S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/04/2016 - 07:25

హైదరాబాద్, ఆగస్టు 3: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భవిష్యత్తులో అద్భుతమైన నగరంగా అవతరించేందుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని, ప్రపంచ శ్రేణి నగరంగా ఎదిగే సామర్థ్యం ఉందని గ్లోబల్ ప్రోపర్టీ కనె్సల్టెంట్స్ నైట్ ఫ్రాంక్ ఇండియా ప్రకటించింది. అమరావతి వ్యూహాత్మకమైన ప్రాంతంలో ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాలు అధికంగా ఉన్న ఈ ప్రాంతాల్లో వౌలిక వసతులను ఏర్పాటు చేసేందుకు అనేక కంపెనీలు నిమగ్నమై ఉన్నాయని పేర్కొంది.

08/04/2016 - 07:24

విజయవాడ, ఆగస్టు 3: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలకు ఒక విధానాన్ని రూపొందించేందుకు ఐదుగురు ఉన్నతాధికారులతో కూడిన కమిటీని ఏర్పాటుచేస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ఉత్తర్వులు జారీచేశారు.

08/04/2016 - 07:23

హైదరాబాద్, ఆగస్టు 3: ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే బహిరంగ సభ విజయవంతం కావాలని బిజెపి రాష్ట్ర నాయకులు గురువారం సుదర్శన యాగం నిర్వహించనున్నారు. ప్రధాని రాక సందర్భంగా బిజెపి ఈ నెల 7న ఎల్‌బి స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నది. బిజెపి ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి నేతృత్వంలో ఈ యాగం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనున్నది.
కేంబ్రిడ్జి ఇంగ్లీష్‌తో ‘టాస్క్’ ఒప్పందం

08/04/2016 - 07:22

హైదరాబాద్, ఆగస్టు 3: భూసేకరణ కోసంతెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన జివో 123ని హైకోర్టు రద్దువేయడం పట్ల ప్రతిపక్షాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గాంధీభవన్‌లో బాణాసంచా పేల్చి, మిఠాయిలు పంచిపెట్టారు. జీవో నెం.123 ప్రతులను తగులబెట్టారు.
ఇది రైతుల విజయం: టి.పిసిసి

08/04/2016 - 09:03

హైదరాబాద్, ఆగస్టు 3: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. రైతులనుంచి నేరుగా భూములు కొనుగోలు చేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో123ను కొట్టివేస్తూ హైకోర్టు బుధవారం తీర్పునిచ్చింది. ప్రాజెక్టుల నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం 2015 జూలై 30న జీవో 123 జారీ చేసిన విషయం తెలిసిందే.

08/04/2016 - 06:41

హైదరాబాద్, ఆగస్టు 3: అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ నగర రోడ్లన్నింటినీ పునర్నిర్మించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. నిజాం కాలంనాటి రోడ్లనే ఇప్పటికీ వాడుతున్నట్టే, తాము పునర్నిర్మించే రోడ్లనే మరో వందేళ్లపాటు వినియోగించుకునేలా తీర్చిదిద్దుతామన్నారు.

08/04/2016 - 06:38

హైదరాబాద్, ఆగస్టు 3: రాష్ట్రంలో కొలువుల జాతర కొనసాగుతోంది. వరుస నోటిఫికేషన్లు జారీ చేస్తున్న ప్రభుత్వం తాజాగా మరో 1700 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం సాంఘిక గురుకుల పాఠశాలలు, డిగ్రీ కాలేజీల్లో 1794 పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఆమోదించిన 758 పోస్టులకు ఇవి అదనంగా భర్తీ చేయనున్నట్టు అధికారులు పేర్కొన్నారు.

08/04/2016 - 06:24

న్యూఢిల్లీ, ఆగస్టు 3: ఏకీకృత మార్కెట్ దిశగా భారత్ బలమైన ముందడుగు వేసింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎన్నడూ చేపట్టని రీతిలో అతిపెద్ద పన్నుల సంస్కరణల వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. సెంట్రర్ ఎక్సైజ్ సుంకం,రాష్ట్రాల వ్యాట్/ అమ్మకం పన్నులు సహా అన్ని రకాల పరోక్ష పన్నులు ఒకే జిఎస్‌టి పన్నుల విధానం పరిధిలోకి వచ్చే వ్యవస్థకు ఊతం లభించింది.

08/04/2016 - 06:21

న్యూఢిల్లీ, ఆగస్టు 3: దేశంలో పరోక్ష పన్నులకు సంబంధించి విప్లవాత్మక మార్పు తీసుకువచ్చే వస్తు సేవల పన్ను (జిఎస్‌టి)కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదించటం చారిత్రక పరిణామమని ప్రధాని నరేంద్రమోదీ అభివర్ణించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర లక్ష్య సాధనకు సహకరించిన అన్ని పార్టీల నాయకులకు ధన్యవాదాలు చెప్పారు.

08/04/2016 - 06:19

విజయవాడ, ఆగస్టు 3: రాష్ట్ర ప్రభుత్వం ఏటా రైతులకిచ్చే వ్యవసాయ రుణాల మొత్తాన్ని భారీగా పెంచింది. 2016-17 సంవత్సరానికి గాను మొత్తం 83 వేల కోట్ల రూపాయల రుణాలు అందజేయాలని నిర్ణయించింది.

Pages