S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/20/2016 - 18:25

దిల్లీ: పార్టీ టిక్కెట్లను ఎక్కువ డబ్బులకు అమ్ముకుంటూ బిఎస్‌పి అధినేత్రి మాయావతి ఓ వేశ్యలా వ్యవహరిస్తున్నారంటూ యుపికి చెందిన బిజెపి నాయకుడు దయాశంకర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు బుధవారం రాజ్యసభలో దుమారం సృష్టించాయి. దళిత మహిళపై ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేసినందుకు దయాశంకర్‌పై చర్యలు తీసుకోవాలని బిఎస్‌పి ఎంపీలు పట్టుబట్టడంతో రాజ్యసభలో గందరగోళం చెలరేగింది. దీంతో సభను రేపటికి వాయిదా వేశారు.

07/20/2016 - 18:25

హైదరాబాద్: పలు అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చినందున ఎంసెట్-2ను రద్దు చేసి, మరోసారి ఆ పరీక్షను జరపాలని కాంగ్రెస్ నాయకుడు గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. ఎంసెట్-2 విషయంలో వెల్లువెత్తిన ఆరోపణలపై ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టిసారించి సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేయాలన్నారు.

07/20/2016 - 18:24

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఇన్‌చార్జి డిజిపిగా ప్రస్తుత ఆర్టీసీ ఎండీ నండూరి సాంబశివరావు ఈనెల 23న బాధ్యతలు చేపడతారని సమాచారం. డిజిపి జెవి రాముడు పదవీ విరమణ చేస్తున్నందున ఇన్‌చార్జి డిజిపిని నియమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. ఈనెల 23న ఇక్కడ రాముడికి వీడ్కోలు ఇచ్చిన వెంటనే సాంబశివరావు బాధ్యతలు చేపడతారు.

07/20/2016 - 18:24

హైదరాబాద్: తమ పార్టీ తరఫున గెలిచి ఇటీవల తెరాసలో చేరిన నల్గొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే రవీందర్ నాయక్‌ను అనర్హుడిగా ప్రకటించాలని సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారికి విజ్ఞప్తి చేశారు. ఆయన బుధవారం స్పీకర్‌ను కలిసి ఓ వినతిపత్రం సమర్పించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తెరాస పార్టీ అనైతిక ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందన్నారు.

07/20/2016 - 18:23

విజయవాడ: వచ్చే నెల 12 నుంచి జరిగే కృష్ణా పుష్కరాలను పర్యవేక్షించేందుకు ఎపి ప్రభుత్వం ఇద్దరు ఐఎఎస్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించింది. కృష్ణా, గుంటూరు జిల్లాలకు బి.రాజశేఖర్‌ను, కర్నూలుకు జి.అనంతరామును నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

07/20/2016 - 18:23

విజయవాడ: తెలంగాణలో ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతున్న తమ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డికి ప్రాణహాని ఉన్నందున అదనపు భద్రత కల్పించాలని టిడిపి అధినేత, ఎపి సిఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు బుధవారం లేఖ రాశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రేవంత్‌కు అదనపు భద్రత కల్పించాలని, ఈ విషయమై గతంలోనే హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు.

07/20/2016 - 18:22

హైదరాబాద్: ఎంబిబిఎస్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశానికి తెలంగాణ సర్కారు నిర్వహించిన ఎంసెట్-2లో అక్రమాలు జరిగాయన్న ప్రచారంలో నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు ఇక సిఐడి విభాగం రంగంలోకి దిగనుంది. ఈ వ్యవహారంపై సిఐడి పోలీసులు విచారణ జరపాలని డిజిపి అనురాగ్‌శర్మ బుధవారం ఆదేశించారు.

07/20/2016 - 18:19

దిల్లీ: తెలంగాణలో చేనేత రంగానికి కేంద్రం సాయం అందించాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీకి బుధవారం విజ్ఞప్తి చేశారు.

07/20/2016 - 18:15

అలహాబాద్‌: గూగుల్‌ ఇమేజ్‌ సెర్చ్‌లో ప్రపంచంలోని టాప్‌ 10 క్రిమినల్స్‌ జాబితా సెర్చ్‌ చేస్తే అందులో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో కూడా వచ్చింది. ఇమేజ్‌ సెర్చ్‌ ఇంజన్‌ ఇలా తప్పుగా చూపించడంపై సుశీల్‌కుమార్‌ మిశ్రా అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై గూగుల్‌కు అలహాబాద్‌ కోర్టు నోటీసులు పంపించింది. ఈ మేరకు గూగుల్‌ సీఈఓ, గూగుల్‌ ఇండియా హెడ్‌కు లీగల్‌ నోటీసులు జారీ చేసింది.

07/20/2016 - 17:51

దిల్లీ: ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించేందుకు తన మద్దతుదారులను ప్రేరేపించారని ఆరోపణలు రావడంతో దిల్లీ పోలీసులు ఆమ్‌ ఆద్మీ పార్టీ శాసన సభ్యుడు సోమ్‌నాథ్‌ భారతిపై కేసు నమోదు చేశారు. ఆయన మద్దతుదారులపై కూడా కేసు నమోదు చేశారు. దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ హాజరైన ఓ కార్యక్రమానికి వెళ్లిన తనతో సోమ్‌నాథ్‌ మద్దతుదారులు అసభ్యంగా ప్రవర్తించారని సదరు మహిళ ఫిర్యాదులో పేర్కొంది.

Pages