S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/21/2016 - 07:33

విజయవాడ, జూలై 20: రాష్ట్ర పోలీస్ డైరక్టర్ జనరల్ రాముడు ఈ నెల 23న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో ఇన్‌ఛార్జ్ డిజిపిగా నండూరి సాంబశివరావు బాధ్యతలు స్వీకరించనున్నారు. డిజిపి రాముడు ఈనెలాఖరులో పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే, పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని రెండు నెలలపాటు ఆయన పదవీ కాలాన్ని పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే, రాముడు అందుకు అంగీకరించలేదని తెలిసింది.

07/21/2016 - 07:32

హైదరాబాద్, జూలై 20: ఉగ్రవాదులకు న్యాయ సహాయం అందిస్తామని ప్రకటించిన మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీకి వ్యతిరేకంగా బిజెపి రాష్ట్ర శాఖ సంతకాల సేకరణ చేపట్టింది. బుధవారం దిల్‌సుక్‌నగర్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

07/21/2016 - 07:28

హైదరాబాద్, జూలై 20: డబుల్ బెడ్‌రూమ్.. పేదవాడు సొంతిట్లో పూర్తి ఆత్మగౌరవంతో బతకాలన్న లక్ష్యం. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించిన మానవీయ పథకమిది. ఇందిరమ్మ ఇళ్ము, ఎన్టీఆర్ గృహ నిర్మాణాలకు పూర్త్భిన్నంగా సామాన్యుడు ధీమాగా బతికేందుకు కేసీఆర్ సొంత ఆలోచనల నుంచి పుట్టిన బృహత్తర పథకమిది. అయితే అధికారుల నత్తనడక విధానాల వల్ల సందేహాలపాలవుతోంది.

07/21/2016 - 07:27

హైదరాబాద్, జూలై 20: ఉపాధ్యాయుల నియామకాలకు దేశవ్యాప్తంగా ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రజల విద్యా సంస్కరణ ఉద్యమం (టిపిఇఆర్‌ఎం) కేంద్రప్రభుత్వాన్ని సూచించింది. జాతీయ నూతన విద్యా విధానం త్వరలో అమలులోకి తీసుకురానున్న నేపథ్యంలో టిపిఇఆర్‌ఎం హైదరాబాద్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించింది.

07/21/2016 - 07:26

హైదరాబాద్, జూలై 20: గవర్నర్ ప్రమేయం లేకుండా తెలంగాణలో విశ్వవిద్యాలయాలకు వైస్‌చాన్సలర్లను నియమించేందుకు వీలు కల్పిస్తూ ఏపి యూనివర్శిటీస్ చట్టం 1991కు ప్రభుత్వం సవరణలు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది.

07/21/2016 - 07:15

న్యూఢిల్లీ, జూలై 20: అణు సరఫరా దేశాల కూటమి (ఎన్‌ఎస్‌జి)లో భారత్ చేరికపై చైనాతో ఉన్న విభేదాలను తొలగించుకునేందుకు ఆ దేశంతో చర్చలు జరుపుతున్నట్టు భారత్ బుధవారం ప్రకటించింది. అయితే భారత్ ఎప్పటికీ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పిటి)పై సంతకం చేయబోదని ప్రభు త్వం స్పష్టం చేసింది.

07/21/2016 - 07:13

న్యూఢిల్లీ, జూలై 20: నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను అస్థిరపరుస్తోందని, సమాజాన్ని చీలుస్తోందంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ ప్రభుత్వం తన సంకుచిత సిద్ధాంతాన్ని ప్రజలపై రుద్దడానికి పార్లమెంటులో ఉన్న ఆధిక్యతను లైసెన్సుగా భావిస్తోందని, అది తప్పుడు భావన అని ఆమె ధ్వజమెత్తారు.

07/21/2016 - 07:13

ఇటానగర్, జూలై 20: అరుణాల్‌ప్రదేశ్‌లో నాలుగు రోజుల క్రితం గద్దెనెక్కిన పేమా ఖండూ ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో నెగ్గింది. దీంతో కొన్ని నెలలుగా రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడిన రాష్ట్రం గాడిలో పడినట్లయింది. ముఖ్యమంత్రి ఖండూకు మద్దతు తెలియజేసే తీర్మానానికి 46 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయగా, ప్రతిపక్ష బిజెపికి చెందిన 11 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు.

07/21/2016 - 07:12

క్లీవ్‌లాండ్, జూలై 20: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా నామినేట్ అయ్యారు. క్లీవ్‌లాండ్‌లో రెండు రోజులుగా జరుగుతున్న పార్టీ కనె్వన్షన్‌లో ట్రంప్‌ను పార్టీ అభ్యర్థిగా ఖరారు చేశారు. అమెరికాలో రియల్ ఎస్టేట్ టైకూన్ అయిన డొనాల్డ్ ట్రంప్ (70) సరిగ్గా ఏడాది క్రితమే క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు.

07/21/2016 - 07:11

రాజ్‌కోట్, జూలై 20: గుజరాత్‌లోని ఉనా పట్టణంలో దళిత యువకులను చితకబాదిన సంఘటనకు నిరసనగా బుధవారం దళిత సంఘాలు ఇచ్చిన రాష్ట్ర బంద్‌కు మిశ్రమ స్పందన లభించింది. కొన్ని ప్రాంతాల్లో రాస్తారోకోలు, రాళ్లురువ్విన సంఘటనలు జరిగాయి. కాగా, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనంది బెన్ పటేల్ బుధవారం బాధితుల కుటుంబ సభ్యులను కలిశారు. మరోవైపు ప్రతిపక్ష నేతలు ఉనాకు క్యూ కడుతున్నారు.

Pages