S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/21/2016 - 07:11

మావు/న్యూఢిల్లీ, జూలై 20: బిఎస్పీ అధినేత్రి మాయావతిపై అభ్యంతరకర వ్యా ఖ్యలు చేసిన ఉత్తరప్రదేశ్ బిజెపి ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్‌పై పార్టీ వేటు వేసింది. మాయావతిపై సింగ్ చేసిన వ్యాఖ్యలను అన్ని పార్టీల నేతలు తీవ్రంగా ఖండించడమే కాక ఆయనపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేయడంతో బిజెపి అదిష్ఠానం సైతం ఇరుకున పడింది.

07/21/2016 - 07:10

అయోధ్య, జూలై 20: రామ జన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంలో అతిపెద్ద కక్షిదారు అయిన హషీం అన్సారీ బుధవారం ఇక్కడ మృతి చెందారు. 1949 నుంచి ఈ వివాదంతో సంబంధం ఉన్న 95 ఏళ్ల అన్సారీ గుండె సంబంధ వ్యాధితో మృతి చెందారు. అన్సారీ తన స్వగృహంలో తెల్లవారు జామున తుది శ్వాస విడిచినట్లు అతని కుమారుడు ఇక్బాల్ చెప్పారు. అయోధ్యలో జన్మించిన అన్సారీ ఈ వివాదంపై తొలిసారి 1949లో ఫైజాబాద్‌లోని సివిల్ జడ్జి కోర్టులో కేసు వేశారు.

07/21/2016 - 07:10

న్యూఢిల్లీ, జూలై 20: డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద దేశంలోని అన్ని గ్రామ పంచాయతీలను ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (ఓఎఫ్‌సి) కింద అనుసంధానం చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2018 నాటికి డిజిటల్ ఇండియా చేయాలన్నది ప్రభుత్వం యోచన. దీన్లో భాగంగా అన్ని పంచాయతీలను ఓఎఫ్‌సికి అనుసంధానం చేస్తామని కేంద్ర ఐటి మంత్రి రవిశంకర్ ప్రసాద్ బుధవారం లోక్‌సభకు తెలిపారు.

07/21/2016 - 07:09

న్యూఢిల్లీ, జూలై 20: రిటైరైన వాళ్లకు, ఆరోగ్య సేవలకు సంబంధించీ భారత్ దేశం అత్యంత అధ్వాన్న స్థితిలో ఉంది. మొత్తం 43దేశాల్లోని పరిస్థితులపై జరిగిన అంతర్జాతీయ సర్వేలో భారత్‌కు చిట్టచివరి స్థానం దక్కింది! మొదటి మూడు స్థానాల్లో నార్వే, స్విట్జర్లాండ్, ఐస్‌లాండ్‌లు ఉన్నాయి. మిగతా ఏడు స్థానాలు వరుసగా న్యూజిలాండ్, స్వీడన్, ఆస్ట్రేలియా, జర్మనీ, నెదర్లాండ్స్, ఆస్ట్రియా, కెనడాలు ఉన్నాయి.

07/21/2016 - 07:08

న్యూఢిల్లీ, జూలై 20: ముంబయి- అహ్మదాబాద్ మధ్య తలపెట్టిన హైస్పీ డ్ రైల్ కారిడార్ ఆరేళ్లలో పూర్తవుతుందని కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు వెల్లడించారు. ఈ హైస్పీడ్ రైలు చార్జీలు విమాన చార్జీలకంటే తక్కువగానే ఉంటాయని బుధవారం లోక్‌సభకు తెలిపారు. ముంబయి-అహ్మదాబాద్ మధ్య 508 కిలోమీటర్ల దూరాన్ని హైస్పీడ్ రైలు రెండు గంటలో చేరుకుంటుందని లోక్‌సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో చెప్పారు.

07/21/2016 - 07:07

భోపాల్, జూలై 20: రైతుల ఆత్మహత్యలకు కారణాలు విశే్లషించి వాటిని నిరోధించే చర్యలు తీసుకోవల్సిన ప్రభుత్వమే విడ్డూరమైన ప్రకటన చేయడం దిగ్భ్రాంతి కలిగించేదే. గత మూడేళ్లుగా మధ్యప్రదేశ్‌లో 418 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయితే ఇందుకు కారణం వారందరికీ దెయ్యాలు పూనడమేనని మధ్యప్రదేశ్ ప్రభుత్వమే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించింది.

07/21/2016 - 07:06

ముంబయి, జూలై 20: ఆ అధికారి చనిపోయి మూడేళ్లయింది. అయితేనేం ఆయనకు తాజాగా బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ వింత మహారాష్టల్రో చోటుచేసుకుంది. ఎక్సైజ్ శాఖలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న సందీప్ సబాలే 2013 జూలైలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అయితే ఆయన చనిపోయిన విషయం ఆఫీసు రికార్డుల్లో నమోదు కాకపోవడంతో ఈ నెల మొదట్లో జరిగిన 181మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీల్లో ఆయన పేరుకూడా చేరిపోయింది.

07/21/2016 - 07:04

న్యూఢిల్లీ, జూలై 20: విద్యా సంస్థలను ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య జనాభా ప్రాతిపదికపై విభజించాలని తెలుగుదేశం లోక్‌సభ సభ్యుడు అవంతి శ్రీనివాస్ బుధవారం లోక్‌సభలో డిమాండ్ చేశారు. విభజన చట్టంలోని తొమ్మిదవ షెడ్యూలు పరిధిలోని 31 సంస్థలు, కంపెనీలను ఇంకా విభజించవలసి ఉన్నది, విద్యా సంస్థల పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు నెలకొన్నాయని ఆయన సభకు వివరించారు.

07/21/2016 - 07:04

లాహోర్/ఇస్లామాబాద్, జూలై 20: కాశ్మీర్ అంశం భారత దేశ ఆంతరంగిక వ్యవహారం ఎంత మాత్రం కాదని పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ స్పష్టం చేశారు. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు. కాగా, కాశ్మీర్ ప్రజలకు సంఘీభావంగా బుధవారం ప్రభుత్వం నిర్వహించిన ‘బ్లాక్ డే’కు ప్రజల నుంచి అంతంత మాత్రంగానే ప్రతిస్పందన వచ్చింది.

07/21/2016 - 08:35

హైదరాబాద్, జులై 20: మా పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే ఎ రేవంత్ రెడ్డికి ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సిఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరారు. ఈమేరకు సిఎం బాబు బుధవారం లేఖ రాశారు. రేవంత్‌కు మరింత రక్షణ కల్పించాలని గతంలో హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని ఆదేశించిందని ఆయన లేఖలో ప్రస్తావించారు.

Pages