S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/20/2016 - 08:01

హైదరాబాద్, జూలై 19: హైదరాబాద్‌లోని బ్రిటిష్ లైబ్రరీని అవకాశాల సాంస్కృతిక కేంద్రంగా విస్తృత పరుస్తున్నట్టు జాతీయ డైరెక్టర్‌గా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన అలన్ గమ్మెల్ చెప్పారు. డైరెక్టర్ అయిన తర్వాత తొలిసారి హైదరాబాద్ వచ్చి స్థానిక బ్రిటిష్ లైబ్రరీని సందర్శించారు.

07/20/2016 - 08:00

హైదరాబాద్, జూలై 19: ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్ షీట్లు, రంజాన్ సందర్భంగా ప్రభుత్వం పంపిణీ చేసే బట్టలు చేనేత కార్మికుల నుంచి ఖరీదు చేసి వారిని ఆదుకోవాలని అసెంబ్లీ అంచనాల కమిటీ సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించింది. టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే, అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి అధ్యక్షతన మంగళవారం అసెంబ్లీ ఆవరణలోని కమిటీ హాలులో కమిటీ సమావేశం జరిగింది.

07/20/2016 - 08:00

హైదరాబాద్, జూలై 19: మల్లన్న సాగర్ ప్రాజెక్టు వల్ల ప్రజలకు ప్రయోజనం కలిగితే దానిని ఎవరూ వ్యతిరేకించరని, రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రాజెక్టు నిర్మిస్తున్నారని పలువురు వక్తలు అన్నారు. మంగళవారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఆత్మగౌరవ వేదిక ఆధ్వర్యంలో మల్లన్న సాగర్ రిజర్వాయర్ అవరసమా? ఎవరికోసం మల్లన్న సాగర్? అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు.

07/20/2016 - 07:59

హైదరాబాద్, జూలై 19: కేంద్ర దర్యాప్తు సంస్థ కస్టడీలో ఉన్న ముగ్గురు ఐసిస్ సానుభూతిపరుల కస్టడీ ముగిసింది. మంగళవారం వారిని ఎన్‌ఐఏ అధికారులు నాంపల్లి కోర్టుకు హాజరుపరిచారు. గత నెల 28న నగరంలో ఐసిస్ ఉగ్రవాదులు చొరబడ్డారని కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఎన్‌ఐఏ, నగర పోలీసుల సంయుక్త ఆపరేషన్‌తో 11 మందిని అరెస్టు చేశారు. వీరిని విచారించి ఆరుగురిని వదిలిపెట్టారు.

07/20/2016 - 07:58

హైదరాబాద్, జూలై 19: ప్రజల అవసరాలకు అనుగుణంగా మైక్రోఫైనాన్స్ కంపెనీలు తమ రుణ విధానాన్ని రూపొందించుకోవాలని, లేనిపక్షంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2010లో తలెత్తిన సంక్షోభాలు పునరావృతమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గత అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలని ఆయన కోరారు. మంగళవారం ఇక్కడ మైక్రోఫైనాన్స్ సంస్థలపై అసోచామ్ నిర్వహించిన జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు.

07/20/2016 - 07:50

న్యూఢిల్లీ, జూలై 19: ఎస్‌బిఐ, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్‌సహా మొత్తం 13 ప్రభుత్వరంగ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం దాదాపు 23 వేల కోట్ల రూపాయల మూలధనాన్ని కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) ప్రభుత్వరంగ బ్యాంకులకు కేంద్రం నుంచి అందాల్సిన ఆర్థిక సాయంలో ఇది తొలి విడత అవగా, బ్యాంకుల పనితీరుపైనే మరిన్ని నిధులు ఇవ్వాలా? వద్దా?

07/20/2016 - 07:48

ముంబయి, జూలై 19: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. 13 ప్రభుత్వరంగ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం మూలధన సాయంగా 23 వేల కోట్ల రూపాయలను అందించడం మదుపరులను పెట్టుబడుల వైపు నడిపించింది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో కీలకమైన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) ఆమోదం పొందుతుందన్న ఆశాభావం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది.

07/20/2016 - 07:47

బెంగళూరు, జూలై 19: దేశీయ ఐటి రంగంలో మూడో అతిపెద్ద సంస్థ అయిన విప్రో ఆర్థిక ఫలితాలు నిరాశపరిచాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్) గాను మంగళవారం ఇక్కడ విప్రో ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో 2,052 కోట్ల రూపాయల నికర లాభాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో 2,192 కోట్ల రూపాయల లాభాన్ని పొందింది.

07/20/2016 - 07:46

ముంబయి, జూలై 19: ముంబయిలోని ప్రఖ్యాత శ్రీ సిద్ధివినాయక ఆలయం.. డిమ్యాట్ అకౌంట్‌ను తెరిచింది. ఇదేంటి వినాయకుడేమైనా స్టాక్ మార్కెట్ లావాదేవీల్లోకి వెళ్తున్నాడా? అనుకుంటున్నారా.. అదేం కాదండి. ఎంతో శక్తివంతమైన దేవుడిగా పేరున్న సిద్ధివినాయకుడి భక్తుల్లో సంపన్నులు, వ్యాపార, పారిశ్రామికవేత్తలు అధికం. ఈ నేపథ్యంలోనే ఆలయ నిర్వాహకులు ఈ డిమ్యాట్ ఖాతాను ప్రారంభించారు.

07/20/2016 - 07:46

విశాఖపట్నం, జూలై 19: యువ శాస్తవ్రేత్తలను ప్రోత్సహించేందుకు జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో 1,023 కోట్ల రూపాయల ఖర్చుతో ఇన్నోవేషన్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని రాంకీ ఇండియా లిమిటెడ్ సిఇఒ డాక్టర్ పి లాల్‌కృష్ణ తెలిపారు. రాంకీ కమర్షియల్ హబ్‌లో మంగళవారం ఆయన ‘ఆంధ్రభూమి’తో మాట్లాడారు. సైంటిస్టులు ఔషధ ఫార్ములాలను తయారు చేసేందుకు కోట్లాది రూపాయలు పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుందన్నారు.

Pages