచర్ల మండల కేంద్రంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న పోశమ్మ అమ్మవారి ఆలయ ప్రారంభోత్సవం సంధర్బంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు శుక్రవారం అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపనతో ఆలయ ప్రారంభోత్సవం జరిగింది.

08/06/2016 - 01:57

హైదరాబాద్, ఆగస్టు 5: గ్రేటర్ హైదరాబాద్ శివారు మున్సిపాలిటీలోని వివిధ గ్రామాల ప్రజలకు నీటి సౌకర్యం ఏర్పాటు కోసం ప్రభుత్వం రూ.1900కోట్ల హడ్కోరుణంతో అభివృద్ధి పనుల చేపడుతోంది.

08/06/2016 - 00:36

విజయనగరం, ఆగస్టు 5: జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ బాధ్యతలు చేపట్టడంతోనే పరిపాలనా విషయాల్లో తనదైన విధానాన్ని ప్రదర్శిస్తుండటంతో జిల్లా అధికారుల్లో కలకలం, కదలిక మొదలైంది. కార్యాలయ సందర్శనలు, ఆకస్మిక తనిఖీలు, తప్పుచేసిన సిబ్బందిపై కొరడా ఝుళిపించటం తదితర చర్యలతో అధికారులను పరుగులెత్తిస్తున్నారు.

Pages