S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/22/2016 - 20:53

కొత్తబంగారులోకం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన శే్వతబసుప్రసాద్ పెళ్లిపీటలెక్కబోతోంది. తొలి చిత్రంతోనే హిట్ హీరోయిన్‌గా పేరు పొందిన శే్వత, ఆ తర్వాత సరైన చిత్రాలను చేయలేకపోయింది. ఒకనొక సమయంలో వ్యభిచారం కేసులో ఇరుక్కుని కొన్నాళ్లు రెస్క్యూ హోంలో శిక్ష కూడా అనుభవించింది. కోర్టు క్లీన్ చిట్ ఇచ్చాక, టాలీవుడ్‌కు బై చెప్పింది. ముంబై వెళ్ళేప్పుడే షార్ట్ ఫిలిమ్స్ తీస్తానంటూ వెళ్లింది.

07/22/2016 - 20:51

సాయి రవికుమార్, అతిథిదాస్ జంటగా అంజన్ కళ్యాణ్ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రం ‘అత్తారిల్లు’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదలకు సిద్ధం చేశారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదలచేశారు.

07/22/2016 - 20:47

‘‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపురా నీ జాతి నిండు గౌరవము’’ అన్న మహాకవి గురజాడ అప్పారావు మాటలను ఆచరణలో చూపిస్తున్న చిన్నారి మీరా వశిష్ఠ్. తన తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడినప్పటికీ, ఆమెకు మాతృదేశంపై వున్న మమకారం తగ్గలేదు. దేశంలో

07/22/2016 - 20:45

పదో తరగతి పాసైతే చాలు యూత్‌గా భావించుకునే నేటీ యువతరం సామాజిక మాధ్యమాలకు అతుక్కుపోతుంటే సొంత గడ్డపై మమకారం వీరిద్దరిని సేవా పధం వైపు నడిపించింది. సగటు అమ్మాయిలుగా ఆలోచించకుండా భిన్నమైన ఆలోచనలతో మన్ననలు అందుకుంటున్నారు.

07/22/2016 - 20:39

తలుపు చప్పుడయ్యింది. రామభద్రం నిద్రనుండి మెలకువలోకి వచ్చాడు. ఆయన మంచం దిగి తలుపును సమీపించే లోపుగా మరోసారి తలుపుమీద బాదిన చప్పుడయ్యింది. ఈసారి ఆయనను ‘బాబాయ్!’ అని పిలిచారు.
తలుపు తెరచాడు రామభద్రం.
మేడమీద అద్దెకు ఉంటూన్న కుమార్.

07/22/2016 - 18:22

విజయవాడ: ఎపికి ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ ఎంపి కెవిపి ప్రవేశపెట్టిన ప్రైవేటుబిల్లును ఓటింగ్‌కు రాకుండా అడ్డుకున్నందుకు నిరసనగా కేంద్రం దిష్టిబొమ్మను కాంగ్రెస్ కార్యకర్తలు శుక్రవారం ఇక్కడి ఆంధ్రరత్న భవన్ వద్ద దగ్ధం చేశారు. ప్రత్యేక హోదాపై ఎపి సిఎం చంద్రబాబు ఇకనైనా తన వైఖరిని స్పష్టం చేయాలని కాంగ్రెస్ నేత దేవినేని నెహ్రూ డిమాండ్ చేశారు.

07/22/2016 - 18:22

విజయవాడ: ఇతర కులాలను బిసి జాబితాలో చేర్చరాదంటూ బిసి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ఇక్కడ పెద్దఎత్తున ర్యాలీ జరిపారు. బిసి కమిషన్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ఆందోళనకారులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఫలితంగా తోపులాట జరిగింది.

07/22/2016 - 18:21

దిల్లీ: శాంతిభద్రతలు మృగ్యమైనందున జమ్ము-కాశ్మీర్ రాష్ట్రంలో తక్షణం గవర్నర్ పాలన విధించాలంటూ పాంథర్స్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం నాడు విచారణకు సుప్రీం కోర్టు స్వీకరించింది. వచ్చే వారం ఈ పిటిషన్‌పై విచారణ జరుగుతుంది. జమ్ము-కాశ్మీర్ చట్టంలోని ఓ నిబంధన మేరకు కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

07/22/2016 - 18:13

హైదరాబాద్ : నగరంలోని లంగర్‌హౌస్‌ రామ్‌దేవ్‌గూడ దగ్గర శుక్రవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు, టీప్పర్ ఢీకొన్నాయి. దీంతో మొత్తం 8 మందికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరికి మెరుగైన చికిత్స అందించేందుకు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

07/22/2016 - 18:07

శ్రీనగర్‌: పుల్వామా జిల్లా అవంతిపొరాలో ఆందోళనకారులు శుక్రవారం రెచ్చిపోయారు. భద్రతా బలగాలపైనా దాడులు చేశారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఓ యువకుడు మృతిచెందాడు. దీంతోఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జమ్మూకశ్మీర్‌ అల్లర్లలో ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 45కి చేరింది.

Pages