S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/20/2016 - 15:57

గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఇటీవల రాయపాటి సతీమణి మృతి చెందారు.

07/20/2016 - 15:55

దిల్లీ: ఎపికి ప్రత్యేక హోదా కోసం ఎంపీ కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటుబిల్లుకు ఆమోదం తెలపాలని కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులకు విప్‌ జారీ చేసింది. శుక్రవారం వరకూ సభకు తప్పనిసరిగా హాజరుకావాలని పార్టీ ఆదేశించింది. కేవీపీ ప్రైవేటు బిల్లు శుక్రవారం రాజ్యసభ ముందుకు వచ్చే అవకాశముంది.

07/20/2016 - 15:51

దిల్లీ: బుధవారం రూ. 100 తగ్గడంతో దేశీయ మార్కెట్లో పది గ్రాముల పసిడి ధర రూ. 30,650గా ఉంది. నగల వ్యాపారుల నుంచి డిమాండ్‌ లేకపోవడంతో ధరలు తగ్గినట్లు బులియన్‌ మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. రూ. 110 తగ్గడంతో కేజీ వెండి ధర రూ. 46,220గా ఉంది.

07/20/2016 - 15:49

దిల్లీ: భారత హాకీ క్రీడాకారుల్లో దిగ్గజంగా పేరొందిన మహ్మద్ షాహిద్ (56) అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. గత నెల 29న తీవ్రమైన కడుపునొప్పి రావడంతో ఆయనను బెనారస్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో ఆ తర్వాత గుర్గావ్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన వైద్యఖర్చుల కోసం కేంద్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయలు విడుదల చేసింది.

07/20/2016 - 15:49

కర్నూలు: సెల్ఫీ తీసుకోవడంలో నిమగ్నమై ఆకస్మికంగా రైలుకింద పడి ఓ ఇంజనీరింగ్ విద్యార్థి మరణించిన ఘటన పాణ్యం మండలం నెరవాడ వద్ద బుధవారం జరిగింది. రైల్వే వంతెనపై ఇంజనీరింగ్ విద్యార్థి ఇద్రస్ బాషా సెల్ఫీ తీసుకుంటూ.. వెనుకనుంచి రైలు వస్తున్న విషయాన్ని గమనించలేదు. దీంతో బాషాను ఢీకొని రైలు వెళ్లిపోయింది. రైలు కింద పడిన బాషా అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనతో బాషా కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.

07/20/2016 - 15:48

తిరుపతి: తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరని భావించి, తిరుమలలో వివాహం చేసుకునేందుకు వచ్చిన ఓ ప్రేమజంటను పోలీసులు పట్టుకున్నారు. ఓ యువతి కిడ్నాప్ అయిందంటూ వచ్చిన సమాచారం మేరకు గాలింపు చర్యలు ప్రారంభించిన పోలీసులకు ఈ జంట చిక్కింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఓ యువతిని, ఆమె ప్రియుడిని తిరుపతి పోలీసులు బుధవారం పట్టుకున్నారు.

07/20/2016 - 15:48

విజయవాడ: ఎపికి ప్రత్యేకహోదా కోసం పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీ కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటుబిల్లుకు తాము మద్దతిస్తామని టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు బుధవారం తెలిపారు. ఆ బిల్లు వల్ల ఏదో జరుగుతుందని తాము భావించడం లేదని, రాష్ట్ర ప్రయోజనాలను ఆశించి తాము సహకరిస్తామన్నారు. తమ పార్టీ ఎన్‌డిఎ కూటమిలో ఉన్నప్పటికీ కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

07/20/2016 - 14:35

ఢిల్లీ : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు, డిండి ప్రాజెక్టులపై అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టుల నిర్మాణం ఉండకూడదని తేల్చింది. వీలైనంత త్వరగా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ వివాదాన్ని పరిష్కరించాలని సూచించింది.

07/20/2016 - 12:46

విజయవాడ: టిడిపి సమీక్షా సంఘం సమావేశం ఆ పార్టీ అధినేత, ఎపి సిఎం చంద్రబాబు సమక్షంలో బుధవారం ఇక్కడ జరిగింది. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, వాటి అమలు తీరుపై ప్రజల మనోభావాలు, పార్టీ కార్యక్రమాలు తదితర అంశాలపై చర్చ జరిగింది. పార్టీని మరింతగా పటిష్టం చేసేలా కృషి చేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కమిటీ సభ్యులు, పలువురు ఎమ్మెల్యేలు సమావేశంలో పాల్గొన్నారు.

07/20/2016 - 12:46

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-2 పేపర్ లీక్ అయినట్టు వస్తున్న కథనాలపై సమగ్ర విచారణ జరపాలని పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. కార్పొరేట్ కళాశాలలు ఎంసెట్-2 పేపర్‌ను లక్షలాది రూపాయలకు విక్రయించినట్టు వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలను వెలికితీయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం జెఎన్‌టియు వద్ద ధర్నా చేశారు. ఆరోపణలు రుజువైన పక్షంలో నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు.

Pages