S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/21/2016 - 08:50

నిజామాబాద్, జూలై 20: పచ్చదనాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమంలో ప్రతిపక్షాల భాగస్వామ్యం మచ్చుకైనా కానరావడం లేదు. అన్ని వర్గాల వారిని భాగస్వాములు చేస్తూ హరితహారంను విజయవంతం చేయాలని ప్రభుత్వం తలపోస్తున్నప్పటికీ, ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారంతా ఈ కార్యక్రమానికి దూరంగానే ఉండిపోతున్నారు.

07/21/2016 - 08:50

యాదగిరిగుట్ట రూరల్, జులై 20:యాదగిరిగుట్ట ఆర్టీసీ బస్టాండ్ సైకిల్ పార్కింగ్ లో పట్టపగలే టిఎమ్‌యు ఆర్టీసీ కార్మిక నాయకులు మద్యం సేవిస్తూ హల్‌చల్ చేస్తున్నారన్న సమాచారంతో అక్కడకు చేరుకుని ఫోటోలు తీస్తున్న విలేఖరులపై దురుసుగా ప్రవర్తించటమే కాకుండా నానా దుర్భాషాలాడిన టిఎమ్‌యు ఆర్టీసీ కార్మికులపై చర్య తీసుకోవాలని బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో విలేఖరులు ఫిర్యాదు చేసారు.

07/21/2016 - 08:49

మహబూబ్‌నగర్, జూలై 20: జూరాలకు జలకళ మళ్లింది. రైతుల్లో ఆశలు చిగురించాయి. ముఖ్యంగా గత మూడు నాలుగు దశాబ్దాల నుండి ఎదురుచూస్తున్న సాగునీటి కల నేరవేరనుంది. గత 14 సంవత్సరాల క్రితం ప్రారంబించిన పెండింగ్ ప్రాజెక్టుల పనులు ఓ కొలిక్కి వచ్చాయి.

07/21/2016 - 08:48

కరీంనగర్, జూలై 20: మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించుటకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖా మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బుదవారం ఎన్‌జిఒ కాలనీలో హరితహరం కార్యక్రమంలో బాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి మొక్కలు 70 రూపాయల నుండి 100 రూపాయల వరకు ఖర్చు చేస్తుందన్నారు. మొక్కలను బతికించుకున్నప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని అన్నారు.

07/21/2016 - 08:47

ఆదిలాబాద్, జూలై 20: వచ్చే దసరా నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా తెలంగాణ ప్రభుత్వం సాగిస్తున్న కసరత్తు జిల్లాలో జోరందుకుంది. తొలుత మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల విభజన ఖాయమని అందరూ భావించిన తరుణంలో ముఖ్యమంత్రి కెసిఆర్ అదనంగా 14 జిల్లాల ఏర్పాటుకు సూత్రప్రాయంగా అంగీకరించడంతో నిర్మల్ నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ జిల్లా కేంద్రం కోసం గట్టి ప్రయత్నాలు సాగిస్తున్నారు.

07/21/2016 - 08:46

మెదక్, జూలై 20: అశోక చక్రవర్తి రోడ్డుకు ఇరువైపుల చెట్లు నాటించినట్లు చరిత్ర చెబుతుంది. ఆ చరిత్రను ఇప్పుడు ముఖ్యమంత్రి కెసిఆర్ తిరగరాశారని ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నాడు మెదక్ క్యాంప్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. దేశ చరిత్రలో లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో 40 కోట్ల మొక్కలకు ముఖ్యమంత్రి కెసిఆర్ శ్రీకారం చుట్టారన్నారు.

07/21/2016 - 08:45

నల్లగొండ టౌన్, జూలై 20 : హరితయజ్ఞంతోనే సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా మారుతూ రైతుల కరువు కాటకాలు తీరుతాయని ఇన్‌చార్జీ కలెక్టర్ సత్యనారాయణ, అదనపు జాయింట్ కలెక్టర్ వెంకట్‌రావులు అన్నారు. బుధవారం పట్టణంలోని జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ కార్యాలయం వద్ద హరితహారంలోభాగంగా మొక్కలు నాటి మాట్లాడారు.

07/21/2016 - 08:45

ఖమ్మం, జూలై 20: రైతాంగ సమస్యలపై రాష్టవ్య్రాప్తంగా ఉద్యమం చేపడుతామని, అన్ని రంగాల్లో విఫలమైన కెసిఆర్ ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెప్పేలా చైతన్యపరుస్తామని శాసన మండలిలో కాంగ్రెస్ పక్ష ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. రీడిజైన్ పేరుతో ఖమ్మం జిల్లాలోని ఇందిరా, రాజీవ్‌ల పేర్లతో ఉన్న ప్రాజెక్టుల పేర్లను మార్చడాన్ని నిరసిస్తూ ఖమ్మం కలెక్టరేట్ ఎదుట బుధవారం ఒక్కరోజు నిరసన దీక్ష చేపట్టారు.

07/21/2016 - 08:33

హైదరాబాద్, జూలై 20: జార్ఖండ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రఘువరదాస్ మదుపరులకు పిలుపునిచ్చారు. తమ పారిశ్రామిక విధానం సరళీకృతంగా ఉందని ఆయన చెప్పారు. బుధవారం ఇక్కడ జరిగిన జార్ఖండ్ ఇనె్వస్ట్‌మెం ట్ రోడ్‌షో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జార్ఖండ్ ప్రభుత్వంతో ఒరాకిల్, శ్రీ సిమెంట్ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.

07/21/2016 - 08:31

ఒంగోలు, జూలై 20: ప్రకాశం జిల్లాలోని దొనకొండలో 50 వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో విమానాలు, హెలికాప్టర్ల తయారి పరిశ్రమను స్థాపించేందుకు ఉక్రెయిన్‌కు చెందిన పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు వెల్లడించారు. బుధవారం ఒంగోలులోని మంత్రి నివాసంలో ఉక్రెయిన్ ప్రతినిధుల బృందం మర్యాద పూర్వకంగా కలిసింది.

Pages