S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/20/2016 - 17:19

ఢిల్లీ: ఎపికి ప్రత్యేకహోదా కోసం పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీ కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటుబిల్లుకు మద్దతు ఇవ్వాలని టీడీపీ ఎంపీలు బుధవారం నిర్ణయించారు. కేంద్రమంత్రి సుజనా నివాసంలో టీడీపీ ఎంపీలు సమావేశమయ్యారు. తప్పులు సరిదిద్దుకోవడానికి కాంగ్రెస్‌ తెచ్చిన సవరణ బిల్లుకు మద్దతు ఇస్తామని టీడీపీ ఎంపీలు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను ఆశించి ప్రైవేటుబిల్లుకు తాము సహకరిస్తామన్నారు.

07/20/2016 - 17:16

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రపక్షిగా పాలపిట్ట, రాష్ట్ర పుష్పంగా తంగేడు, రాష్ట్ర పండుగా మామిడి, రాష్ట్ర వృక్షంగా జమ్మిచెట్టు, రాష్ట్ర క్రీడగా కబడ్డీ, రాష్ట్ర జంతువుగా కృష్ణ జింకను ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర చేపగా కొర్రమీనును ప్రకటించి, ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

07/20/2016 - 17:09

దిల్లీ: 15ఏళ్లు దాటిన డీజిల్‌ వాహనాల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని, దిల్లీ-ఎన్‌సీఆర్‌ బయట కూడా తిరిగేందుకు నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాన్ని(ఎన్‌వోసీ) ఇవ్వవద్దని నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ తెలిపింది. 15ఏళ్ల కంటే తక్కువ ఉన్న వాటికి మాత్రమే పరిమిత ప్రాంతాల్లో తిరిగేందుకు ఎన్‌వోసీలు ఇవ్వాలని తెలిపింది.

07/20/2016 - 16:51

హైదరాబాద్‌: నీటి విడుదలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే బుధవారం కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల్లో జలమట్టం తక్కువగా ఉందని, నీటి విడుదలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కృష్ణానది యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శి సమీర్‌ ఛటర్జీ తెలిపారు.

07/20/2016 - 16:46

లండన్‌: హైదరాబాద్‌కు చెందిన రోహిత్‌ ఖండేల్వాల్‌ 2016 మిస్టర్‌ వరల్డ్‌గా ఎంపికయ్యాడు. మిస్టర్‌ వరల్డ్‌గా ఓ భారతీయుడు ఎంపికవడం ఇదే తొలిసారి. ఇంగ్లాండ్‌లోని సౌత్‌పోర్ట్‌లో జరిగిన మిస్టర్‌ వరల్డ్‌ ఫైనల్స్‌లో 46 మంది అభ్యర్థులతో పోటీపడి రోహిత్‌ 2016 మిస్టర్‌ వరల్డ్‌గా ఎంపికయ్యాడు. 26ఏళ్ల రోహిత్‌ ప్రముఖ బుల్లితెర నటుడు, మోడల్‌గా సుపరిచితుడు.

07/20/2016 - 16:25

విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం చైనా పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. జీఐఐసీ కంపెనీకి చెందిన సీఈవో జాంగ్‌ ఝువోతో పాటు ఇతర ప్రతినిధులు అమరావతిలో మౌలికసదుపాయాల కల్పన ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం వహించేందుకు సిద్దమని ముఖ్యమంత్రికి వివరించారు.

07/20/2016 - 16:20

ముంబయి: బుధవారం సెన్సెక్స్‌ 128 పాయింట్లు లాభపడి 27,915 వద్ద ముగిసింది. నిఫ్టీ 37 పాయింట్ల లాభంతో 8,565 వద్ద ముగిసింది. దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 67.18 వద్ద కొనసాగుతోంది.

07/20/2016 - 16:06

దిల్లీ: రాజ్యసభలో బుధవారం మాయావతిపై భాజపా ఎంపీ దయాశంకర్‌సింగ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీఎస్పీ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో డిప్యూటీ ఛైర్మన్‌ కురియన్‌ రాజ్యసభను రేపటికి వాయిదా వేశారు.

07/20/2016 - 16:04

విజయవాడ: ఐదుగురు సీనియర్ ఐపీఎస్‌లు మాలకొండయ్య, గౌతం సవాంగ్, వినయ్‌రంజన్‌రే, ఆర్పీ ఠాకూర్‌, వీఎస్‌కే కౌముదికి డీజీపీ ర్యాంక్‌ పదోన్నతి కల్పించారు.

07/20/2016 - 16:01

విజయవాడ : ఏపీ కేడర్‌లో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారులు అమిత్‌గార్గ్, హరీష్‌కుమార్‌ గుప్తా తమను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌ (క్యాట్) లో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణను ఆగస్టు 10వతేదీకి క్యాట్ వాయిదా వేసింది. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు క్యాట్ నోటీసులు జారీ చేసింది.

Pages