S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/20/2016 - 12:46

దిల్లీ: రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంటు సాక్షిగా ఎపికి ఇచ్చిన హామీలను మరచిపోవద్దని కాంగ్రెస్ ఎంపీ కెవిపి రామచంద్రరావు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి లేఖ రాశారు. ప్రత్యేక హోదాపై పార్లమెంటులో తాను ప్రవేశపెట్టిన బిల్లును ఆమోదించేలా మద్దతు పలకాలని ఆయన కోరారు. అన్ని రంగాల్లో ఎపి అభివృద్ధి చెందాలంటే ప్రత్యేకహోదా ఇవ్వాలని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.

07/20/2016 - 12:45

న్యూయార్క్: అమెరికాలో పోలీసులపై మరోసారి కాల్పులు జరిగాయి. ఈసారి న్యూయార్క్ నగరంలో మంగళవారం ఇద్దరు పోలీసు అధికారులపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అయితే, ఈ సంఘటనలో వారు సురక్షితంగా బయటపడడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. న్యూయార్క్‌లో ఇద్దరు పోలీసు అధికారులు నడిచి వెళుతుండగా కారులో వెళుతున్న నలుగురు వ్యక్తులు వారిపై ఆకస్మికంగా కాల్పులు జరిపారు. వెంటనే వారు కారును వదిలేసి పరారయ్యారు.

07/20/2016 - 12:44

చిత్తూరు: ఓ ప్రైవేటు స్కూల్‌కు చెందిన బస్సును వేగంగా వస్తున్న లారీ ఢీకొనడంతో అయిదుగురు విద్యార్థులు గాయపడ్డారు. చంద్రగిరి మండలం కోట వద్ద బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి, లారీ డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

07/20/2016 - 12:44

విజయవాడ: ఎపికి ప్రత్యేకహోదా కోరుతూ కాంగ్రెస్ ఎంపీ కెవిపి రామచంద్రరావు పార్లమెంటులో ప్రతిపాదించిన ప్రైవేటుబిల్లుకు అన్నిపార్టీలూ మద్దతు ఇవ్వాలని కోరుతూ యువజన కాంగ్రెస్ కార్యకర్తలు బుధవారం ఇక్కడ భారీ ర్యాలీ జరిపారు. ప్రత్యేక హోదా ఇస్తేనే ఎపి అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని వారు అన్నారు. వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థినీవిద్యార్థులు ర్యాలీలో పాల్గొని సంఘీభావం వ్యక్తం చేశారు.

07/20/2016 - 12:44

విశాఖ: కశింకోట మండలం బయ్యవరం వద్ద జాతీయ రహదారిపై బుధవారం ఉదయం రోడ్డుపై ఆగిఉన్న లారీని వెనుక నుంచి మరోలారీ, బస్సు ఢీకొనడంతో 40 మంది గాయపడ్డారు. బస్సులోపలి భాగం చాలావరకూ ధ్వంసమైంది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

07/20/2016 - 12:43

దిల్లీ: పార్లమెంటు సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమైన వెంటనే గుజరాత్‌లో దళితులను అవమానించిన ఘటనపై విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యులు ఈ అంశాన్ని లేవెనెత్తి నిరసన తెలిపారు. గుజరాత్ ఘటనపై చర్చించాలని కాంగ్రెస్ సభ్యులు స్పీకర్‌కు నోటీసు ఇచ్చారు. దీనిపై వాయిదా తీర్మానాన్ని అనుమతించాలని ఆప్ ఎంపీలు పట్టుబట్టారు.

07/20/2016 - 12:43

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లోని దక్కన్ గ్రామీణ బ్యాంకు శాఖలో చోరీకి మంగళవారం అర్ధరాత్రి కొందరు దుండగులు విఫలయత్నం చేశారు. బ్యాంకు వేసి ఉన్న తాళాన్ని వారు బద్దలు కొడుతుండగా ఆ అలికిడికి గ్రామస్థులు మేల్కొన్నారు. గ్రామస్థులు రాళ్లు రువ్వడంతో దుండగులు తుపాకులతో కాల్పులు జరుపుతూ అక్కడి నుంచి పరారయ్యారు.

07/20/2016 - 12:29

మహబూబ్‌నగర్‌ : మాగనూరు మండలంలో కృష్ణా, భీమ నదుల సంగమమైన తంగడిగి వద్ద కృస్ణా జలాలు బుధవారం ప్రవేశించాయి. కర్నాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాలు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో ఎగువ నుంచి వస్తున్న నీటిని కిందకి వదులుతున్నారు. ఈ నీరు మధ్యాహ్నానికి జూరాల జలాశయానికి చేరుకోనుంది.

07/20/2016 - 12:08

హైదరాబాద్‌: ఆర్టీసీ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీఎంయూకు ఏకపక్ష విజయం దక్కిందన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన టీఎంయూ నేతలకు మంత్రి అభినందనలు తెలిపారు. తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ నేతలు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ ఈరోజు హరీశ్‌రావును కలిశారు.

07/20/2016 - 08:35

గుంటూరు, ప్రత్తిపాడు, జూలై 19: భారతదేశంతోపాటు ప్రపంచాన్ని కాపాడుకునేందుకు యోగులు, సిద్ధపురుషులు నిరంతరం కృషి చేస్తున్నారని, ఈ విశ్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని విశ్వయోగి విశ్వంజీ పిలుపునిచ్చారు. గురుపూర్ణిమ సందర్భంగా గుంటూరు జిల్లా విశ్వనగర్ ఆశ్రమంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

Pages